రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు | IND VS ENG 2nd ODI: Kohli has most runs by an Indian in England in International cricket | Sakshi
Sakshi News home page

రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు

Jul 16 2026 7:20 PM | Updated on Jul 16 2026 7:34 PM

IND VS ENG 2nd ODI: Kohli has most runs by an Indian in England in International cricket

రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.కార్డిఫ్‌ వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

4 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రాహుల్‌ ద్రవిడ్‌ (2645) పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1996 నుంచి 2011 వరకు ద్రవిడ్ ఇంగ్లండ్‌లో 46 మ్యాచ్‌ల్లో 2645 పరుగులు చేయగా.. కోహ్లి 59 మ్యాచ్‌ల్లో ద్రవిడ్‌ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్‌ (2646*), ద్రవిడ్‌ తర్వాతి స్థానాల్లో సచిన్‌ టెండూల్కర్‌ (2626), రోహిత్‌ శర్మ (2308*), సౌరవ్‌ గంగూలీ (1949) ఉన్నారు.

రిచర్డ్స్ రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు..!
ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కొనసాగుతున్నాడు. 1975 నుంచి 1991 మధ్య  అతడు 3402 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గిల్‌ (31), రోహిత్‌ (26), ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌ కాగా.. విరాట్‌ (45), శ్రేయస్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్‌ కర్రన్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement