రెండో వన్డేలో భారత్‌ ఓటమి | IND VS ENG 2nd ODI Updates and Highlights | Sakshi
Sakshi News home page

IND VS ENG 2nd ODI: రెండో వన్డేలో భారత్‌ ఓటమి

Jul 16 2026 5:05 PM | Updated on Jul 17 2026 1:39 AM

IND VS ENG 2nd ODI Updates and Highlights

కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికి, సీనియర్ బ్యాటర్ జోరూట్‌(133 బంతుల్లో 99 నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ డౌన్‌
ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 30 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌.. గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

విజయం దిశగా ఇంగ్లండ్‌
కార్డిఫ్‌ వన్డేలో ఇంగ్లండ్‌ విజయం దిశగా దూసుకుపోతుంది. 39 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 191-5. జోట్‌ రూట్‌ 87 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
జోస్‌ బట్లర్‌(17) రూపంలో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 30 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 148/5. క్రీజులో జో రూట్‌(69), విల్‌ జాక్స్‌(4) ఉన్నారు.

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్ డౌన్‌
సామ్‌ కుర్రాన్‌(26) రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ దూబే బౌలింగ్‌లో కుర్రాన్‌ ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ విజయానికి 140 పరుగులు కావాలి. క్రీజులో జో రూట్‌(40), జోస్‌ బట్లర్‌(0) ఉన్నారు.

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌
53 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌.. గుర్నూర్‌ బ్రార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కష్టాల్లో ఇంగ్లండ్‌
234 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. 8 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డకెట్‌ డకౌట్‌ కాగా.. బేతెల్‌ 4 పరుగులకు ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు.

తొలి బంతికే వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
234 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకెట్‌ ఔటయ్యాడు. 

233 పరుగులకు ఆలౌటైన భారత్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ కోహ్లి (65), శ్రేయస్‌ అయ్యర్‌ (66) రాణించడంతో భారత్‌ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 230 పరుగుల మార్కును తాకగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, అట్కిన్సన్‌ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్‌ మహమూద్‌ 2, సామ్‌ కర్రన్‌, విల్‌ జాక్స్‌ చెరో వికెట్‌ తీశారు.

వరుస బంతుల్లో అక్షర్‌, దూబే ఔట్‌
36వ ఓవర్‌లో భారత్‌ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఆర్చర్‌ వేసిన ఈ ఓవర్‌  నాలుగో బంతికి అక్షర్‌ పటేల్‌ (1), దూబే (0) ఔటయ్యారు. దీంతో భారత్‌ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
32.4వ ఓవర్‌- 181 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సాకిబ్‌ మహమూద్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి సుందర్‌ (2) ఔటయ్యాడు. 

కోహ్లి (65) ఔట్‌
31.4వ ఓవర్‌- 178 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (65) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
20.3వ ఓవర్‌- 111 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (1) ఔటయ్యాడు. 

రోహిత్‌ ఔట్‌
17.5వ ఓవర్‌- 104 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ (26) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
7.4వ ఓవర్‌- 44 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అట్కిన్సన్‌ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (31) ఔటయ్యాడు. 

ఆచితూచి ఆడుతున్న రోహిత్‌, గిల్‌
భారత్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ (9), శుభ్‌మన్‌ గిల్‌ (19) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 30-0గా ఉంది. 

టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌
కార్డిఫ్‌ వేదికగా భారత్‌తో జరుగనున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్‌ రాహుల్‌ స్వల్ప అస్వస్థతకు లోను కావడంతో, అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దించారు. 

ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఆ జట్టు రెండు మార్పులు చేసింది. టంగ్‌, డాసన్‌ స్థానాల్లో సాకిబ్‌ మహమూద్‌, అట్కిన్సన్‌ జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

తుది జట్టు..
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement