షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు | MLC 2026: Short one man show in vain as Freedom book final berth | Sakshi
Sakshi News home page

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

Jul 17 2026 3:11 PM | Updated on Jul 17 2026 3:21 PM

MLC 2026: Short one man show in vain as Freedom book final berth

credit: Sportzpics

స్టీవ్‌ స్మిత్‌ నాయకత్వం వహిస్తున్న వాషింగ్టన్ ఫ్రీడం జట్టు మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛాలెంజర్ మ్యాచ్‌లో ఆ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

గౌస్, స్మిత్, ఓవెన్ మెరుపులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం 20 ఓవర్లలో 6 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఎలిమినేటర్‌లో విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడిన ఆండ్రీస్ గౌస్ (40 బంతుల్లో 73 పరుగులు) మరోసారి చెలరేగాడు. అదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ (17 బంతుల్లో 43) కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. మిచెల్ ఓవెన్ (19 బంతుల్లో 42) సైతం మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. యూనికార్న్స్‌ బౌలర్లలో జేవియర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లు పడగొట్టాడు.

షార్ట్ ఒంటరి పోరాటం వృధా
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్‌ఫ్రాన్సిస్కో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి, లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ మ్యాట్ షార్ట్ (56 బంతుల్లో 121 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ.. తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అతడికి మరో ఎండ్‌లో ఎలాంటి సహకారం లభించలేదు.

చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు అవసరమైన సమయంలో సౌరభ్ నేత్రవాల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను ఫ్రీడం వైపు తిప్పాడు. చివరి ఓవర్‌లో 22 పరుగులు కాపాడుకున్న మిచెల్ ఓవెన్ ఫ్రీడంకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో వాషింగ్టన్ ఫ్రీడం వరుసగా రెండోసారి ఎంఎల్‌సీ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ కోసం లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement