ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల! | Slavko Vincic-Referee for World Cup final Shocking past With Argentina | Sakshi
Sakshi News home page

ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల!

Jul 17 2026 2:00 PM | Updated on Jul 17 2026 2:15 PM

Slavko Vincic-Referee for World Cup final Shocking past With Argentina

అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రిఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్ ఎంపికయ్యాడు. తాజా నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే, విన్సిచ్ గత రిఫరీ అనుభవాలు అర్జెంటీనాకు పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే.. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌కు విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించారు. 

ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు విన్సిచ్‌ పెనాల్టీని ఇచ్చ్చాడు. ఆ పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచాడు. అంతేకాదు విన్సిచ్  సౌదీ ఆటగాళ్లకు ఆరు యెల్లోకార్డులు చూపించాడు. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఫిఫాలో విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి చవిచూసిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

స్పెయిన్‌తో అనుబంధం..
అయితే విన్సిచ్‌కు స్పెయిన్‌తో మంచి అనుబంధముంది. స్పెయిన్ ఆడిన చాలా మ్యాచ్‌లకు విన్సిచ్‌  రిఫరీగా వ్యవహరించాడు.  2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌కు, యూరో 2020లో స్వీడన్‌, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, 2023 UEFA నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. యువ ఆటగాడు లామిన్ యమాల్ జట్టులో స్థిరమైన ఆటగాడిగా మారిన తర్వాత, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌తో పాటు, ఫిఫా 2026లో ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌కు కూడా విన్సిచ్‌ రిఫరీగా వ్యవహరించాడు.

అపఖ్యాతి
ఇక ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన విన్సిచ్, మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పియరో హింకాపీకి రెడ్ కార్డ్ చూపించి అపఖ్యాతి పాలయ్యాడు. దీంతో ఆదివారం న్యూయార్క్ వేదికగా అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో  విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వీఏఆర్ ద్వారా ఫిఫా నిశితంగా పరిశీలించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement