పావెల్‌ విధ్వంసం.. కేవలం 27 బంతుల్లో..! | MLC 2026: Powell blitzkrieg powers LAKR in stunning chase | Sakshi
Sakshi News home page

పావెల్‌ విధ్వంసం.. కేవలం 27 బంతుల్లో..!

Jul 4 2026 1:04 PM | Updated on Jul 4 2026 1:09 PM

MLC 2026: Powell blitzkrieg powers LAKR in stunning chase

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ (TSK)తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (LAKR) ఆటగాడు రోవ్‌మన్‌ పావెల్‌ చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

అతడికి ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (42 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించడంతో సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (4 వికెట్ల నష్టానికి) ఊదేసింది (6 వికెట్ల తేడాతో గెలుపు). పావెల్‌ ఒంటిచేత్తో నైట్‌రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ సాయితేజ ముక్కమల్ల 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతడికి మరో ఎండ్‌ నుంచి పెద్దగా సహకారం లభించికపోయినా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 

ఆఖర్లో వియాన్‌ ముల్దర్‌ (16 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో సూపర్‌ కింగ్స్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో డుప్లెసిస్‌ (14), రిలీ రొస్సో (2), ఫెరియెరా (2) నిరాశపరిచారు. షుభమ్‌ రంజనే (30 బంతుల్లో 28) ఓ మోస్తరు పరుగులు చేసినా బంతులు వృధా చేశాడు.

సూపర్‌ కింగ్స్‌పై నైట్‌రైడర్స్‌ గెలుపుతో మేజర్ లీగ్ క్రికెట్ 2026 పాయింట్ల పట్టిక మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టోర్నీలోని ఆరు జట్లూ సమానంగా ఆరు పాయింట్లతో నిలవడం పోటీని ఉత్కంఠభరితంగా మార్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement