ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం చవిచూసిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో మెరుపు అర్ధసెంచరీతో టీమిండియాను గెలిపించిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌లో మిగిలిన వన్డేకు దూరమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా బ్యాటింగ్‌కు ముందే వాషింగ్టన్ సుందర్ కండరాల నొప్పితో బాధపడ్డాడు.
ఫిజియో వద్ద చికిత్స తీసుకొని మైదానంలోకి అడుగుపెట్టిన సుందర్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో సుందర్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంగ్లండ్ సిరీస్‌లో చివరి వన్డేకు దూరమైనట్లు తెలుస్తోంది.
అతడు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశముందని సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ లెక్కన శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఏళ్ల సుందర్ ప్రస్తుతం టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 18 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు 937 పరుగులు సాధించాడు.
వదలని గాయాల బెడద
వరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతున్న టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి గాయాలతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా వాషింగ్టన్ సుందర్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సుందర్‌కు గాయాలు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో పక్కటెముకల్లో ఫ్రాక్చర్ కావడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న సుందర్ 2026 టీ20 ప్రపంచకప్ మధ్యలో జట్టులో జాయిన్ అయ్యాడు.


