లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గని పోలార్డ్‌ | MI New York Edge LA Knight Riders Thanks To Pollard’s Match Winning Knock, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గని పోలార్డ్‌

Jul 5 2026 2:48 PM | Updated on Jul 5 2026 5:10 PM

Pollard, Anderson guide MINY to top of the table

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ న్యూయార్క్ మరో కీలక విజయం సాధించింది. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (LAKR)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో న్యూయార్క్‌ నైట్ రైడర్స్‌పై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరింట న్యూయార్కే విజయం సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్‌ (34), మాథ్యూ ట్రాంప్‌ (44), రోవ్‌మన్‌ పావెల్‌ (23), జేసన్‌ హోల్డర్‌ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశాడు. ఎంఐ బౌలర్లలో బాష్‌, ఉగార్కర్‌ తలో 3 వికెట్లు తీశారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ 11.5 ఓవర్లలో 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. పోలార్డ్‌ (63 నాటౌట్‌), కోరె ఆండర్సన్‌ (37 నాటౌట్‌) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఎంఐను గెలిపించారు. వీరిద్దరూ చివరివరకు క్రీజ్‌లో ఉండటంతో ఎంఐ 19.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

చివరి ఓవర్‌లో ఎంఐ విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. లె రౌక్స్ వేసిన ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో బౌండరీ రాకపోయినా, ఐదో బంతిని ఆండర్సన్ లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచి జట్టుకు ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు.

లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గని పోలార్డ్‌
పోలార్డ్‌ 39 ఏళ్ల లేటు వయసులోనూ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఎంఐ ఫ్రాంచైజీకి కల్పతరువులా మారాడు. మ్యాచ్‌ అనంతరం పోలార్డ్‌ చేసుకున్న విజయోత్సవ సంబరాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement