మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.
తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.
ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్‌లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్‌ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.
ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.
ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు.


