వరుస ఓటములకు బ్రేక్‌.. జింబాబ్వేపై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ | Vaibhav Shines India Beat Zimbabwe By 7 Wickets, Check Out Match Highlights Inside | Sakshi
Sakshi News home page

IND vs ZIM: వరుస ఓటములకు బ్రేక్‌.. జింబాబ్వేపై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

Jul 23 2026 7:44 PM | Updated on Jul 24 2026 2:32 PM

India beat zimbabwe by 72 runs In Harare T20

PC: BCCI Twitter

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది.

భారత యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన రీఎంట్రీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే బ్రియాన్ బెనెట్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో ప్రిన్స్‌ యాదవ్‌ రెండు, దూబే, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు.

వైభవ్ వీర విహారం
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో అతడు బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్‌ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. 

అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌(35), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(28 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా 126 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. మయాంక్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement