జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.
కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు.
ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.
That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg
— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026


