'గంభీర్‌ వద్దు; లక్ష్మణ్‌ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞ‌ప్తి! | VVS Laxman Vs Gautam Gambhir, Will India Replace Head Coach After Zimbabwe Series Success? Read Full Story For Details | Sakshi
Sakshi News home page

'గంభీర్‌ వద్దు; లక్ష్మణ్‌ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞ‌ప్తి!

Jul 27 2026 9:25 AM | Updated on Jul 27 2026 10:31 AM

Reports-India-Players-Want-VVS Laxman-As-Permanent-Head-Coach

Photo Credit: BCCI Twitter

భార‌త మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆ ప‌ద‌విలో ఉన్న గంభీర్ కోచ్‌గా వ‌రుస వైఫ‌ల్యాలు చ‌విచూస్తున్న వేళ‌.. తాత్కాలిక కోచ్‌గా ల‌క్ష్మ‌ణ్ అద‌ర‌గొట్ట‌డంతో కోచ్ మార్పు చేయాలని కొంద‌రు టీమిండియా ఆట‌గాళ్లు బీసీసీఐ వ‌ద్ద వాపోయిన‌ట్లు స‌మాచారం. 

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను తొల‌గించి, అత‌డి స్థానంలో మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మణ్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా వ‌రుస వైఫ‌ల్యాలతో జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జ‌ట్టుతో పంపించారు. 

గంభీర్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వ‌రుస ఓట‌ములు చ‌విచూసిన కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ జింబాబ్వే గ‌డ్డ‌పై తొలి విజ‌యాన్ని అందుకున్నాడు. అంతేకాదు ల‌క్ష్మ‌ణ్ రాక‌తోనే శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజ‌యాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జ‌ట్టే అయిన‌ప్ప‌టికీ, వారిపై సాధించిన ఏక‌ప‌క్ష విజ‌యాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. 

దీంతో కెప్టెన్‌తో పాటు ప‌లువురు ఆట‌గాళ్లు గంభీర్‌ను తొల‌గించి ల‌క్ష్మ‌ణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాల‌ని బీసీసీఐకి విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో ల‌క్ష్మ‌ణ్‌కు హెడ్‌కోచ్ ప‌ద‌వి క‌ట్ట‌బెడితే, దానిని స్వీక‌రించ‌డానికి ల‌క్ష్మ‌ణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక టీమిండియా తాత్కాలిక కోచ్‌గా ల‌క్ష్మ‌ణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అత‌డి కోచింగ్‌లో టీమిండియా 2022లో వ‌రుస‌గా ఐర్లాండ్‌పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్‌పై 1-0తో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ లక్కీ కోచ్‌గా మారిపోయాడు. మ‌రి టీమిండియా కోచ్ మార్పు త‌ధ్య‌మేనా!

 

చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement