మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ! | Mirabai Chanu Shed Tears After-Winning Gold Medal-Weightlifting-CWG 2026 | Sakshi
Sakshi News home page

మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ!

Jul 27 2026 11:02 AM | Updated on Jul 27 2026 11:27 AM

Mirabai Chanu Shed Tears After-Winning Gold Medal-Weightlifting-CWG 2026

Photo Credit: IOA Twitter

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళా వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వ‌ర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేట‌గిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేట‌గ‌2ఇరీలో 105 కేజీలు.. మొత్తంగా 190 కేజీల బ‌రువు ఎత్తి దేశానికి తొలి స్వర్ణంప ప‌త‌కం అందించింది. మీరాబాయికి కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో వ‌రుస‌గా మూడో ప‌త‌కం. 

2018 గోల్డ్‌కోస్ట్‌, 2022 బ‌ర్మింగ్‌హ‌మ్ క్రీడ‌ల్లోనూ మీరాబాయి ప‌త‌కాలు సాధించింది. తాజాగా గ్లాస్కో వేదిక‌పై వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వ‌ర్ణం గెలిచిన మీరాబాయి ఫోడియంపై నిలబ‌డ్డ స‌మ‌యంలో జాతీయ గీతం ఆల‌పిస్తూ క‌న్నీటిప‌ర్యంతమ‌వ్వ‌డం వైర‌ల్‌గా మారింది. విజ‌యం త‌ర్వాత మీరాబాయి చాను మాట్లాడుతూ.. ‘వరుసగా మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. 

బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు గత రెండు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోలేదు. పసిడి పతకం గెలవడంతో నాపై ఉన్న ఒత్తిడి అంతా పోయింది. నేను చాలా సంతోషంగా, అలాగే చాలా ఉద్వేగంగా ఉన్నాను. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో ఇవాళ ప‌త‌కం గెల‌వ‌డం వెనుక ఎన్నో త్యాగాలు చేయ‌డంతో పాటు, ఒత్తిడిని, గాయాలను అధిగమించాను. 

నేను కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పుతానని అనుకోలేదు. కేవ‌లం నా కోచ్ అప్పగించిన బాధ్య‌త‌ను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారించాను. కష్టకాలంలో నా త‌ల్లితో పాటు కోచ్ విజయ్ శ‌ర్మ‌ అండగా నిలిచారు. కుటుంబం, స్నేహితుల నుంచి నాపై చాలా ఒత్తిడి ఉండేది. భార‌త్‌కు మూడో స్వర్ణం అందించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. 

ఈ క్రీడల్లో నేను పెద్దగా శ్రమ పెట్టకూడదని అనుకున్నాను, కానీ నా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. నేను చెరో రెండు లిఫ్టులు చేస్తానని కోచ్, నేను భావించాము.’ అని మీరాబాయి వ్యాఖ్యానించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ర‌జ‌తం, ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్ టైటిల్ సాధించిన మీరాబాయి తాజాగా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణం సాధించ‌డం ద్వారా కొత్త చ‌రిత్ర లిఖించింది.

 

 

Read: పాక్ బాక్స‌ర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement