no food
-
శ్రామిక రైళ్లలో ఆకలి కేకలు!
సాక్షి, న్యూఢిల్లీ: అది మంగళవారం. సమయం ఉదయం నాలుగు గంటలు. ముంబై నుంచి బిహార్‌లోని కటియార్‌కు వలస కార్మికులను తీసుకొని బయల్దేరిన ప్రత్యేక శ్రామిక రైలు. ఏవో ఏడ్పులు వినిపించడంతో 34 ఏళ్ల మొహమ్మద్ కలీముల్లా హఠాత్తుగా నిద్ర లేచారు. 58 ఏళ్ల సయ్యన్ కుమార్ సింగ్ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ స్టేషన్‌కు రైలు చేరుకోగా పోలీసులు వచ్చి కుమార్ సింగ్ మృతదేహాన్ని తీసుకుపోయారు. (వలస కార్మికులకు ఉపాధి ఎలా?) కుమార్ సింగ్ కరోనా లక్షణాలతో చనిపోలేదని, ఆయన రోజువారి బీపీ, సుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేందుకు పచ్చి మంచినీళ్లు కూడా దొరక్క పోవడంతో చనిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు. తాను ప్రయాణిస్తున్న రైల్లో మే 25వ తేదీన ఒక్క పూట భోజనం అందించారని, ఒక్క చుక్క నీరు కూడా ఎవరూ ఇవ్వలేదని కలీముల్లా ఆరోపించారు. అన్నం పెట్టకపోయినా ఫర్వాలేదని, మంచినీళ్లు ఇచ్చుంటే బాగుండేదని ఆయన వాపోయారు. మంగళవారం ఉదయం 6.15 గంటలకు ఆ రైలు వారణాసికి చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైలును నిలిపి వేశారు. ఆ సమయంలో కూడా అధికారులెవరూ మంచినీళ్లుగానీ, ఆహారంగానీ అందించలేదు. మంచినీళ్లు లేకపోతే కుమార్ సింగ్ లాగా తాము కూడా చనిపోతామని కలీముల్లా ఒంటి గంట ప్రాంతంలో సెల్‌ఫోన్ ద్వారా మీడియాకు అతికష్టం మీద తెలిపారు. దాహంతో నోరెండుకు పోవడంతో ఆయన నోటి నుంచి మాట సరిగ్గా రావడం లేదు. (‘రీడ్ అండ్ టేలర్’ కన్నీటి కథ) ఆ రైలు 36 గంటల్లో బిహార్‌లోని పాట్నాకు చేరుకోవాలి. మీడియా సంప్రతించేటప్పటికీ 40 గంటలు దాటిపోయింది. అయినా రైలు కనుచూపు మేరలోకి కూడా పోలేదు. ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దాదాపు అన్ని శ్రామిక రైళ్లు గంటలు, రోజులు ఆలస్యంగా నడుస్తున్నాయని, వేలాది మంది వలస కార్మికులు అన్నపానీయాలు లేక అలమటిస్తున్న ఉదంతాలు మీడియా దృష్టికి వస్తున్నాయి. కొన్ని రైళ్లలో కార్మికులు పేలాలు బుక్కి కడుపు నింపుకుంటున్నారు. వలస కార్మికుల తిరుగు ప్రయాణం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు, రైలు ప్రమాదాల్లో 200 మందికిపైగా కార్మికులు మరణించారు. మే 25వ తేదీ వరకు 44 లక్షల ప్రయాణికులను తరలించేందుకు భారతీయ రైల్వే 3,274 ప్రత్యేక శ్రామిక రైళ్లను నడిపినట్లు ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ తెలిపింది. -
అమ్మాయి పుట్టడం నేరమా..!
పట్టించుకోని భర్త, అత్తమామలు అత్తింటి నుంచి బయటకు గెంటేసిన వైనం ఐదురోజులుగా ఇంటి బయటే ఉంటున్న మహిళ దేవరపల్లి: ’కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా..’ అంటారు. అయితే ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా మహిళను, ఆమె బిడ్డను కనీసం చూడకపోగా అత్తింటికి వస్తే బయటకు నెట్టివేశారు. దీంతో ఐదు రోజులుగా తిండీ తిప్పలు, నిద్రాహారాలు మాని అత్తింటి గుమ్మంలోనే చంటిబిడ్డతో ఓ తల్లి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆడపిల్లను కనడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నిస్తోంది. బాధితురాలు కథనం ప్రకారం. తడికలపూడి మండలంలోని గొల్లగూడెంకు చెందిన పద్మకు, ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటకు చెందిన గురజాల సత్యనారాయణతో 2015 జులై 5న వివాహమైంది. పద్మకు గతేడాది ఆగస్టు 28న ఆడపిల్ల పుట్టింది. ఏడాది గడుస్తున్నా తల్లీబిడ్డలను అత్తింటికి తీసుకువెళ్లేందుకు భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు రావడం లేదు. అదిగో, ఇదిగో అంటూ కాలం వెళ్లదీయడంతో పాటు సత్యనారాయణ కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో తమను వదిలేశారని భావించిన పద్మ బిడ్డను తీసుకుని ఈనెల 5న మలసానికుంటలో అత్తింటికి వచ్చింది. అయితే ఆమెను ఇంట్లోకి రాన్వికుండా భర్త, అత్తమామలు, భర్త అన్న కృష్ణ అడ్డుకుని బయటకు నెట్టేశారు. దీంతో ఇంటి గుమ్మం వద్దే బిడ్డతో కలిసి పద్మ భీష్మించింది. దీంతో అత్తింటి కుటుంబం అంతా ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో వారికున్న పొలంలోని పాకలో ఉంటున్నారు. భర్త సత్యనారాయణ గ్రామంలో ఉండటం లేదని బాధితురాలు చెబుతోంది. ఐదు రోజులుగా అత్తింటి వద్ద ఆరుబయట పద్మ చంటి పాపతో న్యాయం కోసం ఎదురుచూస్తోంది. విషయం తెలిసిన ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు బాధితురాలు పద్మతో మాట్లాడారు. తనకు కేసు వద్దని, కాపురం నిలబడేలా చూడాలని పద్మ ఆయన్ను కోరింది. కేసులు, కోర్టులకు వెళితే కాపురం చెడిపోతుందని ఆమె ఆందోళన చెందుతోంది. ఫిర్యాదు చేయకుంటే తాము ఎలా న్యాయం చేయగలమని, ముందు ఫిర్యాదు ఇవ్వమని ఎస్సై ఆమెకు సూచించారు. -
ఆకలి రాజ్యం
-
ఆకలి కేకలు
అరకొర భోజనంతో అవస్థలు నిర్వాహకుల తీరుపై విద్యార్థుల ఆందోళన తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన సీతానగరం: అరకొర భోజనంతో ఎన్నాళ్లు అవస్థలు పడాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రోజులుగా ఇదే సమస్య. ఇక కడుపుమండిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇదీ బూర్జ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకున్న సంఘటన. ఈ పాఠశాలలో లక్ష్మీపురం, చెల్లంనాయుడువలస, బూర్జ, పెదంకలాం, కష్ణారాయపురం గ్రామాలకు చెందిన 408 మంది విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం పాఠశాలకు 354 విద్యార్థులు హాజరయ్యారు. అందులో 287 మందికి మధ్యాహ్న భోజనం పెట్టడానికి 40 కేజీల బియ్యం నిర్వాహకులకు ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నం పెట్టే సమయంలో వంటగదికి వెళ్ళిన విద్యార్థులు అన్నం లేదని చెప్పడంతో ఆకలితో ఉన్న 25 మంది విద్యార్థులు స్కూలు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కె.సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు మీడియా మిత్రులకు సమాచారం అందించారు. నెలలతరబడి ఇబ్బందులు పెడుతున్న హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జోక్యం చేసుకున్న ఎస్ఐ, తహసీల్దార్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
అన్నం పెట్టలేదని విద్యార్థుల ఆందోళన
సీతానగరం: వంటలు వండక విద్యార్ధులు పస్థులున్నారు. ఒకరోజుకాదు రెండు రోజులుకాదు నిరంతరం ఇదేపరిస్థతి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 25 మంది విద్యార్ధులు ఆకలిని తట్టుకోలేక ఆందోళ ణకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని బూర్జ ఉన్నత పాఠశాలలో 408 మంది విద్యార్ధు లు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్ధులందరికీ మధ్యాహ్న భోజన పధకం అమలు చెయ్యాల్సిఉంది. ఈ నేపద్యం లో శనివారం ఉదయం పాఠశాలకు 354 విద్యార్ధులు హాజర య్యారు. అందులో 287 మందికి మద్యాహ్న భోజనం పెట్టడానికి 40 కేజీల బియ్యం నిర్వాహకులకు ఇచ్చారు. ఇచ్చిన బియ్యం వంటచెయ్యడంలేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అలాగే హెచ్ఎం బియ్యం సక్రమంగా ఇవ్వక పోవడంతో అన్నం పెట్టక పోవడంతో ఆకలితో అలమటిస్తు ఆందోళణకు దిగారు. మద్యాహ్నం 1 గంటలకు అన్నం పెట్టే సమయంలో వంటగదికి వెళ్ళిన విద్యార్ధులు అన్నంలేదని చెప్పడంతో ఆకలితో ఉన్న 25 మంది విద్యార్ధులు స్కూలు ఎస్ఎంసీ చైర్మెన్ కె సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి పిర్యాదు చేసారు. హెచ్ఎంకు, భోజనపధకం నిర్వాహకులకు పలుమార్లు చెప్పినా ఫలితంలేదని అనడంతో మీడియాకు తెలియ జెయ్యాలని విద్యార్ధులకు చెప్పడంతో విద్యార్ధుల అకలి వెలుగులోకి వచ్చింది. నెలలతరబడి ఇబ్బందులు పాల్జేస్తున్న హెచ్ఎం ఎం క్రిష్ణమూర్తిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆకలితో ఉన్న విద్యార్ధులు తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎంసీ కమిటీ చైర్మెన్ సూర్యనారాయణ ఇంటిముందు దర్నా చేయగా, ఉన్నతపాఠశాల హెచ్ఎం కార్యాలయం వద్ద వందలాదిమంది విద్యార్ధులు సంఘీభావం తెలియజేస్తూ దర్నా చేసారు. విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలని కోరా- కె సూర్యనారయణ,ఎస్ఎంసీ చైర్మెన్ బూర్జ నేను గత శుక్రవారం విద్యార్ధులకు మాడిపోయిన అన్నం పెట్టారని పిర్యాదు చేసినపుడు భవిష్యత్‌లో సమస్యరాకూడదని చెప్పాను. అయినా హెచ్ఎం క్రిష్ణమూర్తి, మధ్యాహ్న భోజననిర్వాహకులు పట్టించు కోలేదు.ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలి విద్యార్ధులకు 150 గ్రాముల బియ్యం సరిపోవు -ఎం క్రిష్ణమూర్తి ,హెచ్ఎం, బూర్జ ప్రభుత్వం విద్యార్ధులకు మద్యాహ్నభోజన పధకం అమలుకు ఇస్తున్న 150 గ్రాముల బియ్యం చాలడంలేదు. శనివారం హాజరైన 354 విద్యార్ధులకు గాను 287 మందికి భోజనాలకు బియ్యం ఇచ్చాను. దీంతో అన్నంచాలక గొడవ చేసారు. -
‘టెన్’షన్..
. ట్యూషన్ ఉంటే ట్యూటర్ రారు.. చదువుదామంటే పుస్తకాలుండవు.. చదివీ చదివీ నీరసించినా సరైన ఆహారం ఉండదు.. ఇవీ ప్రభుత్వ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థుల పాట్లు. పేదోళ్ల బిడ్డలు పెద్ద చదువులు చదవాలని.. పదో తరగతిలోనే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని.. వారికి మంచి ఆహారం అందించి ప్రైవేటు క్లాసులు చెప్పాలన్న కనీస బాధ్యతలు ప్రభుత్వ వసతి గృహాల్లో సక్రమంగా అమలుకావడం లేదు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు పడుతున్న పాట్లపై సమరం సాగించేందుకు ‘సాక్షి’ నడుం కట్టింది. విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి బృందం పరిశీలన చేసింది. ప్రధానంగా టెన్త్ విద్యార్థులకు పౌష్టికాహారం, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రైవేటు క్లాసులు వంటివి సక్రమంగా అమలు కావడంలేదన్న సంగతి తేటతెల్లమైంది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని 43 ఎస్సీ హాస్టళ్లలో 1,021 మంది పదో తరగతి విద్యార్థులకు 172 మంది ట్యూటర్లు ఉన్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ డి.మధుసూదనరావు చెప్పారు. 62 బీసీ వసతి గృహాల్లో 758 మంది పదో తరగతి విద్యార్థులకు 99 మంది ట్యూటర్లు ఉన్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎం.చినబాబు తెలిపారు. వాస్తవంగా వసతి గృహాల్లో పేరుకే ట్యూషన్లు ఉన్నాయి. చాలాచోట్ల ట్యూటర్లు లేరు. ఉన్నా సకాలంలో రారు. వారికి ఇచ్చే నెలవారీ ట్యూషన్ ఫీజు సరిపోకవడంతో వాళ్లు కూడా వసతి గృహాల్లో ట్యూషన్ చెప్పేందుకు మొక్కుబడిగానే వస్తున్నారు. చాలా హాస్టళ్లలో ట్యూటర్లు రాకపోవడంతో బాలికలు సైతం రాత్రివేళ బయట ప్రాంతాలకు ప్రైవేటు క్లాసులకు వెళ్లిరావడం, అదీ సొంతంగా ప్రైవేటు ఫీజులు చెల్లించాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. మొక్కుబడిగా ‘ప్రైవేటు’ క్లాసులు... వసతి గృహాల్లో చదివే పదో తరగతి - విద్యార్థులకు ప్రైవేటు క్లాసుల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. హాస్టళ్లలో ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు లెక్కలు, సైన్స్ సబ్జెక్టులపై రెండు క్లాసులు, సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఇంగ్లిష్, హిందీ రెండు క్లాసులు చెప్పాలి. సబ్జెక్టుకు ఒకరు చొప్పున నలుగురు టీచర్లు ఉండాలి. ఇందుకోసం ఒక్కొక్కరికి నెలకు రూ.500 ట్యూషన్ ఫీజు ఇస్తారు. ఇటీవల దీనిని నెలకు రూ.1600 చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా అది అమల్లోకి రాలేదు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు హాస్టళ్లలో ట్యూటర్లుగా వస్తున్నారు. ట్యూషన్ల విషయంలో వసతి గృహాల నిర్వాహకులు శ్రద్ధ చూపకపోవడంతో అవి మొక్కుబడిగానే జరుగుతున్నాయి. ఉత్తీర్ణత శాతంపై నీలినీడలు... ఈ ఏడాది అనేక అవాంతరాల నడుమ సాగుతున్న చదువులతో పదో తరగతి ఉత్తీర్ణతపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. సమైక్య ఉద్యమంతో పాఠశాలలు మూతబడి చదువులు సాగలేదు. పోనీ వసతి గృహాల్లోనైనా ప్రైవేటు క్లాసులు సక్రమంగా సాగుతున్నాయా అంటే అదీ లేదు. గత ఏడాది కాలంగా వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వడంలేదు. జిల్లా విద్యాశాఖ తయారుచేసిన స్టడీ మెటీరియల్‌ను అందించి సరిపెడుతున్నారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం పరిశీలిస్తే ఎస్సీ హాస్టళ్లలో 2011లో 96.14 శాతం, 2012లో 83 శాతం, 2013లో 91.05 శాతం సాధించారు. బీసీ హాస్టళ్లలో 2011లో 94.6 శాతం, 2012లో 93.76 శాతం, 2013లో 95.79 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత శ్రద్ధ చేయకపోతే వసతి గృహాల్లో ఉత్తీర్ణత శాతం పడిపోయే ప్రమాదముందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. అరటి పండు లేదు.. పాలు ఇవ్వరు... ప్రభుత్వ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులు ఎక్కువ సమయం చదవడం వల్ల నీరసించకుండా వారికి పౌష్టికాహారం అందించాల్సి ఉంది. వసతి గృహాల్లో పెట్టే రెండు పూటల భోజనంతో పాటు అదనంగా వారికి రాత్రి చదువుకునే సమయంలో అరటి పండు, వేరుశెనగతో చేసిన ఆహారం, బిస్కెట్లు తదితర స్నాక్స్‌తో పాటు పాలు కూడా ఇవ్వాలి. చాలా వసతి గృహాల్లో అందరు విద్యార్థులతో పాటు అరకొర భోజనం మినహా ప్రత్యేకమైన పౌష్టికాహారం ఇవ్వడం లేదు. కొన్ని వసతి గృహాల్లో మాత్రం ట్యూటర్లు బాగానే పనిచేస్తున్నారు. కొందరు వార్డెన్లు కొంతవరకు పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకొచ్చిన పలు అంశాలివీ... మచిలీపట్నం రెండో నంబర్ హాస్టల్లో ట్యూటర్ రాలేదు. ఖాళీ కుర్చీ వద్దే విద్యార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. పెడనలోని రెండు హాస్టళ్లలో ట్యూటర్కు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడంలేదు. గత్యంతరం లేక విద్యార్థులు బయటకు వెళ్లి నెలకు రూ.150 చొప్పున సొంత డబ్బులు ఇచ్చి ప్రైవేటు క్లాసులు చెప్పించుకుంటున్నారు. మండవల్లి బీసీ హాస్టల్లో ట్యూటర్ లేకపోవడంతో విద్యార్థులు రాత్రి సమయాల్లోనూ రైల్వేట్రాక్ దాటుకుని బయట ప్రైవేటు క్లాసుకు వెళ్లివస్తున్నారు. కలిదిండి బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు కూడా రాత్రివేళ బయట ట్యూషన్‌కు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. కైకలూరు బీసీ హాస్టల్లో వార్డెనే ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. గుడివాడ బీసీ హాస్టల్లో ముగ్గురే విద్యార్థులు ఉండటంతో ట్యూటర్‌ను ఇవ్వలేదు. మైలవరంలో పౌష్టికాహారం గతేడాది నుంచి ఇవ్వడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బిస్కెట్లు, పాలు, అరటిపండ్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని చెబుతున్నారు కానీ బడ్జెట్ కేటాయించలేదు. నందిగామలో ట్యూటర్లు సకాలంలో రావడం లేదు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు హాస్టల్లో ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్ లేకపోవడంతో బయట ప్రైవేటు క్లాస్‌లకు వెళుతున్నారు. పామర్రు బీసీ బాలికల హాస్టల్లో ఏడుగురు ఉండటంతో ట్యూటర్ లేక సొంత డబ్బులతో బయటి ప్రైవేటుకు వెళుతున్నారు.