‘హ్యాండ్‌షేక్‌’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్‌! | Travis Head Breaks Silence On Virat Kohli Handshake Controversy During IPL 2026, Says Their Relationship Remains Normal | Sakshi
Sakshi News home page

కోహ్లితో ‘హ్యాండ్‌షేక్‌’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్‌!

Jul 25 2026 10:58 AM | Updated on Jul 25 2026 11:14 AM

Travis Head Breaks Silence-Kohli Handshake Drama-During IPL-2026

Photo Credit: IPL Twitter

ఐపీఎల్ 2026 సీజ‌న్ స‌మ‌యంలో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్‌ల మ‌ధ్య షేక్ హ్యాండ్ ఘ‌ట‌న ఎంత పెద్ద వివాదంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజాగా ఐపీఎల్ ముగిసిన రెండు నెల‌ల త‌ర్వాత హెడ్ 'హ్యాండ్‌షేక్‌'  వివాదం ఘ‌ట‌న‌పై మౌనం వీడాడు. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత హెడ్‌, కోహ్లి మ‌ధ్య బంధం పూర్తిగా చెడిపోయిందంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. 

తాజాగా ఈ పుకార్ల‌పై హెడ్ స్పందిస్తూ.. 'మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లితో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు' అని స్పష్టం చేశాడు. అయితే మైదానంలో జ‌రిగే విష‌యాల‌ను ఒక ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్‌గా స్వీక‌రిస్తాన‌ని, కానీ సోష‌ల్ మీడియాలో త‌న కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డం బాధించింద‌ని హెడ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

'ఇలాంటి ఘ‌ట‌న‌లు క్రీడా ప్ర‌పంచంలో స‌హ‌జ‌మేన‌ని నేను, జెస్సికా ముందే గ్రహించాం. కానీ కొంత‌మంది ప‌నిగ‌ట్టుకొని నా కుటుంబంపై అసభ్య‌క‌ర కామెంట్లు చేయ‌డం కాస్త ఇబ్బందిగా అనిపించింది. జెస్సికా ఈ పరిస్థితిపై చాలా ప‌రిణితితో వ్య‌వ‌హ‌రించ‌డంతోనే స‌మ‌స్య పెద్ద‌ది కాలేదు. మ‌రో ఐపీఎల్ వ‌చ్చేస‌రికి ఇలాంటి సంఘ‌ట‌న‌లు అంద‌రూ మ‌ర్చిపోతారు. కానీ ఇలాంటి విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్న కొంద‌రు మాత్రం అదే ప‌నిగా ఆట‌గాళ్ల కుటుంబాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా టార్గెట్ చేసి వేధించ‌డం నిజంగా బాధాక‌రం.' అని హెడ్ విచారం వ్య‌క్తం చేశాడు.

ఆరోజు ఏం జ‌రిగింది?
ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మే 22న జరిగిన ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్‌ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్‌ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్‌ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్‌షేక్‌లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్‌ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్‌, అభిషేక్‌ శర్మలతో మాట్లాడి.. హెడ్‌ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో వైర‌ల్ అయింది.

Read: పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్‌ ప్లేయర్‌ నిరాకరణ!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement