సింధు శుభారంభం | PV Sindhu has reached the pre quarterfinals of the Australian Open | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Jun 11 2026 3:18 AM | Updated on Jun 11 2026 3:18 AM

PV Sindhu has reached the pre quarterfinals of the Australian Open

సిడ్నీ: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత మహిళా స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–13, 21–11తో ఇనెస్‌ లూసియా కాస్టిలో (పెరూ)పై గెలిచింది. భారత్‌కే చెందిన మాళవిక, తన్వీ శర్మ, ఇషారాణి కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి, కిరణ్‌ జార్జి, సనీత్‌ దయానంద్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగమ్మాయి కె.మనీషా–ధ్రువ్‌ రావత్‌ (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement