నితిన్‌-లికితా జోడికి స్వర్ణం | Nitin-Likhita Srivastava-Won GOLD Medal In Mixed Doubles-National Tourney | Sakshi
Sakshi News home page

నితిన్‌-లికితా జోడికి స్వర్ణం

Jun 15 2026 1:30 PM | Updated on Jun 15 2026 3:50 PM

Nitin-Likhita Srivastava-Won GOLD Medal In Mixed Doubles-National Tourney

పుణే వేదికగా జరిగిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు సత్తా చాటారు. హైదరాబాద్‌లోని సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన నితిన్ కుమార్‌-లికితా శ్రీవాస్తవ జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. టోర్నీలో పాల్గొన్న టాప్ జోడీ షట్లర్లను ఓడించిన ఈ జోడీ తొలి స్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.

కాగా నితిన్‌-లికితా జోడికి ఇది వరుసగా రెండో మిక్సడ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇటీవలే మరో జాతీయ టోర్నీలోనూ ఈ జోడీ గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. మహిళల డబుల్స్ విభాగంలో లికితా శ్రీవాస్తవ తన పార్టరర్ శ్రేయ బాలాజీతో కలిసి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా హైదరాబాద్‌లోని సుచిత్రా బ్యాడ్మింటన్ అకాడమీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టేలా చేయడంలో విజయవంతమయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement