సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సింధు 22–20, 21–12తో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై... తన్వీ శర్మ 21–13, 21–15తో సహచరిణి మాళవిక బన్సోద్‌పై విజయం సాధించారు.
భారత్‌కే చెందిని తాన్యా హేమంత్ 12–21, 15–21తో చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ (భారత్) ద్వయం 21–17, 21–7తో డైలాన్ సోసా–మైకేల్ ఒవెన్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కె.మనీషా–ధ్రువ్ రావత్ (భారత్) జోడీ 19–21, 18–21తో అకీరా కొగా–నత్సు సైటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది.


