సెమీస్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం | PV Sindhu Australian Open 2026 Campaign Ends With Semi-Final Loss To Akane Yamaguchi, More Details Inside | Sakshi
Sakshi News home page

Australian Open 2026: సెమీస్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం

Jun 13 2026 3:04 PM | Updated on Jun 13 2026 4:23 PM

PV Sindhu loses Australian Open semifinal To Akane Yamaguchi

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2026 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధూ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శ‌నివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీఫైన‌ల్లో సింధు 20-22, 12-20తో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, జపాన్‌కు చెందిన అకానే య‌మాగుచి చేతిలో ఓట‌మి చ‌విచూసింది. మ్యాచ్‌ను సింధూ మంచి ఈజ్‌తోనే ప్రారంభించింది. 

43 నిమిషాల పాటు సాగిన ఆటలో.. తొలి గేమ్‌లో సింధూ దూకుడుకు ఒక ద‌శ‌లో 12-6తో య‌మాగుచి వెనుక‌బ‌డింది. అయితే బ్రేక్ త‌ర్వాత వ‌రుస‌గా ఆరు పాయింట్లు సాధించిన య‌మాగుచి సింధూను దాటేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివ‌ర‌కు 20-22తో య‌మాగుచి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

ఇక రెండో గేమ్‌లో సింధూ పూర్తిగా తేలిపోయింది. 13-6తో య‌మాగుచి స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలిచింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఏడు పాయింట్లు సాధించి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఓట‌మితో 2026 సీజ‌న్‌లో తొలి బీడ‌బ్ల్యూఎఫ్ టైటిల్ అందుకోవాల‌న్న సింధూ క‌ల తీర‌లేదు. కాగా ఈ సీజ‌న్ బీడ‌బ్ల్యూఎఫ్ టూర్‌లో సింధూకు ఇది రెండో సెమీఫైన‌ల్ ఓట‌మి కావ‌డం కావ‌డం గ‌మనార్హం.

జ‌న‌వ‌రిలో జ‌రిగిన మ‌లేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలోనూ సింధూ సెమీస్‌లో చైనా ష‌ట్ల‌ర్ వాంగ్ జియి చేతిలో ఓడి ఇంటిబాట ప‌ట్టింది. ఇక బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ టైటిల్ కోసం సింధూ రెండేళ్లుగా చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తూనే వ‌స్తోంది. చివ‌ర‌గా పీవీ సింధు 2024లో ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన స‌య్య‌ద్ మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌ వరకు మంచి ప్రదర్శనలు చేయడంతో ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు టాప్-10లో కొనసాగుతోంది.

చదవండి: ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement