సమిత్‌ ద్రవిడ్‌ ఆల్‌రౌండ్‌ షో | Samit Dravid all round show goes in vein, Shivamogga Yodhas beat Kalyani Bengaluru Blasters in KSCA T20 2026 finals | Sakshi
Sakshi News home page

సమిత్‌ ద్రవిడ్‌ ఆల్‌రౌండ్‌ షో

Jul 14 2026 4:33 PM | Updated on Jul 14 2026 4:48 PM

Samit Dravid all round show goes in vein, Shivamogga Yodhas beat Kalyani Bengaluru Blasters in KSCA T20 2026 finals

కేఎస్‌సీఏ టీ20 టోర్నీ (మహారాజా ట్రోఫీ-2026) ఫైనల్లో భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ లీగ్‌లో కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్‌కు ఆడే సమిత్.. శివమొగ్గ యోధాస్‌తో జరిగిన తుది పోరులో బంతితో, బ్యాట్‌తో రాణించినప్పటికీ, తన జట్టును విజేతగా నిలబెట్టలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సమిత్‌.. జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేశాడు.

ఆ తర్వాత బౌలింగ్‌లోనూతనదైన ముద్ర వేశాడు. 3.4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన తర్వాత కూడా సమిత్‌ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. వారు నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని శివమొగ్గ యోధాస్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) ఛేదించారు.

కెప్టెన్‌ లవ్నిత్‌ సిసోడియా (87) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును గెలిపించుకున్నాడు. అతనికి  అనీశ్‌ (38), నవీన్‌ (24) సహకరించారు. సమిత్‌ 4 వికెట్లతో యోధాస్‌పై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో శివమొగ్గ యోధాస్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement