breaking news
KSCA tournament
-
పాపం పడిక్కల్.. వెంట్రుక వాసిలో సెంచరీ మిస్సయ్యాడు..!
కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో హుబ్లీ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ లీడింగ్ రన్ స్కోరర్‌గా (11 మ్యాచ్‌ల్లో 439 పరుగులు, 5 అర్ద సెంచరీలు) కొనసాగుతున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్ 26) మంగళూరు డ్రాగన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంట్రుక వాసిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 98 పరుగుల వద్ద పడిక్కల్‌కు సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ చేజార్చుకున్నాడు. 19వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ మాత్రమే తీసి 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. పడిక్కల్ ఆ బంతికి సింగిల్ తీయకుండా ఉండి, చివరి బంతిని ఎదుర్కొని ఉంటే సెంచరీ పూర్తి చేసకునే అవకాశం ఉండేది. అయితే సింగిల్‌తో సంతృప్తి చెందిన అతడు.. 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిపోయాడు. చివరి బంతిని ఎదుర్కొన్న మన్వంత్ కుమార్ సిక్సర్ బాది టైగర్స్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పడిక్కల్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు సన్‌రైజర్స్ ఆటగాడు అభినవ్ మనోహర్ కూడా చెలరేగాడు. మనోహర్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. పడిక్కల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన మొహమ్మద్ తాహా 28 బంతుల్లో 37, మన్వంత్ కుమార్ 6 బంతుల్లో 16 పరుగులు చేశారు.మంగళూరు బౌలర్లలో రోనిత్ మోరే, క్రాంతి కుమార్ తలో వికెట్ తీశారు.కాగా, ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పడిక్కల్ తొడ కండరాల సమస్య కారణంగా సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 247 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. పడిక్కల్ వైదొలగడంతో ఆర్సీబీ అతని స్థానాన్ని మరో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో భర్తీ చేసింది. -
సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ మెరుపు వీరుడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు వీరుడు స్మరన్ రవిచంద్రన్ స్వరాష్ట్రమైన కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. స్మరన్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 157.29 స్ట్రయిక్‌రేట్‌తో 75.50 సగటున 302 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు విధ్వంసకర అర్ద శతకాలు ఉన్నాయి.తన రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లో అజేయమైన 52 పరుగులు చేసిన స్మరన్.. ఐదో మ్యాచ్‌లో 39 బంతుల్లో 52.. ఆరో మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 53 పరుగులు.. తాజాగా ఎనిమిదో మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు. స్మరన్ మెరుపు ప్రదర్శనలతో దూసుకుపోతుండటంతో అతని జట్టు గుల్బర్గా మిస్టిక్స్ కూడా వరుస విజయాలతో అదరగొడుతుంది. ఈ టోర్నీలో స్మరనే మిస్టిక్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.22 ఏళ్ల స్మరన్ తాజా ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా గాయపడి ఒక్క మ్యాచ్‌కే నిష్క్రమించాడు. స్మరన్‌కు భారీ హిట్టర్‌గా పేరుంది. ఎంతటి బౌలింగ్‌లో అయినా స్మరన్ అలవోకగా షాట్లు బాదగలడు. గత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే స్మరన్పై 30 లక్షల పెట్టుబడి పెట్టింది. అయితే అతను ఒక్క మ్యాచ్‌కే గాయపడి వైదొలిగాడు.మహారాజా టోర్నీలో తాజా ప్రదర్శనల తర్వాత స్మరన్ పేరు మార్మోగిపోతుంది. ఈసారి అతడు ఐపీఎల్ వేలంలో హాట్ కేక్‌గా అమ్ముడుపోతాడని అంచనాలు ఉన్నాయి. స్మరన్‌ను సన్‌రైజర్సే తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అతడిపై 2 లేదా 3 కోట్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
కేకేఆర్ ఆటగాడి మెరుపు ప్రదర్శన.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సవాల్
కేఎస్‌సీఏ మహారాజా టీ20 టోర్నీలో కేకేఆర్ ఆటగాడు లవ్నిత్ సిసోడియా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో గుల్బర్గా మిస్టిక్స్‌కు ఆడుతున్న అతు.. నిన్న (ఆగస్ట్ 16) శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర అర్ద శతకం బాదాడు. ఫలితంగా అతని జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్.. 15.5 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. దీంతో లయన్స్ ఇన్నింగ్స్‌ను ఆక్కడే ఆపేసి, వీజేడి పద్దతి ప్రకారం గుల్బర్గా లక్ష్యాన్ని 9 ఓవర్లలో 93 పరుగులకు కుదించారు.LUVNITH SISODIA MAGIC IN MAHARAJA TROPHY...!!!- Chasing 92 runs from 9 overs, Luvnith 58*(24) & Nikin Jose 34*(15) madness in the chase for Gulbarga Mystics. 🤯👌pic.twitter.com/qRKcJ0rz5O— Johns. (@CricCrazyJohns) August 16, 2025వర్షం తగ్గాక ఛేదన మొదలుపెట్టిన గుల్బర్గా కళ్లు మూసి తెరిచేలోగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సిసోడియా మెరుపు ఇన్నింగ్స్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు) ఆడి తన జట్టును గెలిపించాడు. అతనికి మరో ఓపెనర్ నికిన్ జోస్ (15 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.వీరిద్దరి ధాటికి గుల్బర్గా 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సిసోడియా, జోస్ జోడీ లయన్స్ బౌలర్ విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌ను చీల్చి చెండింది. అతను వేసిన 2 ఓవర్లలోనే ఏకంగా 40 పరుగులు పిండుకుంది.అంతకుముందు ధృవ్ ప్రభాకర్ (44) రాణించడంతో లయన్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తుషార్ సింగ్ (22), నిహాల్ ఉల్లాల్ (17), అనిరుద్దా జోషి (15 నాటౌట్), హార్దిక్ రాజ్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుల్బర్గా బౌలర్లలో శశి కుమార్ 2, విజయ్ కుమార్ వైశాక్, మోనిశ్ రెడ్డి తలో వికెట్ తీశారు.కేకేఆర్ యాజమాన్యానికి సవాల్కర్ణాటకకు 25 ఏళ్ల లవ్నిత్ సిసోడియాను (లెఫ్ట్ హ్యాండర్) ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో సిసోడియాకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. సిసోడియా మెరుపు బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు. ఈ సీజన్ మహారాజా ట్రోఫీలో సిసోడియా ప్రదర్శనలను కేకేఆర్ యాజమాన్యం పరిశీలిస్తూ ఉంటుంది. ఈ ప్రదర్శనలతో సిసోడియా కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసురుతున్నాడు. సిసోడియా ఇదే ప్రదర్శనలను కొనసాగిస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు. -
టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..?
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025లో అన్క్యాప్టెడ్ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ తాహా తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ టోర్నీలో హుబ్లి టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తహా పరుగులు వరదపారిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లలో సెంచరీలతో సత్తాచాటాడు.తొలుత ఆగస్టు 12న శివమొగ్గ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసిన తాహా.. అనంతరం ఆగస్టు 13న బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో మళ్లీ 101 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌లలోనే మొత్తంగా 202 పరుగులు చేసిన తహా.. ఈ ఏడాది టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 190కు పైగా ఉండడం విశేషం. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికేశాడని పోస్ట్‌లు పెడుతున్నారు. మరి కొంతమంది ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలో అతడిపై కాసుల వర్షం కురువనుందని అభిప్రాయపడుతున్నారు.ఎవరీ తాహా?బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల తహా మహ్మద్ తాహా 2016లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరపున టీ20 అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. దీంతో ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు. చివరిసారిగా 2017లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తరపున ఆడాడు.ఓవరాల్ కర్ణాటక తరపున 5 టీ20లు ఆడి 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తహాకు రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఐపీఎల్-2012 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నెట్ బౌలర్‌గా తాహా పని చేశాడు. అతడు విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్లకు బౌలింగ్ చేశాడు.ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. మహమ్మద్ తహా టన్‌బ్రిడ్జ్ హై స్కూల్లో చదువుకున్నాడు.తరువాత జైన్ విశ్వవిద్యాలయం నుండి బి.కామ్ డిగ్రీని పూర్తి చేశాడు. తహా తన 16 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తహా తండ్రి అతన్ని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (KIOC) జాయిన్ చేశాడు. 2015లో తన తండ్రి మరణించిన తర్వాత పార్ట్ టైమ్ కోచ్‌గా పని చేస్తూ కుటంబాన్ని పోషించినట్లు ఓ ఇంటర్వ్యూలో తాహా పేర్కొన్నాడు.చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం -
మనీశ్ పాండే విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే..!
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్ వారియర్స్ కెప్టెన్ మనీశ్ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిన్న (ఆగస్ట్ 11) బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడుCAPTAIN MANISH PANDEY SHOW. 👑- 58* runs from just 29 balls including 4 fours & 4 sixes in his first match in Maharaja Trophy 2025. pic.twitter.com/2kDjibBYqS— Johns. (@CricCrazyJohns) August 11, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మైసూర్ ఇన్నింగ్స్‌లో మనీశ్‌తో పాటు సుమిత్ కుమార్ (28 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), హర్షిల్ ధర్మాణి (31 బంతుల్లో 38; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో శుభాంగ్ హేగ్డే 3 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన బ్లాస్టర్స్.. ఎల్ఆర్ కుమార్ (4-0-27-3), అజిత్ కార్తీక్ (3.2-0-21-3), కృష్ణప్ప గౌతమ్ (4-0-28-2) ధాటికి 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (66) బ్లాస్టర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.కాగా, మహారాజా ట్రోఫీ అనేది కర్ణాకటలో జరిగే స్థానిక టీ20 టోర్నీ. ఈ టోర్నీ యొక్క నాలుగో ఎడిషన్ నిన్ననే మొదలైంది. వాస్తవానికి ఈ టోర్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే మహిళల వరల్డ్‌కప్ ఏర్పాట్లలో భాగంగా వేదికను మైసూర్‌లోని వడియార్ క్రికెట్ స్టేడియంకు మార్చారు. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. మనీశ్ పాండే నేతృత్వంలోని మైసూర్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, అభినవ్ మనోహర్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఆర్సీబీ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో అత్యధిక ధర
నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్‌ను హుబ్లీ టైగర్స్ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది. పడిక్కల్ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్‌రైజర్స్ హిట్టర్ అభినవ్ మనోహర్ (12.20 లక్షలు), కేకేఆర్ వెటరన్ మనీశ్ పాండే (12.20 లక్షలు), విధ్వత్ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్ పాటిల్ (8.40 లక్షలు) నిలిచారు.ఈ వేలంలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సమిత్ మైసూర్ వారియర్స్‌కు ఆడాడు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్ నాయర్ (6.8 లక్షలు), ప్రసిద్ద్ కృష్ణ (2 లక్షలు), మయాంక్ అగర్వాల్ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.జట్ల వివరాలు..శివమొగ్గ లయన్స్కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్ బాల్గార్మైసూర్ వారియర్స్కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్మంగళూరు డ్రాగన్స్అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్ కుమార్ దాస్హుబ్లీ టైగర్స్కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్, నాథన్ మెల్లో, నిశిచిత్ పాయ్గుల్బర్గా మిస్టిక్స్వైషాక్ విజయ్‌కుమార్, లువ్నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్‌జె నికిన్ జోస్, ప్రజ్వల్ పవన్, యూనిస్ అలీ బేగ్, లిఖిత్ బన్నూర్బెంగళూరు బ్లాస్టర్స్మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్ -
సిక్సర్లతో శివాలెత్తిపోయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్
మహారాజా టీ20 టోర్నీలో షిమోగా లయన్స్ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అభినవ్ మనోహర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ 10 మ్యాచ్‌ల్లో 6 అర్ద సెంచరీల సాయంతో 84.50 సగటున 507 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అభినవ్ ఏకంగా 52 సిక్సర్లు బాదాడు.నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ అభినవ్ మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్ 24 బంతుల్లో 7 సిక్సర్లు, బౌండరీ సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన షిమోగా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో అభినవ్‌తో పాటు మోహిత్ (56), రోహన్ నవీన్ (45) కూడా విజృంభించారు. బ్లాస్టర్స్ బౌలర్లలో ఆతిథ్య గోయల్ 2 వికెట్లు పడగొట్టగా.. సంతోక్ సింగ్, ప్రతీక్ జైన్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బ్లాస్టర్స్.. సూరజ్ అహూజా (82 నాటౌట్), శుభంగ్ హేగ్డే (85 నాటౌట్) వీర బాదుడు బాదడంతో మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్లాస్టర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. షిమోగా బౌలర్లలో శరత్ 2, రాజ్వీర్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అభినవ్ చెలరేగినా అతని జట్టు షిమోగా లయన్స్ ఓడిపోవడం విచారకరం. -
భీకర ఫామ్‌లో కరుణ్ నాయర్.. మరో మెరుపు ఇన్నింగ్స్
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ సారథి కరుణ్ నాయర్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో నాయర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 426 పరుగులు చేశాడు. తాజాగా హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. కరుణ్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కొదండ కార్తీక్ (30), కార్తీక్ (29), సుచిత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టైగర్స్ బౌలర్లలో ఎల్ఆర్ కుమార్, మాధవ్ ప్రకాశ్ బజాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరియప్ప, రిషి బొపన్న చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. వారియర్స్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 18.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీవత్సవ. సుచిత్. ధనుశ్ గౌడ, మనోజ్ భాంగడే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిగ చెరో వికెట్ దక్కించుకున్నారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ తాహా (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మనీశ్ పాండే (14), శ్రీజిత్ (13), అనీశ్వర్ గౌతమ్ (11), కరియప్ప (11), ఎల్ఆర్ కుమార్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్‌తో నిన్న (ఆగస్ట్ 19) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కరుణ్ తన శతకాన్ని కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పూర్తి చేశాడు. KARUN NAIR SMASHED 124* (48). 🤯- A swashbuckling century in the Maharaja Trophy by Nair. A quality knock at the Chinnaswamy Stadium. 👌pic.twitter.com/cnXYiAZutv— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2024ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 13 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కరుణ్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ 16, అజిత్ కార్తీక్ 11, కార్తీక్ 23, సుమిత్ కుమార్ 15 పరుగులు చేశారు. అఖర్లో బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ భాంగడే 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డ్రాగన్స్ బౌలర్లలో అభిలాష్ షెట్టి 2 వికెట్లు పడగొట్టగా.. నిశ్చిత్ రావు, డర్శన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వారియర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో వీజేడీ పద్దతిన డ్రాగన్స్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 166 పరుగులుగా నిర్దారించారు.చేతులెత్తేసిన డ్రాగన్స్14 ఓవర్లలో 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డ్రాగన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో నికిన్ జోస్ (32), కృష్ణమూర్తి సిద్ధార్థ్ (50), రోహన్ పాటిల్ (12), దర్శన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫలితంగా ఆ జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అజిత్ కార్తీక్, జగదీశ సుచిత్ తలో రెండు వికెట్లు తీసి డ్రాగన్స్‌ను దెబ్బకొట్టారు. -
మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్.. గుల్బర్గాదే మహారాజా ట్రోపీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టి20 లీగ్ 2022 తొలి సీజన్ విజేతగా మనీష్ పాండే నేతృత్వంలోని గుల్బర్గా మైస్టిక్స్ నిలిచింది. శుక్రవారం రాత్రి బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్లో గుల్బర్గా 11 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన మనీష్ పాండే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మైస్టిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్(42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు నాటౌట్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బుల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్ఆర్ చేతన్ (40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు బుల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది. Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL — Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022 చదవండి: Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
హెచ్‌సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్‌లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు
కేఎస్‌సీఏ టోర్నీ ఫైనల్లో ఆంధ్ర జట్టు సాక్షి, విజయవాడ: కెప్టెన్ శ్రీకర్ భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు సాధించడంతో... కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో మైసూరులో జరుగుతోన్న తిమ్మ ప్పయ్య ఇన్విటేషన్ జాతీయ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేఎస్‌సీఏ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితాన్ని టాస్ ద్వారా నిర్ణయించారు. మ్యాచ్‌లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించడానికి టాస్ నిర్వహించగా... ఇందులో ఆంధ్ర జట్టును విజయం వరించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 191.3 ఓవర్లలో 6 వికెట్లకు 591 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ (492 బంతుల్లో 218; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు), సుమంత్ (363 బంతుల్లో 202 నాటౌట్; 21 ఫోర్లు, ఒక సిక్స్) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం కేఎస్‌సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 310 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అభిషేక్ రెడ్డి (155 నాటౌట్; 16 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (100 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలు సాధించారు.