
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ-2025 ఛాంపియన్స్‌గా మంగళూరు డ్రాగన్స్ నిలిచింది. గురువారం మైసూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 14 పరుగుల తేడాతో(విజేడి పద్దతి) హుబ్లి టైగర్‌ను ఓడించిన మంగళూరు.. తొలి మహారాజా ట్రోఫీని ముద్దాడింది.
ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లి టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హుబ్లి బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తహా(27), మనోహర్(17) రాణించారు. మంగళూరు బౌలర్లలో సచిన్ షిండే మూడు వికెట్లు పడగొట్టగా.. మాక్నీల్ నోరోన్హా, ఆచార్య తలా రెండు వికెట్లు సాధించారు.
అనంతరం లక్ష్య చేధనలో మంగళూరు స్కోర్ 10.4 ఓవర్లలో 82/2 వద్ద ఉండగా వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో విజేడి పద్దతి ద్వారా మంగళూరు డ్రాగన్స్‌కు విజేతగా నిర్ణయించారు.
అయితే ఈ విజయంలో మంగళూరు ఆటగాడు శరత్ బీఆర్‌ది కీలక పాత్ర. 155 పరుగుల లక్ష్య చేధనలో శరత్ దూకుడుగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో శరత్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా.. దేవ్‌దత్త్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు వరించింది.
కాగా ఇప్పటివరకు మహారాజా ట్రోఫీలో నాలుగు సీజన్లు జరగాయి. తొలి సీజన్ విజేతగా గుల్బర్గా మిస్టిక్స్.. 2023, 2024 ఎడిషన్స్‌లో వరుసగా హుబ్లి టైగర్స్, మైసూర్ వారియర్స్ ఛాంపియన్స్ నిలిచారు. ఇప్పుడు మంగళూరు జట్టు సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది.
చదవండి: Asia cup 2025: ఈ జట్టుతో ప్రపంచకప్ గెలుస్తారా..? వారిద్దరిని ఎందుకు ఎంపిక చేశారు?