
ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన భారత జట్టుపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు.
తాజాగా సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. హర్షిత్ రాణా, రింకూ సింగ్‌లను ఏ ప్రాతిపాదికిన ఎంపిక చేశారని శ్రీకాంత్ ప్రశ్నించాడు. కాగా రింకూ, హర్షిత్ రాణాలు ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఐపీఎల్-2025లో కూడా అంతంత మాత్రమే రాణించారు. అయినప్పటికి సెలక్టర్లు వారికి ఛాన్స్ ఇవ్వడం అందరిని ఆశ్యర్యపరిచింది.
"ఆసియాకప్ గెలవడానికి సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టు సరిపోవచ్చు. కానీ ఈ జట్టుతో టీ20 ప్రపంచ కప్ గెలిచే అవకాశం లేదు. టీ20 వరల్డ్‌కప్‌కు కేవలం ఇంకా ఆరు నెలల మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌కు మీ సన్నహకాలు ఇవేనా? సెలక్టర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వింతంగా అన్పించాయి.
రింకూ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఎందుకు ఎంపిక చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. ఐపీఎల్‌ను ప్రమాణాకంగా తీసుకుని ఎంపిక చేయొచ్చు.. కానీ మనకు నచ్చిన ఆటగాళ్లను మాత్రం సెలక్ట్ చేయకూడదు. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాము.
ఐదవ స్ధానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? హార్దిక్ సాధారణంగా ఆ స్దానంలో బ్యాటింగ వస్తాడు. మరి అక్షర్ పటేల్ పరిస్థితి ఏంటి? అక్షర్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ రెండింటిలోనూ తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడిని కాదని దూబేను ఎంపిక చేయడం వెనక ఉన్న తర్కం నాకు అర్థం కాలేదు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్