
సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు వీరుడు స్మరన్ రవిచంద్రన్ స్వరాష్ట్రమైన కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. స్మరన్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 157.29 స్ట్రయిక్‌రేట్‌తో 75.50 సగటున 302 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు విధ్వంసకర అర్ద శతకాలు ఉన్నాయి.
తన రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లో అజేయమైన 52 పరుగులు చేసిన స్మరన్.. ఐదో మ్యాచ్‌లో 39 బంతుల్లో 52.. ఆరో మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 53 పరుగులు.. తాజాగా ఎనిమిదో మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు.
స్మరన్ మెరుపు ప్రదర్శనలతో దూసుకుపోతుండటంతో అతని జట్టు గుల్బర్గా మిస్టిక్స్ కూడా వరుస విజయాలతో అదరగొడుతుంది. ఈ టోర్నీలో స్మరనే మిస్టిక్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
22 ఏళ్ల స్మరన్ తాజా ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా గాయపడి ఒక్క మ్యాచ్‌కే నిష్క్రమించాడు. స్మరన్‌కు భారీ హిట్టర్‌గా పేరుంది. ఎంతటి బౌలింగ్‌లో అయినా స్మరన్ అలవోకగా షాట్లు బాదగలడు. గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే స్మరన్‌పై 30 లక్షల పెట్టుబడి పెట్టింది. అయితే అతను ఒక్క మ్యాచ్‌కే గాయపడి వైదొలిగాడు.
మహారాజా టోర్నీలో తాజా ప్రదర్శనల తర్వాత స్మరన్ పేరు మార్మోగిపోతుంది. ఈసారి అతడు ఐపీఎల్ వేలంలో హాట్ కేక్‌గా అమ్ముడుపోతాడని అంచనాలు ఉన్నాయి. స్మరన్‌ను సన్‌రైజర్సే తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అతడిపై 2 లేదా 3 కోట్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.