
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్ వారియర్స్ కెప్టెన్ మనీశ్ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిన్న (ఆగస్ట్ 11) బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు
CAPTAIN MANISH PANDEY SHOW. 👑
- 58* runs from just 29 balls including 4 fours & 4 sixes in his first match in Maharaja Trophy 2025. pic.twitter.com/2kDjibBYqS— Johns. (@CricCrazyJohns) August 11, 2025
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మైసూర్ ఇన్నింగ్స్‌లో మనీశ్‌తో పాటు సుమిత్ కుమార్ (28 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), హర్షిల్ ధర్మాణి (31 బంతుల్లో 38; 2 ఫోర్లు, సిక్స్) రాణించారు. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో శుభాంగ్ హేగ్డే 3 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం బరిలోకి దిగిన బ్లాస్టర్స్.. ఎల్‌ఆర్ కుమార్ (4-0-27-3), అజిత్ కార్తీక్ (3.2-0-21-3), కృష్ణప్ప గౌతమ్ (4-0-28-2) ధాటికి 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (66) బ్లాస్టర్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.
కాగా, మహారాజా ట్రోఫీ అనేది కర్ణాకటలో జరిగే స్థానిక టీ20 టోర్నీ. ఈ టోర్నీ యొక్క నాలుగో ఎడిషన్ నిన్ననే మొదలైంది. వాస్తవానికి ఈ టోర్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే మహిళల వరల్డ్‌కప్ ఏర్పాట్లలో భాగంగా వేదికను మైసూర్‌లోని వడియార్ క్రికెట్ స్టేడియంకు మార్చారు.
ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటుండగా.. మనీశ్ పాండే నేతృత్వంలోని మైసూర్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో మనీశ్ పాండే, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, అభినవ్ మనోహర్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.