యాషెస్ సిరీస్ 2025-26 చివరి టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. తుది జట్టు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కెమరూన్ గ్రీన్ పేలవ ఫామ్ ( గత 6 ఇన్నింగ్స్‌ల్లో 112 పరుగులు, 3 వికెట్లు) ఆసీస్‌ను కలవరపెడుతుంది. గ్రీన్ స్థానాన్ని మరో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ భర్తీ చేసే అవకాశం ఉంది.
ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రవిస్ హెడ్ కొనసాగడం ఖాయం. ఉస్మాన్ ఖ్వాజా మరోసారి మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి రావచ్చు. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున టాడ్ మర్ఫీ తుది జట్టులోకి రావచ్చు. ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరుగుతుంది.
కాగా, ఈ ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే (3-1) కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్ నాలుగో టెస్ట్‌లో పరాజయంపాలైంది. ఈ టెస్ట్ నెగ్గి ఆధిక్యత 4-1కి పెంచుకోవాలని ఆసీస్.. ఆసీస్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి.
ఐదో టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు
- స్టీవ్ స్మిత్ (కెప్టెన్)
- స్కాట్ బోలాండ్
- అలెక్స్ క్యారీ
- బ్రెండన్ డాగెట్
- కెమెరూన్ గ్రీన్
- ట్రావిస్ హెడ్
- జోష్ ఇంగ్లిస్
- ఉస్మాన్ ఖవాజా
- మార్నస్ లాబుషేన్
- టాడ్ మర్ఫీ
- మైఖేల్ నేసర్
- జై రిచర్డ్సన్
- మిచెల్ స్టార్క్
- జేక్ వెదరాల్డ్
- బ్యూ వెబ్‌స్టర్


