
నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్‌ను హుబ్లీ టైగర్స్ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది.
పడిక్కల్ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్‌రైజర్స్ హిట్టర్ అభినవ్ మనోహర్ (12.20 లక్షలు), కేకేఆర్ వెటరన్ మనీశ్ పాండే (12.20 లక్షలు), విధ్వత్ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్ పాటిల్ (8.40 లక్షలు) నిలిచారు.
ఈ వేలంలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్‌లో సమిత్ మైసూర్ వారియర్స్‌కు ఆడాడు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్ నాయర్ (6.8 లక్షలు), ప్రసిద్ద్ కృష్ణ (2 లక్షలు), మయాంక్ అగర్వాల్ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.
మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.
జట్ల వివరాలు..
శివమొగ్గ లయన్స్
కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్ బాల్గార్
మైసూర్ వారియర్స్
కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్
మంగళూరు డ్రాగన్స్
అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్ కుమార్ దాస్
హుబ్లీ టైగర్స్
కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్, నాథన్ మెల్లో, నిశిచిత్ పాయ్
గుల్బర్గా మిస్టిక్స్
వైషాక్ విజయ్‌కుమార్, లువ్‌నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్‌జె నికిన్ జోస్, ప్రజ్వల్ పవన్, యూనిస్ అలీ బేగ్, లిఖిత్ బన్నూర్
బెంగళూరు బ్లాస్టర్స్
మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్