అక్తర్, ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్‌ తెచ్చారు..! | Shoaib Akhtar, Mohammad Asif Did Drug Trafficking In India, Government Officials Shockwaves | Sakshi
Sakshi News home page

అక్తర్, ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్‌ తెచ్చారు..!

Jul 14 2026 5:28 PM | Updated on Jul 14 2026 5:32 PM

Shoaib Akhtar, Mohammad Asif Did Drug Trafficking In India, Government Officials Shockwaves

పాకిస్తాన్‌ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌పై భారత మాజీ కేంద్ర హోంశాఖ అధికారి ఆర్‌వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో పర్యటించిన సమయంలో అక్తర్‌, ఆసిఫ్‌ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బాంబు పేల్చారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "భారత్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ బృందంలోని కొందరు డ్రగ్స్‌ను అక్రమంగా తీసుకొచ్చేవారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పాకిస్తాన్ హైకమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారు" అని అన్నారు.

మాజీ పాక్ కోచ్ బాబ్ వూల్మర్ మరణాన్ని కూడా ఈ వ్యవహారంతో ముడిపెట్టారు ఆర్‌వీఎస్ మణి. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న డ్రగ్ స్మగ్లింగ్ విషయాన్ని బయటపెట్టాలని వూల్మర్ ప్రయత్నించారని, అందుకే ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఆరోపించారు.

మణి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్‌ సర్క్సిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. మణి 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే.. 2003-04 నుంచి 2007 వరకు ఇరు దేశాల మధ్య పరస్పర సిరీస్‌లు జరిగాయి. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement