ఇషాన్‌ కిషన్‌ గొప్ప మనసు | Ishan Kishan Discards Gautam Gambhir Blockade, Special Act For Pakistan Fan Out | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ కిషన్‌ గొప్ప మనసు

Jul 12 2026 5:53 PM | Updated on Jul 12 2026 6:06 PM

Ishan Kishan Discards Gautam Gambhir Blockade, Special Act For Pakistan Fan Out

భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

మ్యాచ్‌కు ముందు వార్మప్‌కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. 

ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్‌ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్‌ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

ఇంగ్లండ్‌ తరఫున జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (56), తిలక్‌ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement