మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా | India women team lead by 269 runs at day 2 stumps in lords test | Sakshi
Sakshi News home page

మంధాన మరోసారి.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

Jul 11 2026 11:36 PM | Updated on Jul 11 2026 11:36 PM

India women team lead by 269 runs at day 2 stumps in lords test

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 154 పరుగులు చేసి, మొత్తంగా 269 పరుగుల ఆధిక్యంలో (117 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది) కొనసాగుతోంది. షఫాలీ వర్మ (33) ఔట్‌ కాగా.. స్మృతి మంధాన (69), యస్తికా భాటియా (39) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు క్రాంతి గౌడ్‌ (17-7-37-5) ధాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్‌ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది.

వీరితో పాటు మయా బౌచియర్‌ (23), మ్యాడీ విల్లియర్స్‌ (10), సోఫీ ఎక్లెస్టోన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు.

దీనికి ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది.స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement