జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ఈ పర్యటనలో తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో ఘోరంగా ఓడిన ఆతిథ్య జట్టు.. ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో సిరీస్ కోల్పోయింది.
అయితే ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకుంది.
హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తంజిద్ హసన్ తంజిమ్ 101 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (69) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో మసుకు 2, చివంగ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు షోరిఫుల్ ఇస్లాం (10-1-44-4), తస్కిన్ అహ్మద్ (10-4-32-2), తన్వీర్ ఇస్లాం (10-0-37-2), మొహమ్మద్ సైఫుద్దీన్ (9.1-1-31-1) ధాటికి జింబాబ్వే 199 పరుగులకే ఆలౌటైంది.
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో వెస్లీ మెదెవెరె (75), బ్రాడ్ ఈవాన్స్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 15, 17, 19 తేదీల్లో బులవాయో వేదికగా జరుగునుంది.


