టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సౌతాంప్టాన్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్‌ను 56 పరుగుల తేడాతో బ్రూక్ సేన చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
గత కొన్నాళ్లగా పేలవ ఫామ్‌తో సతమవుతున్న బట్లర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లను ఉతిరాకేశాడు. రోజ్‌బౌల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. బట్లర్ కేవలం 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
బట్లర్ సాధించిన రికార్డులు ఇవే
👉అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి బట్లర్ చేరుకున్నాడు.
👉108 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ తన టీ20 కెరీర్‌లో 4,188 పరుగులు చేయగా.. బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో బాబర్ ఆజం(4,596) ఉండగా, రెండో స్ధానంలో రోహిత్ శర్మ(4,231) కొనసాగుతున్నాడు.
👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(125 నాటౌట్) పేరిట ఉండేది.
👉తాజా మ్యాచ్‌తో లూయిస్ ఆల్‌టైమ్ రికార్డును జోస్ ది బాస్(131) బ్రేక్ చేశాడు. టీ20ల్లో బట్లర్‌కే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోర్ సాధించిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. తొలి స్దానంలో ఫిల్ సాల్ట్(141) ఉన్నాడు.


