ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ హీథర్ నైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. లార్డ్స్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు నైట్ ప్రకటించింది. నైట్‌తో పాటు ఆమె సహచర ప్లేయర్ టామీ బ్యూమౌంట్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు.
కాగా 35 ఏళ్ల హీథర్ నైట్.. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 16 ఏళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు తన సేవలను అందించింది. 2010లో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసిన నైట్, ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 320 మ్యాచ్‌లు ఆడింది. 2016లో షార్లెట్ ఎడ్వర్డ్స్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నైట్.. ఇంగ్లండ్ క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లింది.
2016 నుండి 2025 వరకు ఇంగ్లండ్ జట్టుకు 199 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన నైట్.. అందులో 134 విజయాలను అందించింది. అంతేకాకుండా ఆమె సారథ్యంలోనే 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. అయితే 2024/25 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర ఓటమి తర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగింది.
కానీ ప్లేయర్‌గా మాత్రం కొనసాగుతూ వచ్చింది. కానీ హీథర్ ఇప్పుడు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 6 సెంచరీలతో సహా దాదాపు 8,000 పరుగులు నైట్ సాధించింది. నైట్ ఇంగ్లండ్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కొనసాగుతోంది.
చదవండి: ENG vs ZIM: టీమిండియాకు డబుల్ షాక్


