న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. గయానా వేదికగా జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను 7 వికెట్ల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది.
బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(65), విల్ యంగ్(49) రాణించగా.. బ్రెస్‌వెల్(29), చాప్‌మన్(27), టామ్ లాథమ్(25) తలో చేయి వేశారు. కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. 19 ఏళ్ల అరంగేట్ర స్పిన్నర్ విటెల్ లాస్ 3 వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.5 ఓవర్లలో చేధించింది. వన్ డౌన్ బ్యాటర్ కీసీ కాట్టీ(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ బ్యాటర్ కేవలం 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అతడితో పాటు కెప్టెన్ షాయ్ హోప్(92 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 నాటౌట్) అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. కివీస్ బౌలర్లలో డఫీ, లినక్స్, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు. . ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గయానా వేదికగానే సోమవారం జరగనుంది.


