స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా! | Argentina New Controversy-Swiss Player-Breel Embolo Recieved-Red-Card | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా!

Jul 12 2026 10:48 AM | Updated on Jul 12 2026 11:43 AM

Argentina New Controversy-Swiss Player-Breel Embolo Recieved-Red-Card

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మరోసారి వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిఫరీ తప్పుడు నిర్ణయాలతో అర్జెంటీనా విజయాలు సాధిస్తుందని ప్రత్యర్థి జట్లు ఆరోపణలు గుప్పించాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యి మైదానం నుంచి బహిష్కరణకు గురి కావడం అర్జెంటీనాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నిజానికి ఇక్కడ స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో నటనను అద్భుతంగా పండించాడు. కానీ డ్రామా పండకపోవడంతో పాటు తప్పిదానికి మూల్యంగా రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో స్విట్జర్లాండ్ 10 మందికే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.

ఎంబోలోకు రెడ్‌కార్డ్‌ ఎందుకంటే?
విషయంలోకి వెళితే.. ఆట రెండవ అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. ఎంబోలోపై అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ అనాలోచిత ఫౌల్ చేసిన కారణంగా మొదట అతడికి యెల్లో కార్డ్ చూపించాడు.  అయితే, వీఏఆర్‌ బృందం జోక్యం చేసుకుని, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌కు యెల్లో కార్డు ఇవ్వడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని సూచించింది. 

దీంతో రిఫరీ జోవో పిన్హీరో మైదానం డగౌడ్‌లో ఉన్న మానిటర్‌లోని ఫుటేజీని సమీక్షించారు. ఫుటేజీలో పరేడెస్ ఎలాంటి తప్పిదం చేయలేదని, పరేడెస్ రాకముందే ఎంబోలో కిందపడినట్లుగా నటించినట్లు తేలింది. దీంతో పరేడెస్ యెల్లో కార్డ్ రద్దు చేసిన రిఫరీ ఆ తర్వాత ఎంబోలోకు రెడ్ కార్డ్ చూపించాడు. ఆటలో అంతకముందే ఒక ఫౌల్ చేసిన కారణంగా ఎంబోలో యెల్లో కార్డుకు గురయ్యాడు. 

తాజాగా తనను కిందపడేశాడంటూ ఆరోపించడం, ఆ తర్వాత ఫుటేజీలో అదంతా నటన అని తేలడంతో ఎంబోలోకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. ఈ సమయంలో మైదానంలో ఒక్కసారిగా హైడ్రామా చోటుచేసుకుంది. రిఫరీ నిర్ణయాన్ని తప్పుబ్టటిన స్విస్ జట్టు నిరసనకు దిగింది. అయితే అదే సమయంలో ఎంబోలో తాను తప్పు చేశానని అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ అనవసరంగా సీన్ చేయొద్దని, మైదానం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించాడు. 

దీంతో చేసేదేం లేక ఎంబోలో ఏడుస్తూ మైదానం వీడాడు. ఈసారి ఫిఫా మొదలైనప్పటి నుంచి వీఏఆర్ సమీక్షలపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. IFAB (అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్) ఆట నియమాల ప్రకారం, అనుకరణ అనేది ఖచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన వర్గంలోకి వస్తుంది. మ్యాచ్ అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు రుజువైతే, ఆటగాడికి తప్పనిసరిగా హెచ్చరిక (పసుపు కార్డు) ఇవ్వాలని నియమావళి నిర్దేశిస్తుంది. 

 

Read: చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్‌.. సెమీఫైన‌ల్లో అర్జెంటీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement