ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ నట్‌సివర్ బ్రంట్ (47 బంతుల్లో 75; 11 ఫోర్లు, ఒక సిక్సర్), హెథర్‌నైట్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, లాబా చెరో 2 వికెట్లు తీయగా, మారిజెన్ కాప్ ఒక వికెట్ పడగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రంట్, హెథర్‌నైట్‌లు నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
ఇప్పటికే తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఏ జట్టు తలపడు తుందనేది ఆసక్తిగా మారింది.


