breaking news
Heather Knight
-
320 మ్యాచ్‌లు.. 8000 రన్స్! రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్
ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ హీథర్ నైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. లార్డ్స్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు నైట్ ప్రకటించింది. నైట్‌తో పాటు ఆమె సహచర ప్లేయర్ టామీ బ్యూమౌంట్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు.కాగా 35 ఏళ్ల హీథర్ నైట్.. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా దాదాపు 16 ఏళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు తన సేవలను అందించింది. 2010లో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసిన నైట్, ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 320 మ్యాచ్‌లు ఆడింది. 2016లో షార్లెట్ ఎడ్వర్డ్స్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నైట్.. ఇంగ్లండ్ క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లింది.2016 నుండి 2025 వరకు ఇంగ్లండ్ జట్టుకు 199 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన నైట్.. అందులో 134 విజయాలను అందించింది. అంతేకాకుండా ఆమె సారథ్యంలోనే 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. అయితే 2024/25 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర ఓటమి తర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగింది. కానీ ప్లేయర్‌గా మాత్రం కొనసాగుతూ వచ్చింది. కానీ హీథర్ ఇప్పుడు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో 6 సెంచరీలతో సహా దాదాపు 8,000 పరుగులు నైట్ సాధించింది. నైట్ ఇంగ్లండ్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కొనసాగుతోంది.చదవండి: ENG vs ZIM: టీమిండియాకు డబుల్ షాక్ -
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ నట్‌సివర్ బ్రంట్ (47 బంతుల్లో 75; 11 ఫోర్లు, ఒక సిక్సర్), హెథర్‌నైట్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, లాబా చెరో 2 వికెట్లు తీయగా, మారిజెన్ కాప్ ఒక వికెట్ పడగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రంట్, హెథర్‌నైట్‌లు నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇప్పటికే తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఏ జట్టు తలపడు తుందనేది ఆసక్తిగా మారింది. -
వరల్డ్‌కప్ సెమీస్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీలో ఉంది. ఇందులో భాగంగా తొలుత టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగుల తేడాతో చిత్తు చేసి బోణీ కొట్టింది ఆతిథ్య జట్టు.హ్యాట్రిక్ విజయాలుఅనంతరం ఐర్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన నాట్ సీవర్ బృందం.. ఆ తర్వాత స్కాట్లాండ్ మహిళా జట్టుపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది.డానీ వ్యాట్ అర్ధశతకంలండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో మొదట ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానీ వ్యాట్ (42 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించింది. మిగిలిన వారిలో హీథర్ నైట్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించింది.విండీస్ బౌలర్లలో అష్మిని మునిసార్ రెండు వికెట్లు తీయగా.. చినెల్లి హెన్రీ, కెప్టెన్ హేలీ మాథ్యూస్, కరిష్మా రామ్హరాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులకు పరిమితమైంది. లోయర్ ఆర్డర్లో చినెల్లి హెన్రీ మెరుపు అర్ధ శతకం (30 బంతుల్లో 51 నాటౌట్)తో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఓటమి ఖరారైంది.నాలుగింట నాలుగూ గెలిచిఇంగ్లండ్ బౌలర్లలో సారథిగా వ్యవహరించిన చార్లెట్ డీన్ రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్, సోఫీ ఎక్లిస్టోన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో విజయంతో లీగ్ దశలో ఇప్పటికి నాలుగింట నాలుగూ గెలిచిన ఇంగ్లండ్.. గ్రూప్-బి నుంచి అధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా అనధికారికంగా సెమీస్ చేరగా.. భారత్, సౌతాఫ్రికా రేసులో ఉన్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం వారిని బలిచేయలేము -
శతక్కొట్టిన హీథర్ నైట్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది. మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా -
వన్డే ప్రపంచకప్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్‌లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
విండీస్‌తో వన్డే సిరీస్ నుంచి ఇంగ్లండ్ తాజా మాజీ కెప్టెన్ ఔట్.. భారత్‌తో సిరీస్‌కు కూడా..!
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా నైట్ ఈ సిరీస్‌తో పాటు జూన్, జులైల్లో షెడ్యూలైన భారత పర్యటనకు కూడా దూరమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నైట్ పై రెండు సిరీస్‌లతో పాటు హండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నైట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. నైట్ గైర్హాజరీలో విండీస్‌తో సిరీస్‌లో నాట్ సీవర్ బ్రంట్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ సిరీస్‌లో నైట్ స్థానాన్ని అలైస్ క్యాప్సీ భర్తీ చేయనుంది. నైట్ మే 26న విండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద ఉన్న సమయంలో నైట్ అర్దంతరంగా మైదానాన్ని వీడింది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్, మహిక గౌర్, సోఫీ డంక్లీ, ట్యామీ బేమౌంట్, అలైస్ క్యాప్సీ, ఆమీ జోన్స్, ఎమ్మా లాంబ్, ఎమ్ ఆర్లాట్, సారా గ్లెన్, కేట్ క్రాస్, లిన్సే స్మిత్, లారెన్ బెల్, చార్లెట్ డీన్ -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హీథర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భర్తీ చేయనుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ హీథర్ నైట్ రాజీనామా చేసింది.మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో నైట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రధాన కోచ్ జాన్ లూయిస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియమించింది.ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపిక అయిన తర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచన మెరకు నా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాను.2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు నా వంతు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. స్కైవర్-బ్రంట్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. హీథర్ నైట్ గైర్హజరీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి హీథర్ నైట్ తప్పుకుంది.ఈ విషయాన్ని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ పదవి నుంచి హీథర్ నైట్ వైదొలిగింది. 9 ఏళ్ల పాటు కెప్టెన్ సేవలు అందించినందుకు థాంక్యూ నైట్" అని ఈసీబీఎక్స్లో పేర్కొంది.2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ నైట్.. 199 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌ను ముందుండి నడిపించింది. ఆమె సారథ్యంలోనే 2017 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టును ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్‌కు కూడా నైట్ చేర్చింది.కాగా ఇంగ్లండ్ మహిళల క్రికెట్ చరిత్రలో హీథర్ నైట్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. 199 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన నైట్.. 134 మ్యాచ్‌ల్లో తన జట్టుకు అద్బుతమైన విజయాలను అందించింది. ఆమె వరుసగా రికార్డు స్దాయిలో ఎనిమిది వన్డే సిరీస్‌లను ఇంగ్లండ్‌కు అందించింది.అయితే ఇటీవల కాలంలో మాత్రం నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు స్టేజిలోనే ఇంగ్లీష్ జట్టు ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లో కూడా అదే తీరును ఇంగ్లండ్‌ను కనబరిచింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు పగ్గాల నుంచి ఆమె తప్పుకుంది. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా నాట్ స్కీవర్ బ్రంట్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IPL 2025: ఈసారి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు వీరే! -
సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లకు ఇంగ్లండ్ జట్ల ప్రకటన
నవంబర్ 24 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే ఆల్ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లను ఇవాళ (నవంబర్ 8) ప్రకటించారు. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, తర్వాత వన్డేలు, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు హీథర్ నైట్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం ఆల్‌రౌండర్ పైజ్ స్కోల్ఫీల్డ్ను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ లారెన్ ఫైలర్ మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకుంది. 19 ఏళ్ల యంగ్ ప్రామిసింగ్ క్రికెటర్ ఫ్రేయా కెంప్ తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకుంది. మైయా బౌచియర్ ఈ సిరీస్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. తొలుత టీ20 జట్టు నవంబర్ 16న సౌతాఫ్రికాకు బయల్దేరుతుంది. ఆ తర్వాత నవంబర్ 27న వన్డే, టెస్ట్ జట్లు టీ20 జట్టుతో కలుస్తాయి.షెడ్యూల్..నవంబర్ 24- తొలి టీ20 (ఈస్ట్ లండన్)నవంబర్ 27- రెండో టీ20 (బెనోని)నవంబర్ 30- మూడో టీ20 (సెంచూరియన్)డిసెంబర్ 4- తొలి వన్డే (కింబర్లీ)డిసెంబర్ 8- రెండో వన్డే (డర్బన్)డిసెంబర్ 11- మూడో వన్డే (పోచెఫ్స్రూమ్)డిసెంబర్ 15 నుంచి 18 వరకు- ఏకైక టెస్ట్ మ్యాచ్ (బ్లోంఫోంటెయిన్)ఇంగ్లండ్ మహిళల టీ20 జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మైయా బౌచియర్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, పైజ్ స్కోల్ఫీల్డ్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, అలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ఇంగ్లండ్ మహిళల టెస్టు జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, కేట్ క్రాస్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, డాని వ్యాట్ హాడ్జ్ -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన


