breaking news
ICC Womens T20 World Cup 2026
-
ఆసీస్‌కు రూ.22 కోట్లు.. మరి టీమిండియాకు ఎంతంటే?
మహిళల క్రికెట్లో తమకు తిరుగు లేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించుకుంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 విజేతగా ఆసీస్ నిలిచింది. ఆదివారం లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన తుది పోరులో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. రికార్డు స్ధాయిలో ఏడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఇంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020, 2023 పొట్టి వరల్డ్‌కప్ టోర్నీల్లో కంగారులు ఛాంపియన్స్ నిలిచారు. కాగా ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత ఇంగ్లండ్‌ను 150 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో ఈ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. మరోసారి సీనియర్ బ్యాటర్ బెత్ మూనీ(64) ఫైనల్ పోరులో సత్తాచాటింది. మూనీకే ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’...‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి.ఇక ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంత ప్రైజ్‌మనీ దక్కిందో ఓసారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్ ఇంగ్లండ్‌కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) నగదు బహుమతి లభించింది. సెమీఫైనలిస్ట్లు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లకు రూ. 6.4 కోట్లు ప్రైజ్‌మనీ అందింది.భారత్‌కు ఎంతంటే?ఇక గ్రూపు స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన భారత మహిళల జట్టుకు కూడా ప్రైజ్‌మనీ లభించింది. టోర్నమెంట్లో పాల్గొన్నందుకు గానూ ప్రతి జట్టుకు ఐసీసీ రూ. 2.35 కనీస మొత్తాన్నిఅందజేసింది. అంతేకాకుండా గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు సుమారు రూ. 29.6 లక్షలు) బోనస్‌గా లభిస్తుంది. మూడు విజయాలకు గానూ భారత్‌కు లభించిన రూ. 89 లక్షలు దక్కింది. మొత్తంగా హర్మన్ సేనకు రూ. 3.24 కోట్లు ప్రైజ్‌మనీగా అందుకుంది. -
తిరుగులేని ఆస్ట్రేలియా.. సరికొత్త చరిత్ర
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. రికార్డు స్థాయిలో ఏకంగా ఏడోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. జగజ్జేతగా అవతరించింది.టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆమీ జోన్స్ (6), డానీ వ్యాట్ హాడ్జ్ (8) వికెట్లు కోల్పోయింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ అర్ధ శతకం (53 బంతుల్లో 58 నాటౌట్) బాది ఇన్నింగ్స్ చక్కదిద్దింది.ఆమెకు తోడుగా అలిస్ కాప్సే (23) రాణించగా.. ఫ్రేయా కెంప్ మెరుపు ఇన్నింగ్స్ (28 బంతుల్లో 44 నాటౌట్) ఆడింది. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.తద్వారా ఆతిథ్య జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ (49 బంతుల్లో 64), ఫోబే లిచిఫీల్డ్ (35 బంతుల్లో 48) దంచికొట్టారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేమిటో చూసేద్దామా?!మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన👉ఆస్ట్రేలియా- 2026లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ వేదికగా 153/3👉వెస్టిండీస్- 2016లో ఆస్ట్రేలియాపై కోల్‌కతా వేదికగా 149/2👉ఆస్ట్రేలియా- 2014లో ఇంగ్లండ్‌పై మీర్పూర్ వేదికగా 106/4మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్ మీద 78 నాటౌట్👉అలిసా హేలీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్ మీద 75👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2023లో సౌతాఫ్రికా మీద 74 నాటౌట్👉హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్)- 2016లో ఆస్ట్రేలియా మీద 66 👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2026లో ఇంగ్లండ్ మీద 64మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం👉హేలీ మాథ్యూస్- స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 2016లో ఆస్ట్రేలియా మీద తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం👉అలిసా హేలీ- బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2020లో భారత్ మీద తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం👉బెత్ మూనీ- ఫోబే లిచిఫీల్డ్ (ఆస్ట్రేలియా)-2026లో ఇంగ్లండ్ మీద రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం👉ఫ్రేయా కెంప్- నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్)- 2026లో ఆస్ట్రేలియా మీద ఐదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంమహిళల టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధికసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 5👉నాట్ సివర్ బ్రంట్ (ఇంగ్లండ్)- 3👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)- 2.మహిళల క్రికెట్లో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు సాధించిన జట్లు (వరల్డ్‌కప్+ టీ20 ప్రపంచకప్)👉ఆస్ట్రేలియా- పద్నాలుగు సార్లు👉ఇంగ్లండ్- ఐదు సార్లు👉న్యూజిలాండ్- రెండు సార్లు👉వెస్టిండీస్- ఒకసారి👉భారత్- ఒకసారి.చదవండి: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. బీసీసీఐ స్పందన -
జగజ్జేత ఆస్ట్రేలియా
లండన్: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అపజయం ఎరగకుండా ఫైనల్‌కు చేరిన ఆసీస్... తుదిపోరులోనూ అదే దూకుడు కనబర్చింది. ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన పూర్తి ఏకపక్ష ఫైనల్లో సోఫీ మోలినెక్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ఏడోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటంగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫ్రెయా కెంప్ (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. డానీ వ్యాట్ (8), అమీ జోన్స్ (6), హీతర్ నైట్ (2) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ మోలినెక్స్ , అనాబెల్ సదర్లాండ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం టి20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరింది. ఆసీస్ 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జార్జియా వాల్ (9) రెండో ఓవర్లోనే అవుటైనా... బెత్ మూనీ (49 బంతుల్లో 64; 10 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 100 పరుగులు జోడించి గెలుపుదిశగా నడిపించారు. బ్యాటింగ్‌లో ప్రభావం చేయలేకపోయిన ఇంగ్లండ్... బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక నాలుగోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బెత్ మూనీకే ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’...‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి. విజేత ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్ ఇంగ్లండ్‌కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.7 మహిళల టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించడం ఆస్ట్రేలియాకిది ఏడోసారి. 2010, 2012, 2013, 2018, 2020, 2023లో చాంపియన్‌గా నిలిచిన ఆసీస్... 2016 ఫైనల్లో ఓడింది.4 మహిళల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడడం ఇంగ్లండ్‌కు ఇది నాలుగోసారి. ఆ నాలుగుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. 2009లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు... 2012, 2014, 2018 రన్నరప్‌గా నిలిచింది. -
నాట్ స్కివర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రపంచకప్-2026లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగుల స్కోర్ సాధించింది.ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్లు అమీ జోన్స్(6), డ్యానీ వ్యాట్(8) విఫలమైనప్పటికి నాట్ స్కివర్(58 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు ఆఖరి ఫ్రేయా కెంప్(44 నాటౌట్) దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్త్, హామిల్టన్,కెప్టెన్ సోఫీ, సదర్లాండ్ తలా వికెట్ సాధించారు.తుది జట్లుఇంగ్లండ్ మహిళలు: అమీ జోన్స్ (వికెట్ కీపర్), డాని వ్యాట్-హాడ్జ్, నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), ఆలిస్ క్యాప్సే, హీథర్ నైట్, ఫ్రెయా కెంప్, డేనియల్ గిబ్సన్, షార్లెట్ డీన్, లిన్సే స్మిత్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ఆస్ట్రేలియా మహిళలు: జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్ -
సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఓవల్ వేదికగా గురువారం రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ మహిళల జట్టు 40 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. బౌండరీ లైన్ వద్ద సోఫీ విన్యాసంఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (51) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్, లారెన్ బెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, లిన్సే స్మిత్, ఫ్రేయా కెంప్, సోఫి ఎసెల్‌స్టోన్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనుంది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన నట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది.తంజిమ్ బ్రిట్స్ (51)అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ నట్‌సివర్ బ్రంట్ (47 బంతుల్లో 75; 11 ఫోర్లు, ఒక సిక్సర్), హెథర్‌నైట్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, లాబా చెరో 2 వికెట్లు తీయగా, మారిజెన్ కాప్ ఒక వికెట్ పడగొట్టింది. నట్ సివర్ బ్రంట్ (75), హెథర్‌నైట్ (58)టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రంట్, హెథర్‌నైట్‌లు నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేదనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు దానిని మరోసారి నిరూపితం చేస్తూ లీగ్ దశ వరకు ఎదురులేకుండా సాగిన సఫారీలు సెమీస్‌కు పరిమితమై చోకర్స్ ముద్రను చెరిపేసుకోవడంలో విఫలమయ్యారు. -
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కెప్టెన్ నట్‌సివర్ బ్రంట్ (47 బంతుల్లో 75; 11 ఫోర్లు, ఒక సిక్సర్), హెథర్‌నైట్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, లాబా చెరో 2 వికెట్లు తీయగా, మారిజెన్ కాప్ ఒక వికెట్ పడగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 23 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రంట్, హెథర్‌నైట్‌లు నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇప్పటికే తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఏ జట్టు తలపడు తుందనేది ఆసక్తిగా మారింది. -
నేడు ప్రపంచకప్ రెండో సెమీఫైనల్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జులై 2) రెండో సెమీఫైనల్ జరుగనుంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్.. అండర్ డాగ్ సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.జట్ల వివరాలు..ఇంగ్లండ్: నాట్ స్కివర్-బ్రంట్ (సి), లారెన్ బెల్, అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్‌స్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డానీ వ్యాట్-హాడ్జ్సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (సి), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజాన్నె కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనెక్, టుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్, డేన్ వాన్ నికెర్క్పిచ్ వివరాలుకెన్నింగ్టన్ ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ఇక్కడ నిలకడగా బౌన్స్‌కు అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రయిట్ బౌండరీలు చిన్నగా ఉంటాయి. స్క్వేర్ బౌండరీలు కాస్త పెద్దగా ఉంటాయి. ఈ దశలో షాట్లు ఆడితే వికెట్ల మధ్య పరుగెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వేదికపై ఛేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. -
వాళ్లది దూకుడు మంత్రం.. మనోళ్ల ఓటమికి కారణాలివే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు ప్రయాణం ముగిసిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. లార్డ్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 19 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టపోయి 172 పరుగులు సాధించింది. తద్వారా గ్రూప్-‘ఎ’ నుంచి తమతో పాటు సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లడంతో పాటు.. టీమిండియాను ఎలిమినేట్ చేసింది.మిగతా జట్లది దూకుడు మంత్రంకాగా గతేడాది వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టు... టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం ఇలా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అభిమానులకు ఆవేదనను మిగిల్చింది. అయితే మిగతా జట్లన్నీ దూకుడు మంత్రంతో సాగుతున్న తరుణంలో టీమిండియా మాత్రం పాత తరహాకే పెద్దపీట వేస్తూ ఉండటంతో టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. మనోళ్లది నత్తనడకఈ క్రమంలోనే.... 2024 ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... ఈసారి కూడా అదే తరహాలో నాకౌట్‌కు చేరకుండానే ప్రయాణం ముగించింది. గ్రూప్–‘ఎ’లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయాలు సాధించిన భారత జట్టు... ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై కూడా కష్టపడి నెగ్గిన హర్మన్‌ప్రీత్ బృందం... కీలక పోరులో పటిష్ట ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కాలంతో పాటు మారుతున్న వేగాన్ని అందుకోవడంలో టీమిండియా వెనుకబడిందనేది మాత్రం సుస్పష్టం. పేలవ ఫీల్డింగ్ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి జట్లు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు... ఫీల్డింగ్‌పై ప్రధాన దృష్టి పెడుతుంటే... మనవాళ్లు మాత్రం పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంటున్నారు.సునాయాస క్యాచ్‌లను సైతం అందుకోవడంలో విఫలమవుతున్న మన అమ్మాయిలు ఈ అంశంలో పోటీ జట్లకు చాలా దూరంలో ఉన్నారు. తాజా మ్యాచ్‌లో కీలక దశలో స్మృతి రనౌట్ తీరు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. హార్డ్ హిట్టర్ల కొరత అప్పటి వరకు బంతికో పరుగు చొప్పున చేసిన మంధాన... ఇక గేర్ మార్చుతుందేమో అనుకుంటే... సహచరి స్పందించకున్నా పరుగు అందుకొని వికెట్ సమర్పించుకుంది. డబ్ల్యూపీఎల్, డబ్ల్యూబీబీఎల్ వంటి లీగ్‌లతో మహిళల టీ20ల్లోనూ హిట్టింగ్‌కు ప్రాధాన్యత పెరగగా... టీమిండియాలో అలాంటి హార్డ్ హిట్టర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా టీమ్ మేనేజ్మెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాలి!మ్యాచ్ సాగిందిలా..లండన్‌లో లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగలతో అజేయంగా నిలిచింది. అద్భుత అర్ధ శతకాలతో..ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. అయితే, ఎలిస్ పెర్రి (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లింది. ఇక ఆసీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: నాకసలు వినపడనే లేదు!.. సర్లే వదిలెయ్! -
మన కథ ముగిసె...
లండన్: టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. మొదట బ్యాటింగ్‌లో మంచి స్కోరు చేసినా... దాన్ని కాపాడుకోవడంలో విఫలమై వరల్డ్‌కప్ నుంచి ని్రష్కమించింది. గ్రూప్–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గ్రూప్ దశలో ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు పరాజయాలతో 6 పాయింట్లకే పరిమితమైన భారత్... గ్రూప్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా (10 పాయింట్లు), నాలుగింట గెలిచిన దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా... స్మృతి మంధాన (37 బంతుల్లో 38; 6 ఫోర్లు), షఫాలీ వర్మ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెర్రీ (38 బంతుల్లో 56; 8 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో ఆ్రస్టేలియా; గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడతాయి. హర్మన్ ‘హ్యాట్రిక్’ సిక్స్‌లు... ఓపెనర్లు మెరుగైన ఆటతీరు కనబర్చడంతో... టీమిండియాకు శుభారంభం దక్కింది. స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. షఫాలీ అవుటైన కాసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి స్మృతి రనౌట్ అయింది. జెమీమా ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో... 18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 134/2తో నిలిచింది. అయితే ఆఖర్లో హర్మన్ దంచికొట్టడంతో జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హర్మన్ 19వ ఓవర్లో ఓ ఫోర్ కొట్టగా... జెమీమా సిక్స్ బాదింది. దీంతో 13 పరుగులు రాగా... ఆసీస్ సారథి మొలినెక్స్ వేసిన ఆఖరి ఓవర్లో హర్మన్ ‘హ్యాట్రిక్’ సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించింది. వరుసగా నాలుగో సిక్స్ కొట్టే ప్రయత్నంలో హర్మన్ అవుటవ్వగా... చివరి బంతికి దీప్తి (4 నాటౌట్) ఫోర్ కొట్టడంతో భారత్ స్కోరు 170కి చేరింది. చివరి రెండు ఓవర్లలో టీమిండియా 36 పరుగులు రాబట్టడం విశేషం. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనలో రెండో బంతికే జార్జియా వాల్ (4) వికెట్ కోల్పోయినా... ఆసీస్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బెత్ మూనీ (22), లిచ్‌ఫీల్డ్ (24) ఫర్వాలేదనిపించగా... ఒకదశలో 68/3తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన ఆ్రస్టేలియాపై ఒత్తిడి పెంచడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. పెర్రీ, గార్డ్నర్ జంట ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి లక్ష్యాన్ని కరిగింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 59 బంతుల్లోనే 100 పరుగులు జతచేయడంతో ఆసీస్ అలవోకగా విజయం సాధించింది. 89 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. 88 సిక్స్‌లతో స్మృతి మంధాన పేరిట ఉన్న రికార్డును హర్మన్ సవరించింది.5 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇది ఐదోసారి. పదోసారి ప్రపంచకప్‌లో ఆడిన భారత జట్టు 2012, 2014, 2016, 2024, 2026లలో లీగ్ దశలోనే వెనుదిరిగింది. 2009, 2010, 2018, 2023లలో సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు 2018లలో రన్నరప్‌గా నిలిచింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (రనౌట్) 38; షఫాలీ (బి) మొలినెక్స్ 34; జెమీమా (రిటైర్డ్ అవుట్) 34; హర్మన్‌ప్రీత్ (సి) పెర్రీ (బి) మొలినెక్స్ 56; రిచా (నాటౌట్) 1; దీప్తి (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–66, 2–83, 3–147, 4–166. బౌలింగ్: లూసీ హామిల్టన్ 3–0–17–0; కిమ్ గార్త్ 3–0–24–0; గార్డ్నర్ 2–0–25–0; పెర్రీ 1–0–7–0; జార్జియా వేర్హమ్ 3–0–16–0; అనాబెల్ సదర్లాండ్ 4–0–35–0; మొలినెక్స్4–0–46–2. ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: జార్జియా వాల్ (ఎల్బీ) (బి) రేణుక 4; మూనీ (సి) రాధ (బి) దీప్తి 22; లిచ్‌ఫీల్డ్ (సి) స్మృతి (బి) శ్రీచరణి 24; పెర్రీ (సి) షఫాలీ (బి) శ్రీచరణి 56; గార్డ్నర్ (నాటౌట్) 53; వేర్హమ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–68, 4–168. బౌలింగ్: రేణుక 4–0–41–1; క్రాంతి 1–0–12–0; షఫాలీ 4–0–29–0; శ్రీ చరణి 4–0–32–2; దీప్తి 4–0–31–1; 2–0–24–0. -
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు ఆమె పేరిటే!
భారత స్పిన్నర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధి వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా దీప్తి ఆదివారం ఈ ఫీట్ నమోదు చేసింది.ప్రపంచకప్ టోర్నీలో తప్పక సెమీస్ చేరాల్సిన మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రేణుకా సింగ్ జార్జియా వోల్ (4)ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకుంది. ఆ తర్వాత ఏడో ఓవర్లో శ్రీచరణి ఫోబీ లిచిఫీల్డ్ (24)ను అవుట్ చేసింది. అనంతరం తొమ్మిదో ఓవర్లో దీప్తి రంగంలోకి దిగి తొలి బంతికే బెత్ మూనీని వెనక్కి పంపింది.దీప్తి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మూనీ (22) రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో దీప్తికి ఇది 356వ వికెట్. తద్వారా అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్ల వీరులుదీప్తి శర్మ (ఇండియా)- 356ఝులన్ గోస్వామి (ఇండియా)- 355ఎలిస్ పెర్రి (ఆస్ట్రేలియా)- 336కేథరిన్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్)- 335సోఫీ ఎక్లిస్టోన్ (ఇంగ్లండ్)- 333షబ్నం ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 323. -
నాకసలు వినపడనే లేదు!.. వదిలెయ్!
ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దానిని కొనసాగించారు.స్మృతి 37 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 38 రన్స్ రాబట్టగా.. షఫాలీ 26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 34 పరుగులు చేసింది. జెమీమా 28 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 34 పరుగులు చేసింది.25 బంతుల్లోనేఇక 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. 27 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 56 పరుగులు రాబట్టింది. జెమీమా ఆఖరి ఓవర్లో రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఒక, దీప్తి నాలుగు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.స్మృతి- జెమీమా మధ్య రనౌట్ వివాదంఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రాణ స్నేహితులైన స్మృతి- జెమీమా మధ్య రనౌట్ వివాదం నెలకొంది. భారత ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో జార్జ్ వారేహామ్ బౌలింగ్‌లో.. మూడో బంతిని జెమీమా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైంది.అయితే, జెమీమా రన్‌కు పిలవకుండానే మరో ఎండ్‌లో ఉన్న స్మృతి పరుగు కోసం వచ్చింది. అయితే, బంతి ఎంతో దూరం వెళ్లలేదు. దీంతో జెమీమా క్రీజులోనే ఉండగా.. స్మృతికి వెనక్కి వెళ్లే సమయం లేకపోయింది. ఇంతలో ఆసీస్ ఫీల్డర్ బంతిని వికెట్లకు గిరాటేయగా.. స్మృతి మంధాన రనౌట్ అయింది.What a tuk-tuk knock by Smriti Mandhana on a match-winning day. 🥵🐢 pic.twitter.com/UKMtFVnevR— Spotlight Central (@avbvikash1810) June 28, 2026ఈ క్రమంలో జెమీమా.. ‘‘నాకసలు వినపడనే లేదు. నువ్వు సింగిల్‌కు పిలిచావా?’’ అన్నట్లుగా సైగలు చేసింది. ఇందుకు స్మృతి.. ‘‘సర్లే వదిలెయ్.. లైట్ తీస్కో’’ అన్నట్లుగా రియాక్షన్ ఇస్తూ పెవిలియన్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. -
IND vs AUS: భారత్ అవుట్.. సెమీస్‌కు ఆ రెండు జట్లు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడింది. లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన హర్మన్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (56) సాధించగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగింది. ఆసీస్ లక్ష్య ఛేదనకు దిగింది. ఆదిలోనే ఓపెనర్ జార్జియా వోల్ (4) అవుటైనా.. బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) ఫర్వాలేదనిపించారు. ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో రాణించి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లింది.*******************************************మూడో వికెట్ డౌన్9.1: దీప్తి శర్మ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బెత్ మూనీ (22). ఆష్ గార్డ్నర్ క్రీజులోకి రాగా.. పెర్రి 11 పరుగులతో ఉంది.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్6.6: శ్రీచరణి బౌలింగ్‌లో లిచిఫీల్డ్ (24) స్మృతి మంధానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఎలిస్ పెర్రి క్రీజులోకి వచ్చింది. మూనీ 20 పరుగులతో ఉంది. స్కోరు: 55-2(7.2).పవర్ ప్లేలో ఆస్ట్రేలియా స్కోరు: 49-1 (6)మూనీ 17, లిచిఫీల్డ్ 22 పరుగులతో ఉన్నారు.నాలుగు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 25-1మూనీ 5, లిచిఫీల్డ్ 12 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా0.2: రేణుకా సింగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన జార్జియా వోల్ (4). ఫోబీ లిచిఫోల్డ్ క్రీజులోకి రాగా.. బెత్ మూనీ సున్నా పరుగులతో ఉంది. స్కోరు: 4-1(0.3).భారత్ స్కోరు: 170-4(20)హర్మన్ అవుట్19.5: సోఫీ మోలినెక్స్ బౌలింగ్‌లో ఎలిస్ పెర్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (27 బంతుల్లో 56).హర్మన్ హాఫ్ సెంచరీ25 బంతుల్లో అర్ద శతకం పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్జెమీమా రిటైర్డ్ అవుట్రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 147-3 (19)అర్ధ శతక భాగస్వామ్యం18 ఓవర్లు ముగిసేసరికి జెమీమా 26, హర్మన్ 33 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి యాభై పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. స్కోరు: 134-2.14 ఓవర్లలో భారత్ స్కోరు: 102-2జెమీమా 13, హర్మన్ ప్రీత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.స్మృతి రనౌట్11.3: జార్జ్ వారేహామ్ బౌలింగ్‌లో జెమీమా షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసింది. అంతలోనే మరో ఎండ్ నుంచి ముందుకు వచ్చిన స్మృతి రనౌట్ అయింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 85-2 (12).తొలి వికెట్ కోల్పోయిన భారత్9.1: మోలినెక్స్ బౌలింగ్‌లో షఫాలీ వర్మ బౌల్డ్ (26 బంతుల్లో 34). జెమీమా రోడ్రిగ్స్ క్రీజులోకి రాగా.. స్మృతి 30 పరుగులతో ఉంది. స్కోరు: 68-1(9.2).పవర్ ప్లేలో భారత్ స్కోరు 43-0(6)స్మృతి 22 బంతుల్లో 22, షఫాలీ 14 బంతుల్లో 20 పరుగులతో ఉన్నారు. నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0స్మృతి 15, షఫాలీ 14 పరుగులతో ఉన్నారు.రెండు ఫోర్లు బాదిన స్మృతికిమ్ గార్త్ బౌలింగ్‌లో రెండు, మూడో బంతికి వరుసగా ఫోర్లు బాదిన స్మృతి. స్కోరు: 11-0 (2).తొలి ఓవర్లో మూడు పరుగులుస్మృతి రెండు, షఫాలీ వర్మ ఒక పరుగుతో ఉన్నారు.ఒక్కో మార్పుఈ మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ తెలిపింది. నందిని శర్మ స్థానంలో క్రాంతి గౌడ్ ఆడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. ఆసీస్ తుదిజట్టులో ఫీబ్స్ అలనా కింగ్ స్థానాన్ని భర్తీ చేసినట్లు సారథి మోలినెక్స్ తెలిపింది.కాగా గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే ఆసీస్ అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మరోవైపు.. సౌతాఫ్రికా తాజాగా బంగ్లాదేశ్‌ను ఓడించి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో ఆరు పాయింట్లతో ఉన్న భారత్ తప్పక గెలిస్తేనే సెమీస్‌లో అడుగుపెట్టగలదు.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్ఆస్ట్రేలియాబెత్ మూనీ(వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, యాష్లీ గార్డనర్, జార్జియా వేర్హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కేరీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్ -
ఆసీస్‌తో 'డూ ఆర్ డై' మ్యాచ్.. మంధాన కీలక వ్యాఖ్యలు
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ టీమిండియాకు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆస్ట్రేలియాపై హర్మన్ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా అంటే భయం లేదని, తమ సత్తా ఏంటో మ్యాచ్‌లో చూపిస్తామని మంధాన తెలిపింది. మంధాన మాట్లాడుతూ..'ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ యూనిట్ తమ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా ప్రదర్శించలేదని అంగీకరించింది. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలని మేమంతా భావిస్తున్నాం. కానీ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో అది సాధ్యపడలేదు. అయితే ప్రతి బ్యాటర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మా అసలైన ఆటను చూపించాలనుకుంటున్నాం. గత నాలుగైదేళ్లలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడే స్థాయికి చేరుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లో భారత ఆటగాళ్లు ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లోనే మేము మంచి ప్రదర్శన చేశాం. ఆ అనుభవం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. గతంతో పోలిస్తే రెండు జట్ల మధ్య అంతరం చాలా తగ్గింది. విదేశీ లీగ్‌ల అనుభవం కూడా మాకు ఎంతో ఉపయోగపడుతోంది. నా సహచర ఓపెనర్ షెఫాలీ వర్మతో కలిసి జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నా.షెఫాలీ ప్రస్తుతం బంతిని అద్భుతంగా టైమ్ చేస్తోంది. మేమిద్దరం కలిసి జట్టుకు బలమైన పునాది వేయగలిగితే మ్యాచ్‌పై పట్టుసాధించడం సులభమవుతుంది. ఇక ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరతో ఇటీవల బ్యాటింగ్‌కు సంబంధించి పలు విషయాలను చర్చించినట్లు స్మృతి వెల్లడించింది. చిన్నప్పటి నుంచే వారిద్దరి ఆటను చూసి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. 'హేడెన్ కామెంటరీ చేస్తుండగా కలిసే అవకాశం వచ్చింది. బ్యాటింగ్ గ్రిప్‌తో పాటు కొన్ని సాంకేతిక అంశాలపై చర్చించాను. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు మీతో మాట్లాడుతున్నానంటే మీకు ఇబ్బందిగా లేదా అని సరదాగా అడిగాను. కానీ ఆయన ఎంతో ఆప్యాయంగా పలు విలువైన సూచనలు చేశారు. వాటిని మ్యాచ్‌లో అమలు చేయాలని ఆశిస్తున్నాను' అని స్మృతి మంధాన చెప్పింది.Read: ఫిఫా చరిత్రలో అరుదైన ఘట్టం.. ఆ 9 దేశాలు నాకౌట్‌కు! -
కచ్చితంగా గెలవాల్సిందే!
లండన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను భారత్ ఢీకొంటోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్ సెమీస్ చేరడం లాంఛనమే కాగా... ఈ గ్రూప్1లో రెండో జట్టుగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. అయితే సఫారీలకంటే హర్మన్ సేన రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి మన మ్యాచ్‌కు ముందు ఒక వేళ బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా ఓడించినా... రన్‌రేట్ సమస్యలు రాకుండా ఆసీస్‌ను భారత్ ఓడిస్తే సరిపోతుంది. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్‌ను చూస్తే టీమిండియా పరిస్థితి గొప్పగా లేదు. బలహీన జట్లు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను సులువుగా ఓడించిన భారత్ దక్షిణాఫ్రికా చేతిలో భంగపడింది. ఆపై బంగ్లాదేశ్‌లాంటి టీమ్‌పై కూడా లక్ష్య ఛేదనలో తడబడింది. ఈ నేపథ్యంలో ప్లేయర్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌లలో కలిపి 85 పరుగులే చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం అవసరం. షఫాలీ, స్మృతి దూకుడుగానే ఆడుతున్నా... జెమీమా, యస్తిక, రిచా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. దీంతో పాటు బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి మాత్రమే నిలకడగా రాణిస్తుండగా, మిగతావారంతా విఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో ఆసీస్‌ను మన జట్టు ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరం. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం ఇప్పుడు అమ్మాయిలకు స్ఫూర్తినివ్వాలి. -
ఐర్లాండ్ మరో సంచలనం.. విండీస్ సెమీస్ ఆశలపై నీళ్లు!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా విండీస్ సెమీస్ అవకాశాలపై ఐర్లాండ్ నీళ్లు చల్లింది. ఇక విండీస్ జట్టు సెమీస్ భవితవ్యం ఇంగ్లండ్‌పై ఆధారపడి ఉంది. విండీస్ సెమీస్ చేరాలంటే మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం వెస్టిండీస్ మహిళల జట్టు ఇంటిబాట పట్టనుంది. అంతకముందు శుక్రవారం టీమిండియాను ఐర్లాండ్ పురుషుల జట్టు ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ జట్టుకు 21 వరుస పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం కావడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ కుదేలయ్యింది. చినెల్లె హెన్రీ (27) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (22), డియాండ్రా దొతిన్ (21) పర్వాలేదనిపించింది. ఐర్లాండ్ బౌలర్లలో కారా ముర్రే, అమీ మగూరీ చెరో 2 వికెట్లు తీయగా, ఓర్లా, అర్లెన్ కెల్లీ, జేన్ మాగూరీ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 129 పరుగుల టార్గెట్‌ను ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఓర్లా ప్రెండెగస్ట్ (63) అర్ధసెంచరీ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించగా, ఓపెనర్ అమీ హంటర్ (28) రాణించింది. విండీస్ బౌలర్లలో ఆశ్మిని మునిసర్ 2 వికెట్లు తీసింది. విండీస్‌పై విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో 21 వరుస పరాజయాలకు ఐర్లాండ్ (2014-2026 వరకు) చెక్ పెట్టినట్లయింది. గతంలో బంగ్లాదేశ్ (2016-2023 వరకు) 16 వరుస పరాజయాలు మూటగట్టుకుంది.చదవండి: చితక్కొట్టిన ఓపెనర్లు.. రంగారెడ్డి రైజర్స్ ఘనవిజయం -
అదే జరిగితే హర్మన్ సేన ఇంటికే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్‌లకు ఎండ్‌కార్డ్ పడనుంది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఇప్పటివరకు నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన మూడు బెర్తులు ఏ జట్లు ఖరారు చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. గ్రూప్-బి నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు సెమీస్‌లో అడుగుపెట్టనున్నారనేది ఇవాళ తేలిపోనుంది. మరోవైపు గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా జట్టు అనధికారికంగా నాకౌట్‌కు చేరుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ఆ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం డబుల్ హెడర్ పోరులో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్, సౌతాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా, సౌతాఫ్రికాలు చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నాయి. అయితే రన్‌రేట్ విషయంలో సౌతాఫ్రికాతో (0.734) పోలిస్తే భారత్ (2.268) మెరుగైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఆస్ట్రేలియాపై తప్పనిసరి గెలవాల్సిందే. భారత్ సెమీస్ చేరే క్రమంలో సమీకరణాలు ఒకసారి పరిశీలిద్దాం.ఆసీస్ చేతిలో ఓడిపోతే..రేపు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో హర్మన్ సేన ఓడిపోతే మన ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితం మనకు కీలకంగా మారనుంది. బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాలని కోరుకోవాలి. అప్పుడు ఆ జట్టు కూడా 6 పాయింట్లతోనే ఉంటుంది. ఇక్కడ నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. రన్‌రేట్ విషయంలో సౌతాఫ్రికా కంటే మనం మెరుగ్గా ఉండడంతో ఆసీస్‌తో కలిసి సెమీస్‌లో అడుగుపెడతాం. ఒకవేళ బంగ్లాపై సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం టీమిండియా ఇంటిబాట పట్టనుంది.👉ఒకవేళ ఆస్ట్రేలియాతో టీమిండియా గెలిచి, బంగ్లాపై సౌతాఫ్రికా గెలిచినా మెరుగైన రన్‌రేట్ కారణంగా హర్మన్ సేన సెమీస్‌లో అడుగుపెట్టనుంది. సౌతాఫ్రికా ఓడితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టనుంది.వర్షం పడి రద్దయితే..ఒకవేళ ఆస్ట్రేలియా, టీమిండియా మ్యాచ్ వర్షంతో రద్దయితే, అప్పుడు కూడా టీమిండియాకు అవకాశం ఉంటుంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే హర్మన్ సేన ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ ఏడు పాయింట్లతో నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం సమీకరణాలతో సంబంధం లేకుండా ఆసీస్‌తో పాటు సఫారీలు నాకౌట్లో అడుగుపెట్టనుంది.చదవండి: అరువు తెచ్చుకున్న పోల్‌తో జాతీయ రికార్డు! -
తజ్మీన్ బ్రిట్స్ మెరుపు సెంచరీ
బ్రిస్టల్: మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారీ విజయం నమోదు చేసుకుంది. సెమీఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ జట్టు సమష్టిగా సత్తా చాటి రన్‌రేట్‌ను మెరుగు పరుచుకుంది. గ్రూప్–1లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో దక్షిణాఫ్రికా 88 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది.మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. టి20ల్లో దక్షిణాఫ్రికాకు ఇది రెండో అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజ్మీన్ బ్రిట్స్ (69 బంతుల్లో 114 నాటౌట్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో అదరగొట్టింది. కెప్టెన్ లౌరా వోల్వార్ట్ (36 బంతుల్లో 45; 6 ఫోర్లు), అనేరియా డెర్క్సెన్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గ్రూప్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు... రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవాలనే లక్ష్యంతో ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో రెచ్చిపోయిన బ్రిట్స్... వోల్వార్ట్తో కలిసి తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించింది. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకంతో పూర్తి చేసుకున్న బ్రిట్స్... 63 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకుంది. టి20ల్లో ఆమెకు ఇదే తొలి శతకం. ఆఖర్లో డెర్క్సెన్ మెరుపులతో సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. కొండంత లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులకు పరిమితమైంది. మొల్కెన్బోర్ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు), సాన్యా ఖురానా (30 బంతుల్లో 36; 6 ఫోర్లు) కాస్త పోరాడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. గ్రూప్‌లో 4 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న దక్షిణాఫ్రికా (0.734 రన్‌రేట్) పట్టికలో మూడో స్థానంలో ఉంది. భారత జట్టు కూడా 6 పాయింట్లతోనే ఉన్నా రన్‌రేట్ (2.268)లో మెరుగ్గా ఉండటంతో రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. -
వరల్డ్‌కప్ సెమీస్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీలో ఉంది. ఇందులో భాగంగా తొలుత టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగుల తేడాతో చిత్తు చేసి బోణీ కొట్టింది ఆతిథ్య జట్టు.హ్యాట్రిక్ విజయాలుఅనంతరం ఐర్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన నాట్ సీవర్ బృందం.. ఆ తర్వాత స్కాట్లాండ్ మహిళా జట్టుపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది.డానీ వ్యాట్ అర్ధశతకంలండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో మొదట ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానీ వ్యాట్ (42 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించింది. మిగిలిన వారిలో హీథర్ నైట్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించింది.విండీస్ బౌలర్లలో అష్మిని మునిసార్ రెండు వికెట్లు తీయగా.. చినెల్లి హెన్రీ, కెప్టెన్ హేలీ మాథ్యూస్, కరిష్మా రామ్హరాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులకు పరిమితమైంది. లోయర్ ఆర్డర్లో చినెల్లి హెన్రీ మెరుపు అర్ధ శతకం (30 బంతుల్లో 51 నాటౌట్)తో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఓటమి ఖరారైంది.నాలుగింట నాలుగూ గెలిచిఇంగ్లండ్ బౌలర్లలో సారథిగా వ్యవహరించిన చార్లెట్ డీన్ రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్, సోఫీ ఎక్లిస్టోన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో విజయంతో లీగ్ దశలో ఇప్పటికి నాలుగింట నాలుగూ గెలిచిన ఇంగ్లండ్.. గ్రూప్-బి నుంచి అధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా అనధికారికంగా సెమీస్ చేరగా.. భారత్, సౌతాఫ్రికా రేసులో ఉన్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం వారిని బలిచేయలేము -
షఫాలీ విధ్వంసం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 25) జరిగిన కీలక సమరంలో బంగ్లాదేశ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రేణుకా సింగ్ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్ లేకుండా 11 పరుగులిచ్చింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో జుయారియా ఫెర్దోస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్ అక్తర్ (10 రిటైర్డ్ ఔట్), షోర్నా అక్తర్ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్ (4), రీతూ మోనీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్ డకౌటైంది. రబేయా ఖాన్, మరుఫా అక్తర్ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.షఫాలీ విధ్వంసం137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు. మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 25) కీలక మ్యాచ్ జరుగుతుంది. మాంచెస్టర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రేణుకా సింగ్ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసింది. బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్ లేకుండా 11 పరుగులిచ్చింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో జుయారియా ఫెర్దోస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్ అక్తర్ (10 రిటైర్డ్ ఔట్), షోర్నా అక్తర్ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్ (4), రీతూ మోనీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్ డకౌటైంది. రబేయా ఖాన్, మరుఫా అక్తర్ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఓ దశలో (తొలి వికెట్ తర్వాత) బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసేలా కనిపించిన బంగ్లా జట్టు.. భారత స్పిన్నర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. -
బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపు
బంగ్లాదేశ్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపు137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్ (26) బ్యాట్ ఝులిపించారు. మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్ 10, కెప్టెన్ హర్మన్ 13 (నాటౌట్), దీప్తి శర్మ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్, నహిద తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జూన్ 28 లార్డ్స్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి పాక్, నెదర్లాండ్స్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. షఫాలీ ఔట్8.4వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నహిద అక్తర్ బౌలింగ్‌లో నిగార్ సుల్తానా స్టంపింగ్ చేయడంతో షఫాలీ వర్మ (53) ఔటైంది.టీమిండియా స్టార్ బ్యాటర్ ఔట్2.6వ ఓవర్- 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (8) మూడో ఓవర్లోనేచ ఔటైంది. మరుఫా అక్తర్ బౌలింగ్‌లో రబేయా ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మంధాన పెవిలియన్ బాట పట్టింది. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 31-1గా ఉంది. మంధాన ఔటైనా మరో ఓపెనర్ షఫాలీ వర్మ (22) ధాటిగా ఆడుతుంది. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్12.5వ ఓవర్- 79 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి శోభన మోస్తరి (22) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్8.5వ ఓవర్- 59 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. జుయారియా ఫెర్దోస్ (33) నందిని శర్మ బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యింది. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో శ్రీ చరణికి క్యాచ్ ఇచ్చి దిల్హర అక్తర్ (4) ఔటైంది. 3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 12-1గా ఉంది. బంగ్లాదేశ్‌తో కీలక సమరం.. టాస్ ఓడిన టీమిండియాఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 25) కీలక మ్యాచ్ జరుగనుంది. మాంచెస్టర్ వేదికగా భారత్,బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మబంగ్లాదేశ్: దిల్హర అక్తర్, జువైరియా ఫిర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, రబెయా ఖాన్, నహిదా అక్తర్, శంజిదా అక్తర్ మేఘలా, మరుఫా అక్తర్ -
చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ గ్రూప్-ఏలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ, సదర్లాండ్, ఎలిస్ పెర్రీలు తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధశతకంతో రాణించగా, జార్జియా వోల్ (39), సదర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, రమీన్ షమీమ్, నష్రా సంధూ తలా రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్‌పై విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్లో అడుగుపెట్టింది. మరో బెర్తు కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. -
హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పర్వాలేదని పించినప్పటికీ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం హర్మన్ సేన కొంపముంచింది. ఇక మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి హర్మన్ సేనకు పలు కీలక సూచనలు చేసింది.జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీరాజ్ మాట్లాడింది. ‘భారత జట్టుకు ఇది చాలా నిరుత్సాహపరిచే గేమ్. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే హర్మన్ సేన పట్టికలో టాప్‌లో ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు చేసుకుంటే ఆసీస్‌పై విజయం అంత కష్టమేమి కాకపోవచ్చు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె తన పాత స్థానమైన నాలుగులో బ్యాటింగ్‌కు రావాలి.. ఆ స్థానంలో వస్తున్న జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జెమిమా ఐదో స్థానంలో ఆడిన అనుభవముంది. స్పిన్నర్లను బాగా ఆడగలదనే పేరు కలిగిన జెమిమా ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల, ఆ సమయానికి ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం వస్తోంది. దీనివల్ల ఆమె వేగంగా పరుగులు చేయగలదు. స్పిన్ బౌలింగ్‌లోనే జెమీమా స్కూప్స్, స్వీప్ షాట్లు కచ్చితంగా ఆడగలదు. మరోవైపు హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల చివరి ఓవర్లలోనే ఆమె వేగంగా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఇక బౌలింగ్‌లో శ్రీచరణి తన ప్రదర్శనతో అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్నప్పటికీ అక్కడి పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో విజయవంతమవుతోంది. తన బౌలింగ్‌లో పేస్ వైవిధ్యం కనిపిస్తోంది. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేస్తున్నశ్రీచరణి రాబోయే రోజుల్లో జట్టుకు కీలక బౌలర్‌గా మారనుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ జూన్ 25న (గురువారం) బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న (ఆదివారం) ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండింట గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే! -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా ప్లేయర్ మారిజాన్ కాప్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో నిన్న జరిగిన కీలక పోరులో 4 సిక్సర్లు బాదిన ఆమె.. సౌతాఫ్రికా తరఫున మహిళల టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మూడు సిక్సర్లతో క్లో ట్రయాన్, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ట్ పేరిట ఉండేది.కాప్ రికార్డు ప్రదర్శన కారణంగా భారత్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆమె, 45 బంతుల్లో 4 సిక్సర్లతో పాటు 7 ఫోర్లు బాది అజేయమైన 81 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపు సౌతాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది.కాప్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (81*) నమోదు చేసిన ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ జాబితాలో విండీస్ స్టెఫానీ టేలర్ 90 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.భారత్‌పై గెలుపు మహిళల టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 150కిపైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికాను నిలిపింది . ఇది వారి పదో విజయవంతమైన 150 ప్లస్ పరుగుల ఛేదన. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (9) పేరిట ఉండేది.కాప్ చేసిన అజేయ 81 పరుగులు మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అలాగే ప్రపంచకప్‌లో భారత్‌పై నమోదైన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగానూ రికార్డుల్లోకెక్కింది.ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన కాప్.. మహిళల టీ20 ప్రపంచకప్‌లలో 500కిపైగా పరుగులు, 30కిపైగా వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఈ జాబితాలో ఎల్లిస్ పెర్రీ, డియాండ్ర డాట్టిన్, స్టెఫానీ టేలర్ మాత్రమే కాప్ కంటే ముందున్నారు.ఇక జట్టు రికార్డుల విషయానికి వస్తే, 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికా మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదనగా నిలిచింది. అలాగే ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన ఛేజ్గానూ నమోదైంది.ఈ మ్యాచ్‌లో కాప్ తజ్మిన్ బ్రిట్స్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయమైన 70 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బ్యాటర్ మారిజెన్ కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు విజయాలు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. అయితే భారత్ తొలి రెండు మ్యాచ్‌లు (పాకిస్తాన్, నెదర్లాండ్స్) భారీ తేడాతో గెలవడంతో మెరుగైన నెట్ రన్‌రేట్ (+2.511) కారణంగా పట్టికలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ కంటే ముందుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు తలా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండడం, ఆసీస్ ఆడిన మూడింట గెలిచి సెమీస్ రేసులో ఒక మెట్టు పైనే ఉంది. అయితే హర్మన్ సేన సెమీస్ చేరడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.సెమీస్ అవకాశాలు ఇలా..భారత మహిళల జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ హర్మన్ సేన గెలిస్తే 8 పాయింట్లతో నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. అలా కాకుండా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడితే మాత్రం నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. అదే సమయంలో సౌతాఫ్రికా కూడా తాను ఆడబోయే రెండింటిలో ఒక దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాపై ఓడినా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బంగ్లాదేశ్ మనపై విజయం సాధిస్తే మాత్రం రన్‌రేట్ పడిపోయి హర్మన్ సేన ఎలిమినేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక హర్మన్ సేన తాము ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైతే మాత్రం ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టోర్నీ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లో ఒక జట్టు సెమీస్ చేరుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి మరో సెమీస్ స్థానానికి భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్పోటీపడాల్సి వస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.ఓపెనర్ షఫాలీ వర్మ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా, దీప్తిశర్మ (29), హర్మన్‌ప్రీత్ (24) పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మారిజెన్ కాప్, షబ్నమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కాప్ సంచలన ఇన్నింగ్స్‌తో 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తంజిమ్ బ్రిట్స్ (40), లారా వోల్వర్ట్ (20) రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టింది.చదవండి: కొంపముంచిన రెడ్‌కార్డ్.. బెల్జియంకు ఇరాన్ షాక్ -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్‌దే! యువ ప్లేయర్ డెబ్యూ
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా 24 ఏళ్ల యువ స్పిన్నర్ ప్రేమ రావత్ భారత్ తరపున అరంగేట్రం చేసింది.గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రేయాంక పాటిల్ స్ధానంలో ప్రేమ రావత్ జట్టులోకి వచ్చింది. అదేవిధంగా క్రాంతి గౌడ్ స్ధానంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డికి తుది జట్టులో చోటు దక్కింది.కాగా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. మహిళల క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా హర్మన్ నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.తుది జట్లుదక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(వికెట్ కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్కులులేకో మలాబాభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ -
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్‌కు టోర్నీలో ఇది హ్యాట్రిక్ పరాజయం. ఇంతకముందు భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ మహిళల జట్టు తాజాగా శనివారం బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో నాకౌట్ దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్‌పై భారీ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్కు చేరుకోవడంతో పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్ కూడా మూడు ఓటములతో టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది. అటు పురుషులు.. ఇటు మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ చేరడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా మహిళల జట్టు కూడా పురుషుల జట్టునే అనుసరించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. 2009 ఆరంభ టీ20 ప్రపంచకప్ నుంచి ప్రతీసారి బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు ఏనాడు ఫస్ట్ రౌండ్ దాటింది లేదు. ఈసారి కూడా ఆ చెత్త రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది.మరోవైపు ఇదే గ్రూప్‌లో ఉన్న భారత మహిళల జట్టు మాత్రం రెండు విజయాలతో ఆసీస్ తర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌కు చేరుకోవాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. Pakistan Women's became the first Asian Team to get Eliminated from the Women's T20 World Cup 2026- Lost against India- Lost against South Africa- Lost against Bangladesh pic.twitter.com/UBcGqBOC9S— Ajay Jadeja (@AjayJadeja171) June 20, 2026చదవండి: 11 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు! -
పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది. ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. -
డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు తృటిలో తప్పిన మరో పరాభవం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌కు వరుస పరాభవాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు, తాజాగా మరో పరాభావాన్ని తృటిలో తప్పించుకొని ఊపీరి పీల్చుకుంది.సౌథాంప్టన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంప్ 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. తద్వారా సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (30), బ్రూక్ హ్యాలీడే (34), ఇజ్జీ షార్ప్ (36) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇసబెల్లా గేజ్ 1, ప్లిమ్మర్ 4, మ్యాడీ గ్రీన్ 2 పరుగులకు ఔట్ కాగా.. సూజీ బేట్స్ 19, జెస్ కెర్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐరిష్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, కారా ముర్రే తలో 2 వికెట్లు తీయగా.. మగూర్, కెల్లీ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో నిదానంగా ఆడి ఓటమిని కొని తెచ్చుకుంది. గ్యాబీ లెవిస్ (58), ప్రెండర్‌గాస్ట్ (59) అర్ద సెంచరీలతో రాణించినా లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. సూజీ బేట్స్ వారిని నిలువరించింది. లియా పాల్ (8 నాటౌట్), లూయిస్ లిటిల్ (5 నాటౌట్) ఐర్లాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెర్ 2, ఇల్లింగ్, రోస్‌మేరీ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు.ఈ ఓటమితో ఐర్లాండ్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది. -
గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే?
భారత క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో జోష్ మీదున్న హర్మన్ సేనకు శ్రేయాంక పాటిల్ గాయపడడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.ఇక ప్రేమా రావత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్‌లో తన లెగ్-స్పిన్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశీయ సర్క్యూట్లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె ఇండియా-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.కాగా టోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్ చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే శ్రేయాంకకు గాయాలు కొత్తేమి కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. -
వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. స్కాట్లాండ్ పోరాటం వృథా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. షెమైన్ క్యాంప్‌బెల్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేయగా.. ఏడో స్థానంలో బరిలోకి దిగిన స్టెఫానీ టేలర్ 19 బంతుల్లో అజేయమైన 47 పరుగులు (3 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి జట్టుకు పోరాడే స్కోర్‌ను అందించింది. మిగతా ప్లేయర్లలో కియానా జోసఫ్ (13), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (14), డియాండ్రా డాట్టిన్ (14), క్లాక్స్టన్ (16), చినెల్ హెన్రీ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో కేథరీన్ ఫ్రేజర్ 2 వికెట్లతో రాణించగా.. కేథరీన్ బ్రైస్, రేచల్ స్లేటర్, గార్డన్ తలో వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. డార్సీ కార్టర్, కేథరీన్ ఫ్రేజర్ జోడీ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. గాయంతో ఇబ్బంది పడుతూనే కార్టర్ 53 బంతుల్లో అర్ధశతకం సాధించింది.ఈ దశలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి స్కాట్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆమె మూడు, అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 23 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో గట్టిగా పోరాడినా 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది.ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-బీలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సెమీస్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది. -
టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది.దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్‌ను అస్పత్రికి తరలించారు. ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రీయాంక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది. కాగా శ్రీయాంకు గాయాలేమి కొత్త కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. ఇలాంటి సమయంలో శ్రేయాంక గాయం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.చదవండి: ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?! -
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డు
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా భారత జట్టు బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే.మంధాన, షఫాలీ మెరుపులులీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుపులతో హర్మన్ సేనకు శుభారంభం దక్కింది. స్మృతి 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించగా.. షఫాలీ 38 బంతుల్లో 10 ఫోర్లు బాది 55 పరుగులు చేసింది.మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (20) మాత్రమే ఓ మోస్తరుగా రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ మహిళా జట్టు 17.3 ఓవర్లలో కేవలం 114 పరుగులే చేసి ఆలౌట్ అయింది.చెలరేగిన బౌలర్లుభారత ప్లేయర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ మూడు, నందినీ శర్మ రెండు, దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.మంధాన ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్ సందర్భంగానే స్మృతి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 600 ఫోర్లు పూర్తి చేసుకుంది. తద్వారా పురుష, మహిళల క్రికెట్లో ఈ అరుదైన మార్కు అందుకున్న తొలి ప్లేయర్‌గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ప్రపంచ రికార్డు సాధించింది.Consistent. Majestic. Mandhana. 🤌✨👸 pic.twitter.com/vPPYtyMnP0— Royal Challengers Bengaluru (@RCBTweets) June 17, 2026అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లు👉స్మృతి మంధాన (ఇండియా)- 604 ఫోర్లు👉సూజీ బేట్స్ (న్యూజిలాండ్)- 521 ఫోర్లు👉చమరి ఆటపట్టు (శ్రీలంక)- 493 ఫోర్లు👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 477 ఫోర్లు👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 459 ఫోర్లు👉పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 449 ఫోర్లు.చదవండి: డబుల్ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్ -
ఉత్కంఠ పోరులో పాక్‌పై సౌతాఫ్రికా గెలుపు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తర్వాత, పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడినా, 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెర్క్సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో, నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికాను గెలిపించారు.తొలుత బ్యాట్‌తో (55 నాటౌట్) సత్తా చాటిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా, ఆతర్వాత బంతితోనూ (2.5-0-16-3) చెలరేగి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపింది. సనాకు సదియా ఇక్బాల్ (4-0-26-2), తుబా హస్సన్ (4-0-28-2), నష్రా సంధు (4-0-28-1) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే అప్పటికే డెర్క్సెన్, క్లెర్క్ గెలుపుకు పునాది వేయడంతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరగలిగింది.అంతకుముందు 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ను ఫాతిమా సనా (38 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), తుబా హస్సన్ (23) ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్‌లో సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు. -
టీమిండియా ఖాతాలో మరో విజయం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లో ఘన సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. ఇవాళ (జూన్ 17) జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై అదే తరహా విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ చేసి, 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.చెలరేగిన మంధన, షఫాలీనెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు స్మృతి మంధన (47 బంతుల్లో 74; 11 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (38 బంతుల్లో 55; 10 ఫోర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (8 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (2 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించారు. జెమీమా రోడ్రిగ్స్ 19, యస్తికా భాటియా 3 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఐరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీశారు.శ్రీ చరణి మాయాజాలం.. బంతితోనూ సత్తా చాటిన షఫాలీ210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆ జట్టు టాప్-4 బ్యాటర్స్ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి నెదర్లాండ్స్ ప్లేయర్లంతా బెంబేలెత్తిపోయారు. శ్రీ చరణి (4-0-19-4) దెబ్బకు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆమెకు షఫాలీ వర్మ (3.2-0-20-3) కూడా తోడవ్వడంతో నెదర్లాండ్స్ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. మిగతా భారత బౌలర్లలో నందిని శర్మ 2, దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో వారి కెప్టెన్ బాబెట్ డి లీడ్ చేసిన 28 పరుగులే అత్యధికం. జూన్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది. -
77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా వుమెన్‌ను 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన మొలినెక్స్ బృందం.. తాజాగా బంగ్లాదేశ్ మహిళా జట్టుపై కూడా ఘన విజయం సాధించింది.టాపార్డర్ కుదేలు లీడ్స్ వేదికగా హెడింగ్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టాపార్డర్ కుదేలైంది. ఆసీస్ పేసర్ కిమ్ గార్త్.. ఓపెనర్లలో దిలారా అక్తర్‌ను డకౌట్ చేయడంతో పాటు.. జువేరియా ఫిర్దోస్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.వన్‌డౌన్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (5)ను ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం బంగ్లా సారథి నిగర్ సుల్తానా (27)ను కూడా మొలినెక్స్ LBWగా వెనక్కి పంపింది. ఇక మిగిలిన వారిలో శోభనా మొస్తరీ (4), షోర్నా అక్తర్ (0) వికెట్లను ఎలిస్ పెర్రీ తన ఖాతాలో వేసుకోగా.. రీతూ మోనీ (16)ని జార్జియా వారేహామ్.. రెబెయా ఖాన్ (8)ను అన్నాబెల్ సదర్లాండ్ పెవిలియన్‌కు పంపారు.77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదనఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 77 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ జార్జియా వోల్ (32 బంతుల్లో 45)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 19) అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ బెత్ మూనీ (10) మాత్రం మరూఫా అక్తర్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. కాగా బంగ్లాపై విజయంతో గ్రూప్-‘ఎ’లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ -
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌కు శ్రీలంక జట్టు ఊహించని షాకిచ్చింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కెప్టెన్ అమేలియా కెర్ (45), సోఫీ డివైన్ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లతో సత్తా చాటగా.. మిథాలీ అయోధ్య, సుగంధిక కుమారి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, నిమష మీపగే తలో వికెట్ తీశారు.అనంతరం 151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలో తడబడినప్పటికీ (55 పరుగులకే 4 వికెట్లు).. నిలాక్షిక డిసిల్వ (54 నాటౌట్), కౌషని నుత్యాంగన (24 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ సత్తా చాటడంతో లంక జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే (19.4 ఓవర్లు) లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్ల నష్టానికి). కివీస్ బౌలర్లలో నెన్సి పటేల్ (4-0-23-2), రోస్మేరి (4-1-28-0), బ్రీ ఇల్లింగ్ (4-0-33-1) రాణించినా నిలాక్షిక, కౌషని జోడీని నిలువరించలేకపోయారు.ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. శ్రీలంకకు ముందు ఈ జట్టు విండీస్ చేతిలో కూడా చిత్తైంది. లంక విషయానికొస్తే.. ఈ ఎడిషన్‌లో ఈ జట్టుకు ఇదే తొలి గెలుపు. దీనికి ముందు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడింది. -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్‌కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్‌ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్‌లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్‌లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్‌లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్‌లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్‌కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లోనూ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది.5/10 – దీప్తి శర్మ vs పాకిస్తాన్, బర్మింగ్‌హామ్, 2026, 5/11 – జులన్ గోస్వామి vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం, 20125/15 – రేణుకా సింగ్ vs ఇంగ్లాండ్, గ్కెబెర్హా, 20235/16 – ప్రియాంక రాయ్ vs పాకిస్థాన్, టౌంటన్, 20095/19 – దీప్తి శర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 202628 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచ కప్‌లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:5/5 – డియాండ్రా డాటిన్ (వెస్ట్ ఇండీస్) వర్సెస్ బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్, 20185/8 – సునే లూస్ (దక్షిణాఫ్రికా) వర్సెస్ ఐర్లాండ్, చెన్నై, 20165/10 – దీప్తి శర్మ (భారతదేశం) వర్సెస్ పాకిస్తాన్, బర్మింగ్‌హామ్, 2026, ఈరోజు*5/12 – ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) వర్సెస్ న్యూజిలాండ్, పార్ల్, 20235/15 – రేణుకా సింగ్ (భారత్) వర్సెస్ ఇంగ్లండ్, గ్వేబెర్హా, 2023ఇక మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.BIG NEWS 🚨 India Women Team defeats Pakistan by 64 runs in #T20WC2026 opener!Deepti Sharma wins Player of the Match.She picked up a career-best 5/10 with the ball to restrict Pakistan to 106."Special Thanks to Hanuman ji" - DEEPTI 🔥 pic.twitter.com/h4VZqnXtgJ— News Algebra (@NewsAlgebraIND) June 14, 2026 -
‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు మంధాన, హర్మన్ మెరుపులతో పాక్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడింది. 'మ్యాచ్ విజయంతో చాలా సంతోషంగా ఉన్నా. ముందుగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మ్యాచ్ విజయంలో (స్మృతి మంధాన, దీప్తి శర్మ) ఆ ఇద్దరిదే కీలకపాత్ర. జట్టుకు అవసరమైనప్పుడల్లా వారు ముందుంటారు. ఇవాళ వాళ్లిద్దరూ ఆడిన తీరు చూసి సంతోషంగా అనిపించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆరంభంలో వికెట్లు పడడంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాం. అయితే పిచ్‌పై అవగాహన వచ్చిన తర్వాత మంధాన, నేను స్వేచ్ఛగా ఆడాం. రిచా ఘోష్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వొచ్చు. కానీ ఆమె ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని చెప్పింది. ఇవాళ ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించింది. ఇక ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులున్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో వాటిని సరిచేసుకుంటాం. నెట్ రన్‌రేట్ అనేది కీలకం కాబట్టి మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.' అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. -
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
-
దీప్తి మాయాజాలం.. పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) మంధనకు సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు.దీప్తి మాయాజాలంఅనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. దీప్తి శర్మ మాయాజాలానికి (4-0-10-5) కుదేలైంది. ఆమె శ్రీ చరణి (4-0-21-3), షఫాలీ వర్మ (3-0-22-1) కూడా తోడవ్వడంతో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున ఓపెనర్ మునీబా అలీ (41) మాత్రమే ఓ మోస్తరు స్కోర్ సాధించింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (12), ఆయేషా జాఫర్ (2), ఆలియా రియాజ్ (18) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు సాధించగా.. సైరా జబీన్ (2), నతాలియా పర్వేజ్ (7), రమీన్ షమీమ్ (4), నష్రా సంధు (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఫాతిమా సనా, తస్మియా రుబాబ్ డకౌట్లయ్యారు. ఈ గెలుపుతో భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లైంది. -
పాక్‌తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగ.. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. చరిత్ర సృష్టించిన హర్మన్ ఈ మ్యాచ్‌లో హర్మన్ ఓ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (762) చేసిన బ్యాటర్‌గా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ ( 726) పేరిట ఉండింది. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో హర్మన్, మిథాలీ తర్వాతి స్థానాల్లో స్మృతి మంధాన (592), జెమీమా రోడ్రిగ్స్ (408), పూనమ్ రౌత్ (375) ఉన్నారు. -
బోణీ కొట్టిన బంగ్లాదేశ్
2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. అరంగేట్రం బ్యాటర్ ఫిర్దౌస్ (50) మెరుపు అర్ద శతకంతో బంగ్లా గెలుపుతో ప్రధానపాత్ర పోషించింది.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మరుఫా అక్తర్ (4-0-31-2), ఫరిహా త్రిస్న (4-0-32-1) చక్కటి బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ బార్బెట్ డి లీడ్ 45 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. లీడ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ఆఖర్లో ఐరిస్ జ్విల్లింగ్ (13 నాటౌట్), సిల్వర్ సీగర్స్ (10 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఫిర్దౌస్, దిల్హర అక్తర్ (26) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. ఫిర్దౌస్ కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.అంతా సజావుగా సాగుతున్న వేల, నెదర్లాండ్స్ బౌలర్లు అనూహ్య పోరాట పటిమ కనబరిచారు. కరోలిన్ డి లాంజ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. ఫిర్దౌస్ అర్ధశతకం అనంతరం ఔట్ కాగా, కెప్టెన్ నిగార్ సుల్తానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అనంతరం సిల్వర్ సీగర్స్ దిల్హరాను ఔట్ చేయగా, ఫ్రెడెరిక్ ఓవర్‌డైక్ అద్భుత డైరెక్ట్ హిట్‌తో శోభన మోస్తరీను రనౌట్ చేసింది. దీంతో బంగ్లా స్కోర్ 67/0 నుంచి 85/4కు పడిపోయి ఒత్తిడిలో పడింది.ఈ దశలో అనుభవజ్ఞురాలు షర్మిన్ అక్తర్ (37 నాటౌట్), యువ బ్యాటర్ షోరఆన అక్తర్ (18 నాటౌట్) జాగ్రత్తగా ఆడి, మరో 5 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్‌ను (4 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లాంజ్ 2, సిల్వర్ ఓ వికెట్ తీశారు. -
టీమిండియా ఘన విజయం
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ (4-0-10-5) మాయాజాలానికి పాక్ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరఫున బ్యాటింగ్‌లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. ఓటమి దిశగా పాక్75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 83-6గా ఉంది. ఆలియా రియాజ్ (4), రమీన్ షమీమ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4వ ఓవర్- 58 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇచ్చి సైరా జబీన్ (2) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన పాక్6.3వ ఓవర్- 53 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధనకు క్యాచ్ ఇచ్చి అయేషా జాఫర్ (12) ఔటైంది.ఇండియాకు తొలి బ్రేక్171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌కు మెరుపు ఆరంభం లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్లో భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇది జరిగింది. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆపఖ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్‌లో నతాలియాకు క్యాచ్ ఇచ్చి హర్మన్‌ప్రీత్ (36) ఔటైంది. 👉 సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్ ఔట్ కావడంతో 110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.మంధాన (68) ఔట్.. మూడో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రమీన్ సమీమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హాఫ్ సెంచరీ బాదిన మంధానపాక్తో మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్‌ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ ఎంతంటే..?18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్మృతి మంధన (28), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54-2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.2వ ఓవర్- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తస్మియా రుబాబ్ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్ క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్‌కు చేరింది. తొలి బంతికే సిక్సర్.. ఐదో బంతికి వికెట్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సదియా ఇక్బాల్ బౌలింగ్‌లో షఫాలీ వర్మ సిక్సర్ కొట్టింది. అయితే అదే ఓవర్ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగనుంది. దాయాదులు భారత్, పాకిస్తాన్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత, పాక్ కెప్టెన్లు నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని కొనసాగించారు. తుది జట్లు:భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్పాకిస్తాన్: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్ -
పాక్‌తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన మాటలతో అగ్గి రాజేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్మన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాము. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా అనవసర విషయాల గురించి మాట్లాడదలచుకోలేము. అయినా నేను క్రికెట్ తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ అనేది మా కల. దాని గురించే మాట్లాడుకుంటాం. మీరు హైవోల్టేజ్ మ్యాచ్ అని చెబుతున్న ప్పటికీ నా దృష్టిలో మాత్రం పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను ఒక సాధారణ గేమ్‌గానే చూస్తున్నాను. అయితే పాక్‌తో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. పాక్ ఒక్కటే కాదు తాము ఆడబోయే ప్రతీ మ్యాచ్‌లోనూ ఒత్తిడి సహజం. కానీ దానిని జయిస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. ఎవరితో మ్యాచ్ అయినా మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలని అనుకుంటాము.’ అని చెప్పుకొచ్చింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు తలపడితే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. కానీ పహల్గాం ఘటన తర్వాత పాక్‌తో ఆడే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆసియా కప్ నుంచి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హర్మన్ సేన పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. కాబట్టి నేటి మ్యాచ్‌లోనూ భారత మహిళా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం లేదు. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2020 ఎడిషన్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 𝘛𝘩𝘦 𝘸𝘰𝘳𝘭𝘥 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘴 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘪𝘥 𝘰𝘯𝘤𝘦…𝙂𝙧𝙚𝙖𝙩 𝙏𝙚𝙖𝙢𝙨 𝘢𝘳𝘦 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘦𝘥 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘰 𝘯𝘦𝘹𝘵 🏆⏳The #WomenInBlue are #T20WorldCup ready 💪 #TeamIndia pic.twitter.com/7fWJN6ootJ— BCCI Women (@BCCIWomen) June 14, 2026చదవండి: ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం! -
107 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, మలాబా, నడైన్ డిక్లార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లారా వోల్వడర్ట్(44) మినహా మిగతా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ జార్జియా వేర్హామ్ 3 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కెప్టెన్ మోలనిక్స్, కింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వేర్హామ్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
IND vs PAK: భారత తుది జట్టు ఇదే!
పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 మధ్య ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్- శ్రీలంక మధ్య శుక్రవారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.ఇక భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం (జూన్ 14) ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పాక్‌తో తలపడే భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఓపెనర్‌గా షఫాలీ వర్మనే సరైన ఆప్షన్. ఆమెకు తోడుగా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఉండనే ఉంది. యస్తికా భాటియా కూడా అద్భుతంగా ఆడుతోంది. మూడో స్థానంలో ఆమెను ఆడించాలి. నాలుగో స్థానంలో జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడుతుంది.రిచా ఘోష్ ఆరో స్థానంలో పవర్ హిట్టర్‌గా సేవలు అందించగలదు. భారతి పుల్మాలిని ఎంపిక చేయాలనే ఉంది. కానీ రాధా యాదవ్‌తో పోలిస్తే ఆమె కాస్త వెనుబడి ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఫినిషర్‌గా రాణించగల లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్‌నే నేను ఎంచుకుంటాను.ఆ తర్వాతి స్థానంలో దీప్తి శర్మ ఉంటుంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి బౌలింగ్ విభాగంలో సేవలు అందిస్తారు’’ అని అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్. -
‘మమ్మల్ని ఆదరించండి’.. మంధాన సంచలన వ్యాఖ్యలు!
మహిళల క్రికెట్ చరిత్రలో మరో అత్యుత్తమ సమరానికి తెరలేవబోతోంది. జూన్ 12 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీ జరుగుతున్నా భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు మాత్రమే హైప్ ఉందని, మిగిలిన టోర్నీకి కూడా అదే స్థాయిలో ఆదరణ చూపాలని అభిమానులకు విజ్ఞప్తి ఆసక్తి కలిగించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్, హైప్ సహజమైనదే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాకుండా టోర్నీ మొత్తానికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆమె కోరారు. మహిళల క్రికెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె గుర్తుచేశారు. అభిమానులు, క్రీడా విశ్లేషకులు, మీడియా సంస్థలు కేవలం భారత్-పాక్ పోరుపైనే కాకుండా, టోర్నమెంట్లో జరిగే మిగిలిన అన్ని మ్యాచ్‌లపై కూడా అంతే శ్రద్ద పెట్టాలని, అప్పుడే మహిళల క్రికెట్‌కు నిజమైన గుర్తింపు దక్కుతుందని మంధాన అభిప్రాయపడ్డారు. పురుషుల క్రికెట్‌తో సమానంగా తాము అద్భుతాలు చేస్తున్నప్పటికీ మహిళల క్రికెట్‌పై ఇంకా చిన్నచూపేనని పేర్కొన్నారు. స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ టోర్నీ విజయవంతం కావడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఎంతో కీలకమని, ప్రతీ మ్యాచ్ గురించి చర్చ జరగాలని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మంధాన చెప్పినట్లుగా కేవలం ఒకే ఒక్క హై-వోల్టేజ్ మ్యాచ్ టోర్నీని ముగించకుండా, ప్రతీ లీగ్ మ్యాచ్‌ను, ప్రతీ జట్టు ప్రదర్శనను హైలైట్ చేయడం వల్ల మహిళల క్రీడలకు మరింత వాణిజ్య పరమైన ఆదరణ, స్పాన్సర్షిప్ లభించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇక ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లు టైటిల్ గెలవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. గత కొన్ని సిరీస్‌లుగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచింది.చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్‌లో మెరిసిన టీమిండియా స్టార్!


