సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ | England-Beat South Africa-2nd-Semis-Enter-Finals-ICC Women-WC | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌

Jul 3 2026 2:56 AM | Updated on Jul 3 2026 5:21 AM

England-Beat South Africa-2nd-Semis-Enter-Finals-ICC Women-WC

ఐసీసీ మ‌హిళ‌ల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఓవ‌ల్ వేదిక‌గా గురువారం రాత్రి సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్‌లో ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు 40 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. 170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 


బౌండరీ లైన్‌ వద్ద సోఫీ విన్యాసం

ఓపెన‌ర్ తంజిమ్ బ్రిట్స్ (51) మిన‌హా మిగ‌తా వారంతా విఫ‌ల‌మ‌య్యారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో చార్లీ డీన్‌, లారెన్ బెల్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, లిన్సే స్మిత్‌, ఫ్రేయా కెంప్‌, సోఫి ఎసెల్‌స్టోన్ త‌లా ఒక వికెట్ తీశారు. ఆదివారం లార్డ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ త‌ల‌ప‌డ‌నుంది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించిన నట్‌ సివర్‌ బ్రంట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకుంది.


తంజిమ్‌ బ్రిట్స్‌ (51)

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. కెప్టెన్ న‌ట్‌సివ‌ర్ బ్రంట్ (47 బంతుల్లో 75; 11 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌), హెథ‌ర్‌నైట్ (47 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌) రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ష‌బ్న‌మ్ ఇస్మాయిల్‌, లాబా చెరో 2 వికెట్లు తీయ‌గా, మారిజెన్ కాప్ ఒక వికెట్ ప‌డ‌గొట్టింది. 


నట్‌ సివర్‌ బ్రంట్‌ (75), హెథర్‌నైట్‌ (58)

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జ‌ట్టు 23 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో బ్రంట్‌, హెథ‌ర్‌నైట్‌లు నాలుగో వికెట్‌కు 133 ప‌రుగులు జోడించడంతో ఇంగ్లండ్ జ‌ట్టు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేదనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు దానిని మరోసారి నిరూపితం చేస్తూ లీగ్‌ దశ వరకు ఎదురులేకుండా సాగిన సఫారీలు సెమీస్‌కు పరిమితమై చోకర్స్‌ ముద్రను చెరిపేసుకోవడంలో విఫలమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement