source: BCCI X
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 44 పరుగులు చేసి భారత్‌కు విలువైన ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఈ టెస్టులో అతడి మొత్తం పరుగుల సంఖ్య 211కు చేరింది.
ఈ క్రమంలో శ్రీలంక గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో పడిక్కల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, శిఖర్ ధవన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సౌరవ్ గంగూలీ, సదగోపన్ రమేశ్, చటేశ్వర్ పుజారా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు.
సెహ్వాగ్ రికార్డుకు 41 పరుగుల దూరంలో
శ్రీలంకలో ఒక టెస్టులో భారత బ్యాటర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ వీరేంద్ర సెహ్వాగ్ పేరిటే ఉంది. 2008లో గాలేలో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 201 నాటౌట్, 50 పరుగులతో మొత్తం 251 పరుగులు చేశాడు. ఇప్పుడు పడిక్కల్ 211 పరుగులతో రెండో స్థానంలో నిలిచి, సెహ్వాగ్ రికార్డుకు 41 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
శ్రీలంకలో ఒక టెస్టులో భారత్ తరఫున అత్యధిక పరుగులు:
1. వీరేంద్ర సెహ్వాగ్ – 251, గాలే, 2008
2. దేవదత్ పడిక్కల్ – 211*, గాలే, 2026
3. శిఖర్ ధావన్ – 204, గాలే, 2017
4. సచిన్ టెండూల్కర్ – 203, కొలంబో, 2010
5. సౌరవ్ గంగూలీ – 192, కొలంబో, 1997
నంబర్-3లో 200+ పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్
ఈ టెస్టుతో పడిక్కల్ మరో అరుదైన జాబితాలోనూ చోటు సంపాదించాడు. భారత్ తరఫున టెస్టుల్లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 200కుపైగా పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ ఈ ఘనతను మూడు సార్లు సాధించాడు. 2004లో పాకిస్థాన్‌పై రావల్పిండిలో 270 పరుగులు, 2003లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో 233 పరుగులు, 2002లో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో 217 పరుగులు చేశాడు.
సంజయ్ మంజ్రేకర్ 1989లో లాహోర్‌లో పాకిస్థాన్‌పై 218 పరుగులు చేసి ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. తాజాగా పడిక్కల్ 211 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
పుజారాకు దక్కని రికార్డు
ఆసక్తికరంగా, భారత టెస్టు జట్టులో నంబర్-3 స్థానానికి ఎన్నో ఏళ్లపాటు పర్యాయపదంగా నిలిచిన చటేశ్వర్ పుజారా మాత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు. 2019లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో పుజారా 193 పరుగులు చేశాడు. దీంతో 200 పరుగుల మార్క్‌కు ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
పడిక్కల్ మాత్రం తన ఐదో టెస్ట్ మ్యాచ్‌లోనే 200కుపైగా మ్యాచ్ పరుగులు సాధించి ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పంత్ (66) అర్ద సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) చేసి, శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 462 పరుగులు చేసింది.


