నేడు ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌ | ICC Womens T20 World Cup 2026, South Africa To Take On England In Second Semi Final, Check Pitch Condition And Squad Details | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌

Jul 2 2026 9:07 AM | Updated on Jul 2 2026 9:37 AM

ICC Womens T20 World Cup 2026: South Africa to take on England in second semi final

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జులై 2) రెండో సెమీఫైనల్‌ జరుగనుంది. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌.. అండర్‌ డాగ్‌ సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ‍ప్రకారం​ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. హాట్‌స్టార్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉంటుంది.

జట్ల వివరాలు..
ఇంగ్లండ్‌: నాట్ స్కివర్-బ్రంట్ (సి), లారెన్ బెల్, అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్‌స్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రెయా కెంప్, హీథర్ నైట్, లిన్సే స్మిత్, ఇస్సీ వాంగ్, డానీ వ్యాట్-హాడ్జ్‌

సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (సి), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్‌సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజాన్నె కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనెక్, టుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్‌, డేన్‌ వాన్‌ నికెర్క్‌

పిచ్‌ వివరాలు
కెన్నింగ్టన్ ఓవల్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ఇక్కడ నిలకడగా బౌన్స్‌కు అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రయిట్‌ బౌండరీలు చిన్నగా ఉంటాయి. స్క్వేర్ బౌండరీలు కాస్త పెద్దగా ఉంటాయి. ఈ దశలో షాట్లు ఆడితే వికెట్ల మధ్య పరుగెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వేదికపై ఛేజింగ్‌ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement