ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్‌’ అతలాకుతలం | Russia pounds Kyiv in overnight missile and drone barrage | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్‌’ అతలాకుతలం

Jul 2 2026 7:56 AM | Updated on Jul 2 2026 11:05 AM

Russia pounds Kyiv in overnight missile and drone barrage

కీవ్‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా అర్థరాత్రి అకస్మాత్తుగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులకు తెగబడింది. నగరమంతటా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. పలు నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధానిపై రష్యా పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. ఎయిర్-రైడ్ సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన వేలాది మంది స్థానికులు భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు.
 

ఈ దాడిలో ఒక తొమ్మిది అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కూలిపోగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక హోటల్‌తో పాటు పలు నివాస ప్రాంతాలలో భారీగా మంటలు చెలరేగడంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కీవ్ మేయర్ విటాలీ క్లిట్చ్కో తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య సిబ్బంది గాయపడ్డారు.  ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలు, మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్ దాడులను పెంచిన నేపథ్యంలో రష్యా ఈ ప్రతీకార చర్యకు దిగింది. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఐర్లాండ్ పర్యటనలోవున్న జెలెన్స్కీ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఊహించని పరిణామాలకు దారితీస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఇప్పటికే హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement