చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. సెమీస్‌కు ఆస్ట్రేలియా | Australia Women Beat Pakistan By 113 Runs Enter Semi Final Women T20WC, Check Out Score Details And Highlights Inside | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. సెమీస్‌కు ఆస్ట్రేలియా

Jun 24 2026 8:37 AM | Updated on Jun 24 2026 10:51 AM

Australia Women Beat Pakistan-By-113 Runs Enter Semi-Final-Women T20WC

ఐసీసీ మ‌హిళ‌ల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ వ‌రుస‌గా నాలుగో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇప్ప‌టికే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన పాకిస్తాన్ గ్రూప్‌-ఏలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 200 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌డంతో ఆస్ట్రేలియా 113 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. 

పాక్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ మునీబా అలీ (32) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో సోఫీ, స‌ద‌ర్లాండ్‌, ఎలిస్ పెర్రీలు త‌లా రెండు వికెట్లు తీశారు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా, జార్జియా వోల్ (39), స‌ద‌ర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్‌) రాణించారు. 

పాక్ బౌల‌ర్లలో సాదియా ఇక్బాల్‌, ర‌మీన్ ష‌మీమ్‌, న‌ష్రా సంధూ త‌లా రెండు వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్‌పై విజ‌యంతో ఆస్ట్రేలియా నాకౌట్‌లో అడుగుపెట్టింది. మ‌రో బెర్తు కోసం భార‌త్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. గురువారం భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు బంగ్లాదేశ్ జ‌ట్టుతో కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement