చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్‌ | ICC Womens T20 World Cup 2026: team india restricted bangladesh to 136 runs | Sakshi
Sakshi News home page

చెలరేగిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్‌

Jun 25 2026 8:49 PM | Updated on Jun 25 2026 8:49 PM

ICC Womens T20 World Cup 2026: team india restricted bangladesh to 136 runs

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జూన్‌ 25) కీలక మ్యాచ్‌ జరుగుతుంది. మాంచెస్టర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. గ్రూప్‌-ఏ నుంచి సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు రాధా యాదవ్‌ (4-0-28-3), శ్రీ చరణి (4-0-21-2) బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 

రేణుకా సింగ్‌ (3-0-21-1), నందిని శర్మ (3-0-21-1) కూడా ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ (4-0-23-0) వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేసింది. బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించిన షఫాలీ వర్మ 2 ఓవర్లలో వికెట్‌ లేకుండా 11 పరుగులిచ్చింది.

బంగ్లా ఇన్నింగ్స్‌లో జుయారియా ఫెర్దోస్‌ (33), కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. శోభన మోస్తరి (22), షర్మిన్‌ అక్తర్‌ (10 రిటైర్డ్‌ ఔట్‌), షోర్నా అక్తర్‌ (13) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. దిల్హర అక్తర్‌ (4), రీతూ మోనీ (8) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితం కాగా.. నహిద అక్తర్‌ డకౌటైంది. రబేయా ఖాన్‌, మరుఫా అక్తర్‌ తలో 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఓ దశలో (తొలి వికెట్‌ తర్వాత) బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌ చేసేలా కనిపించిన బంగ్లా జట్టు.. భారత స్పిన్నర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement