107 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆసీస్‌ ఘన విజయం | T20 World Cup 2026: Clinical Australia dismantle South Africa | Sakshi
Sakshi News home page

T20 WC 2026: 107 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆసీస్‌ ఘన విజయం

Jun 14 2026 7:39 AM | Updated on Jun 14 2026 7:40 AM

T20 World Cup 2026: Clinical Australia dismantle South Africa

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం మాంచెస్టర్ వేదిక‌గా జరిగిన త‌మ‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఎలైస్‌ పెరీ (36), వేర్‌హామ్‌ (32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ఖాకా, మలాబా, నడైన్‌ డిక్లార్క్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ లారా వోల్వడర్ట్‌(44) మినహా మిగతా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్‌ స్పిన్నర్ జార్జియా వేర్‌హామ్‌ 3 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కెప్టెన్‌ మోలనిక్స్‌, కింగ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన వేర్‌హామ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 40 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్‌ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement