ఆసీస్‌కు రూ.22 కోట్లు.. మరి టీమిండియాకు ఎంతంటే? | Australia hit the JACKPOT with Rs 194200000 for winning ICC Womens T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: ఆసీస్‌కు రూ.22 కోట్లు.. మరి టీమిండియాకు ఎంతంటే?

Jul 6 2026 7:30 PM | Updated on Jul 6 2026 7:35 PM

Australia hit the JACKPOT with Rs 194200000 for winning ICC Womens T20 World Cup 2026

మ‌హిళ‌ల క్రికెట్‌లో త‌మ‌కు తిరుగు లేద‌ని ఆస్ట్రేలియా మ‌రోసారి నిరూపించుకుంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2026 విజేత‌గా ఆసీస్ నిలిచింది. ఆదివారం లార్డ్స్ మైదానం వేదిక‌గా జ‌రిగిన తుది పోరులో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. రికార్డు స్ధాయిలో ఏడోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.

ఇంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020, 2023 పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీల్లో కంగారులు ఛాంపియ‌న్స్ నిలిచారు. కాగా ఫైన‌ల్ పోరులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. తొలుత ఇంగ్లండ్‌ను 150 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన ఆసీస్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లో ఈ ల‌క్ష్యాన్ని కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఊదిప‌డేసింది. మ‌రోసారి సీనియ‌ర్  బ్యాట‌ర్ బెత్ మూనీ(64) ఫైన‌ల్ పోరులో స‌త్తాచాటింది.  మూనీకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి.

ఇక ఛాంపియ‌న్స్ ఆస్ట్రేలియా, ర‌న్న‌ర‌ప్ ఇంగ్లండ్‌కు ఎంత ప్రైజ్‌మ‌నీ ద‌క్కిందో ఓసారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్‌ ఇంగ్లండ్‌కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) న‌గ‌దు బ‌హుమ‌తి లభించింది. సెమీఫైనలిస్ట్‌లు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల‌కు రూ. 6.4 కోట్లు ప్రైజ్‌మ‌నీ అందింది.

భార‌త్‌కు ఎంతంటే?
ఇక గ్రూపు స్టేజ్‌లోనే ఇంటిముఖం ప‌ట్టిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకు కూడా ప్రైజ్‌మనీ లభించింది. టోర్నమెంట్‌లో పాల్గొన్నందుకు గానూ ప్రతి జట్టుకు ఐసీసీ రూ. 2.35  కనీస మొత్తాన్నిఅందజేసింది. అంతేకాకుండా గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టు 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు సుమారు రూ. 29.6 లక్షలు) బోనస్‌గా లభిస్తుంది. మూడు విజయాలకు గానూ భారత్‌కు లభించిన రూ. 89 లక్షలు దక్కింది. మొత్తంగా  హర్మన్‌ సేనకు రూ. 3.24 కోట్లు ప్రైజ్‌మనీగా అందుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement