AUstralia womens team
-
పరాజయం పలకరిస్తోంది!
పెర్త్: భారత మహిళల జట్టు ఏకైక డే అండ్ నైట్ టెస్టులో పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఆ్రస్టేలియా మహిళల జట్టు మ్యాచ్‌నే శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాట్‌తో, తర్వాత బంతితో హర్మన్‌ప్రీత్ బృందాన్ని ఆటాడుకుంది. దీంతో నాలుగు రోజుల ‘పింక్ బాల్’ టెస్టును మూడు రోజుల్లోనే ముగించేందుకు సిద్ధమైంది. ఓవర్‌నైట్ స్కోరు 96/3తో శనివారం ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90.4 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. క్రితంరోజు బ్యాటర్లు అనాబెల్ సదర్లాండ్ (129; 17 ఫోర్లు) ‘శత’క్కొట్టగా, ఎలీస్ పెరీ (76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే 4 వికెట్లు, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్మృతి మంధాన (2), షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (14), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ (11)లతో కూడిన ప్రధాన బ్యాటింగ్ బలగమంతా ని్రష్కమించింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే భారత జట్టు మరో 20 పరుగులు సాధించాలి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 198; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: జార్జియా వోల్ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్‌ఫీల్డ్ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 76; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్ సదర్లాండ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 129; బెత్ మూనీ (సి) జెమీమా (బి) స్నేహ్ రాణా 19; యాష్లీ గార్డ్నర్ (బి) క్రాంతి 1; తాలియా (సి) స్మృతి మంధాన (బి) షఫాలీ 13; అలానా కింగ్ (సి) స్నేహ్ రాణా (బి) సయాలీ 21; లూసీ హామిల్టన్ (సి) స్నేహ్ రాణా (బి) సయాలీ 23; డార్సీ బ్రౌన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (90.4 ఓవర్లలో ఆలౌట్) 323. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58, 4–186, 5–240, 6–241, 7–273, 8–277, 9–311, 10–323. బౌలింగ్: సయాలీ 18.4–2–50–4, క్రాంతి గౌడ్ 22–5–72–2, కాశ్వీ గౌతమ్ 11–1–46–0, స్నేహ్ రాణా 17–1–64–1, దీప్తి శర్మ 17–1–67–2, షఫాలీ 5–2–12–1. భారత్ రెండో ఇన్నింగ్స్: స్మృతి (బి) డార్సీ బ్రౌన్ 2; షఫాలీ (సి) బెత్ మూనీ (బి) లూసీ 5; ప్రతీక (బ్యాటింగ్) 43; జెమీమా (సి) బెత్ మూనీ (బి) సదర్లాండ్ 14; హర్మన్‌ప్రీత్ (సి) లూసీ (బి) సదర్లాండ్ 11; దీప్తి శర్మ (బి) లూసీ 9; రిచా ఘోష్ (సి) బెత్ మూనీ (బి) లూసీ 0; స్నేహ్ రాణా (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (29 ఓవర్లలో 6 వికెట్లకు) 105. బౌలింగ్: 1–2, 2–10, 3–38, 4–64, 5–82, 6–82. బౌలింగ్: డార్సీ బ్రౌన్ 9–1–37–1, లూసీ హామిల్టన్ 8–1–32–3, అనాబెల్ సదర్లాండ్ 6–2–15–2, తాలియా 6–1–15–0. 1 వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా అనాబెల్ రికార్డు నెలకొల్పింది. భారత్‌తో టెస్టుకంటే ముందు దక్షిణాఫ్రికాపై (210; 2024లో), ఇంగ్లండ్‌పై (163; 2025లో) అనాబెల్ సెంచరీలు సాధించింది. అనాబెల్ తన తొలి సెంచరీని 2023లో ఇంగ్లండ్‌పై (137 నాటౌట్) నమోదు చేసింది. -
హ్యాట్సాఫ్ హీలీ
ఆరుసార్లు ఐసీసీ మహిళల టి20 ప్రంపచకప్ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత... మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు... అత్యధిక స్టంపింగ్స్ చేసిన గుర్తింపు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్‌గా చరిత్ర. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్! ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. సుదీర్ఘ కెరీర్లో ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆ్రస్టేలియా మహిళల క్రికెట్ జట్టు దిగ్గజ ప్లేయర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం టీమిండియాతో ఆడిన తన కెరీర్ చివరి వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కిన హీలీ... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో చివరిసారి ఆసీస్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. మహిళల క్రికెట్లో దిగ్గజ స్థాయికి చేరిన హీలీ కెరీర్‌ను ఓసారి విశ్లేషిస్తే... – సాక్షి, క్రీడావిభాగం ఇప్పుండంటే అలీసా హీలీ పెద్ద స్టార్ అయిఉండవచ్చు కానీ... కెరీర్ తొలినాళ్లలో ఆమె మెరుగైన జీవనం కోసం రెస్టారెంట్లో పనిచేసింది. 2009–10 మధ్య హీలీ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కేఎఫ్సీలో పనిచేస్తూ క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించింది. అలా ఆమె పడ్డ శ్రమ వృథా పోలేదు. నిలకడగా రాణిస్తున్న హీలీకి 2010లో తొలిసారి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అలీసా... 11 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసింది. అప్పటికీ అదీ మహిళల వన్డేల్లో ఈ దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. లోయర్ ఆర్డర్లో జట్టుకు మంచి ‘పించ్ హిట్టర్’ దొరికిందని మేనేజ్మెంట్ భావించింది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. వికెట్ల వెనక అద్భుతమైన ప్రతిభ కనబర్చిన హీలీ... బ్యాటింగ్‌లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అయినా... కీపింగ్‌లో ఆమె అసాధారణ గణాంకాలు జట్టులో చోటుకు భరోసానిచ్చాయి. మలుపుతిప్పిన 2017 అప్పటి వరకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం... అవసరమైనప్పుడు ధాటిగా ఆడటం అలవాటు చేసుకున్న హీలీకి 2017లో అతిపెద్ద ప్రమోషన్ దక్కింది. ఆ ఏడాది అక్టోబర్‌లో హీలీకి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం దక్కింది. అప్పటి వరకు అడపాదడపా మెరుపులు మెరిపించిన అలీసా... ఇక దంచికొట్టడం ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఇన్నింగ్స్‌ను వాయువేగంతో ప్రారంభించడం అలవాటుగా మార్చుకుంది. 2017కు ముందు... ఆ తర్వాత ఆమె కెరీర్‌ను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. 2017 ముందు వరకు 52 మ్యాచ్‌లాడి 15.96 సగటుతో 495 పరుగులే చేసిన ఈ వికెట్‌కీపర్... ఆ తర్వాత 74 మ్యాచ్‌ల్లో 46.22 సగటుతో 3282 పరుగులు చేసింది. వన్డేల్లో అలీసా స్ట్రయిక్‌రేట్ వందకు పైగా ఉంది అంటే ఆమె ఆటతీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘నిజం చెప్పాలంటే కెరీర్ తొలి ఏడెనిమిది సంవత్సరాలు నేనేం అంత బాగా ఆడలేదు. అంతగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశా’ అని ఇటీవల హీలీ వెల్లడించింది. 8 వరల్డ్‌కప్‌ల విజేత... అంతర్జాతీయ క్రికెట్లో ఆ్రస్టేలియా హవా సాగుతున్న సమయంలోనే హీలీ కెరీర్ కొనసాగింది. దీంతో సహజంగానే ఆమె ఖాతాలో అత్యధిక వరల్డ్‌కప్‌లు చేరాయి. 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో హీలీ సభ్యురాలు... మహిళల క్రికెట్లో మరే ప్లేయర్ ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఇక 2013, 2022 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులోనూ హీలీ ప్రధానపాత్ర పోషించింది. 2022 వరల్డ్‌కప్ పైనల్లో ఆమె కొట్టిన సెంచరీని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు చేసి ఆసీస్ భారీ విజయానికి అలీసా బాటలు వేసింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించిన హీలీ... టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన ఆసీస్ సారథి... ఆసీస్‌లో టీమిండియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హీలీ బ్యాటింగ్ చూసిన వారెవరైనా ఆమెకు 35 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. కెరీర్ ఆఖరి వన్డేలోనూ అలవోకగా పరుగులు రాబట్టిన హీలీ అనవసరంగా రిటైర్మెంట్ ప్రకటించిందనే అనుమానం రాకమానదు. తన కెరీర్లో చివరి వన్డేలో కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ ఓపెనర్ 98 బంతుల్లోనే 158 పరుగులు చేసింది. ఆమె కెరీర్లో ఎన్నో శతకాలు ఉన్నా... దీని ప్రత్యేకతే వేరు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారానే అలీసా 120 పరుగులు రాబట్టడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన హీలీ... శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనుంది. గతేడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోయినా... భవిష్యత్తుల్లో అలీసా మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడటం ఖాయమే. మిచెల్ స్టార్క్‌తో వివాహబంధం...క్రీడా కుటుంబానికే చెందిన హీలీ మొదటి నుంచే మంచి అథ్లెట్. దీంతో కష్టతరమైన క్యాచ్‌లను సైతం ఎంతో ఒడుపుగా అందుకునేది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ హీలీ అన్న కుమార్తెగా తనమీద ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్‌తో హీలీకి పరిచయం ఏర్పడింది. స్టార్క్ కూడా వికెట్ కీపర్‌గానే కెరీర్ ప్రారంభించగా... వీరిద్దరి మనసులు కలిసి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అండగా నిలుస్తూ... రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడిన తొలి భార్యాభర్తలుగా రికార్డు సృష్టించిన వీరిద్దరూ... పలు సందర్భాల్లో తమ మధ్య అవగాహనను బాహాటంగానే వెల్లడించారు. 2020లో మహిళల ప్రపంచకప్ ఫైనల్లో తన భార్య ఆట చూసేందుకు స్టార్క్ వన్డే సిరీస్ నుంచి సెలవు తీసుకొని స్వదేశానికి చేరడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. -
పైచేయి కోసం...
అడిలైడ్: పొట్టి ఫార్మాట్లో మిగిలిపోయిన ఆఖరి పోరులో గట్టిగా పోరాడి పైచేయి సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ‘సై’ అంటున్నాయి. ఇరుజట్ల మధ్య శనివారం ఇక్కడ ఆఖరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఈ ఒక్క టి20లకే పరిమితం కాని ఈ పర్యటనలో సిరీస్ గెలవాలంటే ఇంకా రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత టి20ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా నిలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఓవరాల్ సిరీస్‌లో 4–2 పాయింట్లతో (మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు) ఆధిక్యం సంపాదిస్తుంది. దీంతో తదుపరి మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్‌లకు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా లక్ష్యం కూడా సిరీస్ కాదు... నేటి మ్యాచ్ విజయమే! ఇదే జట్టులో స్థయిర్యాన్ని పెంచుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. బ్యాటర్లదే భారం తొలి మ్యాచ్‌లో వర్షంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నెగ్గిన హర్మన్ బృందం... పూర్తిస్థాయిలో జరిగిన రెండో టి20లో చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఇద్దరే 30 పైచిలుకు పరుగులు చేస్తే... ప్రధాన బ్యాటింగ్ బలం క్రీజులోకి దిగిన వారంతా ఆసీస్ బౌలింగ్‌కు దాసోహమయ్యారు. అదే ఈ మ్యాచ్‌లో పునరావృతం చేస్తే వన్డే సిరీస్‌కు ముందే టీమిండియా వెనుకబడిపోతుంది. ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టాపార్డర్, మిడిలార్డర్ మరింత బాధ్యతగా ఆడాలి. అప్పుడే ఈ సుదీర్ఘ ఓవరాల్ సిరీస్ (టి20, వన్డే, టెస్టు)లో భారత్ పుంజుకోగలుగుతుంది. లేదంటే పరాజయాలతో, పాయింట్లతో ఆఖరికి మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంది. జెమీమా రోడ్రిగ్స్, హిట్టర్లు రిచా ఘోష్, అమన్‌జోత్‌లు దంచేసే పనిలో ముందుంటే భారత్ కూడా ఈ ఓవరాల్ సిరీస్‌లో ముందంజ వేస్తుంది. బ్యాటర్లతో పోల్చితే రేణుక, క్రాంతి, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణిలు బౌలింగ్‌లో కాస్త మెరుగ్గానే రాణిస్తున్నారు. మరోవైపు ఫామ్‌లోకి వచి్చన ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్‌లోనూ రాణించి పైచేయి సాధించాలని ఆశిస్తోంది. -
ఛేజింగ్‌లో తడబాటు...
కాన్బెర్రా: తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా మహిళల జట్టు తేరుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి రెండో టి20లో విజయాన్ని అందుకుంది. ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత మహిళల జట్టు చివరకు 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన సోఫీ మోలినెక్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు సాధించింది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 అడిలైడ్‌లో శనివారం జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఆసీస్ జట్టుకు ఓపెనర్లు జార్జియా వోల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. 15వ ఓవర్లో బెత్ మూనీని హైదరాబాద్ బౌలర్ అరుంధతి అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్ 35 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెండు వికెట్లు, రేణుక ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (24 బంతుల్లో 31; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (23 బంతుల్లో 29; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో షఫాలీ, జెమీమా, స్మృతి అవుటవ్వడంతో భారత్ ఛేజింగ్‌లో వెనుకబడింది. హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 36; 5 ఫోర్లు) దూకుడు కనబరిచినా 17వ ఓవర్లో ఆమె అవుటవ్వడంతో భారత్ విజయంపై ఆశలు వదులుకుంది. ఆసీస్ బౌలర్లలో యాష్లీ గార్డ్నర్ (3/22), కిమ్ గార్త్ (2/16), అనాబెల్ సదర్లాండ్ (2/18), సోఫీ మోలినెక్స్ (2/37) రాణించారు.356 అంతర్జాతీయ మహిళల క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గుర్తింపు పొందింది. హర్మన్ ఇప్పటివరకు 189 టి20లు, 161 వన్డేలు, 6 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (355 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్ బద్దలు కొట్టింది. -
మరో విజయం లక్ష్యంగా... నేడు రెండో టి20లో ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’
కాన్బెర్రా: ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై తొలి టి20లో నెగ్గిన భారత జట్టు... మరో విజయం లక్ష్యంగా నేడు జరిగే రెండో టి20లో బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1:45 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సిడ్నీలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 133 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఫలితం రావడానికి అవసరమైన కనీస ఐదు ఓవర్లు పూర్తి కావడంతో... ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో కనబరిచిన జోరును పునరావృతం చేసి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని హర్మన్ బృందం భావిస్తోంది. -
భారత మహిళల ‘ఎ’ జట్టు ఓటమి
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓవర్‌నైట్ స్కోరు 260/8తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత మహిళల ‘ఎ’ జట్టు 81.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు భారత జట్టు క్రితం రోజు స్కోరుకు 26 పరుగులు జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అమీ ఎడ్గర్ 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం 281 పరుగుల లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు 85.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. రాచెల్ ట్రెనామన్ (143 బంతుల్లో 64; 6 ఫోర్లు), మ్యాడీ డార్క్ (116 బంతుల్లో 68; 6 ఫోర్లు), అనికా లిరాయ్డ్ (125 బంతుల్లో 72; 9 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ తహిలా విల్సన్ (104 బంతుల్లో 46; 4 ఫోర్లు) సైతం రాణించింది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకుంది. -
టాపార్డర్ విఫలం
బ్రిస్బేన్: టాపార్డర్ విఫలమవడంతో... ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో గురువారం ప్రారంభమైన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు కష్టాల్లో పడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట నలిచే సమయానికి 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (38 బంతుల్లో 35; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. మరో ఓపెనర్ నందిని కశ్యప్ (0), ధారా గుజ్జర్ (0) డకౌట్ కాగా... తేజల్ హసబి్నస్ (9; 2 ఫోర్లు), తనుశ్రీ సర్కార్ (13; 2 ఫోర్లు) విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ (8 బ్యాటింగ్; 1 ఫోర్), రాఘ్వీ బిస్త్ (26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు, వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. ఏకైక అనధికారిక టెస్టుకు వర్షం ఆటంకం కలిగించగా... ఆట సాగిన కాసేపులోనే భారత జట్టు వెనుకబడిపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురునిలవలేక మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో జార్జియా 3 వికెట్లు పడగొట్టింది. -
క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని...
పెర్త్: ఇప్పటికే ఆ్రస్టేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు ఆఖరి వన్డే బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం పెర్త్ వేదికగా చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో పోటీపడనుంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా... ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని ప్రయతి్నస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు... ఆఖరి వన్డేలో నెగ్గి హర్మన్ బృందం ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటుందా చూడాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఘోర ప్రదర్శన కనబర్చింది. సీనియర్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటడం లేదు. దీంతో బ్యాటింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీస్తోంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా టీమిండియా కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వరల్డ్‌కప్‌నకు ముందు బ్యాటింగ్ కూర్పునకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని భావించగా... అదీ సాధ్యపడలేదు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన యువ ఓపెనర్ షఫాలీ వర్మ స్థానంలో ఎవరిని ప్రయత్నించినా... ముద్ర వేయలేకపోగా... మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ మినహా తక్కిన వాళ్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆసీస్ ప్లేయర్లు 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు నమోదు చేస్తే... భారత్ నుంచి అత్యధికంగా రిచా ఘోష్ మాత్రమే ఒక హాఫ్ సెంచరీ చేసింది. రెండో వన్డే ఓటమి అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ... ‘ఎక్కువ సేపు క్రీజులో నిలవడంపై దృష్టి పెట్టాలి. మొత్తం 50 ఓవర్లు ఆడటంతో పాటు... బౌలింగ్‌లోనూ భిన్నమైన ప్రణాళికలు అమలు చేయాలి’ అని చెప్పింది. మరి మూడో మ్యాచ్‌లోనైనా అలాంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. మరోవైపు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా... ఆసీస్ అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జార్జియా వోల్... భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడుతోంది. ఆ తెగింపు మన ప్లేయర్లు కూడా కనబర్చాల్సిన అవసరముంది. 6 ఇప్పటి వరకు ఆ్రస్టేలియాతో మూడు లేదా అంతకంటే ఎక్కువ వన్డేలతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు ఆరుసార్లు (1984లో 0–4తో; 2006లో 0–3తో; 2008లో 0–5తో; 2012లో 0–3తో; 2018లో 0–3తో; 2023లో 0–3తో) క్లీన్‌స్వీప్ అయింది. -
తొలి వన్డే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియా-ఎ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల-ఎ జట్టు ఓటమితో ఆరంభిచింది. హర్రప్ పార్క్, మాకే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు.. 47 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ ఓపెనర్ క్యాటీ మాక్ అద్భుతసెంచరీతో చెలరేగింది. 126 బంతులు ఎదుర్కొన్న మాక్.. 11 ఫోర్లతో 129 పరుగులు చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ మెక్‌గ్రాత్(56) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్, మణి మిన్ను తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(82) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆసీస్ పేసర్ మాటిలన్ బ్రౌన్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 16న జరగనుంది. కాగా ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌ను ఆసీస్-ఎ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. -
ఆసీస్ క్రికెటర్ అద్భుత ప్రదర్శన.. బంతితో రాణించి, బ్యాట్‌తో డబుల్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు. దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్‌గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
ఓడినా మనసులు గెలుచుకుంది.. హీలీ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది. ఏమి జరిగిందంటే? ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్.. Alyssa Healy 🫶 🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl — Women's CricInsight (@WCI_Official) December 24, 2023 -
ఆస్ట్రేలియా కెప్టెన్ అనూహ్య నిర్ణయం.. గౌరవించిన సీఏ
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోనుంది. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మెగ్ లానింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపింది. కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా తరపున బిజీ క్రికెట్ ఆడాను. కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు మానసికంగా అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలనిపిస్తుంది. అందుకే ఈ లాంగ్ బ్రేక్. త్వరలో మళ్లీ జట్టులోకి వస్తా అంటూ 30 ఏళ్ల లానింగ్ పేర్కొంది. ''వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్న మెగ్ లానింగ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం.. మా క్రికెట్లో బ్రేక్ అనే పదానికి మెగ్ లానింగ్ అర్హురాలు'' అంటూ ట్విటర్లో పేర్కొంటూ ఆమెకు మద్దతిచ్చింది. ఇటీవలే నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఆసీస్ మహిళల జట్టు స్వర్ణం పతకం ఎగురేసుకుపోయిన సంగతి తెలిసింది. టీమిండియా మహిళలతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా వుమెన్స్ విజయం సాధించిన స్వర్ణం కొల్లగొట్టగా.. భారత్ రజతం కైసవం చేసుకుంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో మెగ్ లానింగ్ తనదైన ముద్ర వేసింది. లానింగ్ ఖాతాలో రెండు మహిళల వన్డే ప్రపంచకప్‌లతో పాటు.. నాలుగు టి20 ప్రపంచకప్‌లు ఉండడం విశేషం. ఇందులో మూడు టి20 ప్రపంచకప్‌లు(2014, 2018, 2020)లానింగ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా గెలవడం విశేషం. మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డులు.. ►వన్డేల్లో అత్యధిక సెంచరీలు మెగ్ లానింగ్ పేరిటే ఉన్నాయి. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు సాధించింది. ►టి20ల్లో ఆస్ట్రేలియా మహిళల తరపున 2వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా రికార్డు. ►మిథాలీ రాజ్(భారత్), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) తర్వాత 150 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మూడో క్రీడాకారిణిగా రికార్డు ►ఓవరాల్‌గా మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా మహిళల జట్టు తరపున 6 టెస్టుల్లో 93 పరుగులు, 100 వన్డేల్లో 4463 పరుగులు, 115 టి20ల్లో 3007 పరుగులు సాధించింది. If anyone deserves a break, it's Meg Lanning. pic.twitter.com/BC8fKTwSDw — Cricket Australia (@CricketAus) August 10, 2022 చదవండి: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి! -
తొలి వన్డేలో టీమిండియా చిత్తు.. ఆసీస్ రికార్డు విజయం
మెక్కే: 3 వన్డేల సిరీస్‌లో భాగంగా హారప్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేయగా.. ఆసీస్ మహిళా జట్టు మరో 9 ఓవర్లు మిగిలుండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఓపెనింగ్ బ్యాటర్ రేచల్ హేన్స్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చగా.. మరో ఓపెనర్ అలైసా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా.. యస్తికా భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), గోస్వామి (24 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33), మోలినెక్స్(2/ 39), డిర్లింగ్టన్(2/29) మిథాలీ సేనను దారుణంగా దెబ్బకొట్టారు. 4 వికెట్లతో చెలరేగిన డార్సీ బ్రౌన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 24న) జరుగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా వరుసగా 25వ విజయం సాధించి విజయాల పరంపరను కొనసాగించింది. మరోవైపు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన కెరీర్లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఇన్నింగ్స్‌ల్లో ఆమె 75 నాటౌట్, 59, 72, 79 పరుగులు చేసింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు.. -
భారత మహిళల ‘ఎ’ జట్టుకు రెండో ఓటమి
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో ఆ్రస్టేలియా 37 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సారథి తహిలా మెక్‌గ్రాత్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో స్యామి జో జాన్సన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (2/22) రాణించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి ఓడిపోయింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (1) విఫలమైంది. వేద కృష్ణమూర్తి (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో అరుంధతి రెడ్డి (14 బంతుల్లో 19; 1 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ స్కోరు 100 పరుగులు దాటగలిగింది. తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడగా... నామమాత్రపు మూడో టి20 ఈనెల 23వ తేది జరుగుతుంది. -
ముక్కోణపు టి20 టోర్నీ విజేత ఆస్ట్రేలియా
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముక్కోణపు టి20 టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో 88 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), విలానీ (51; 8 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. స్కీవర్ (50; 5 ఫోర్లు) రాణించింది. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షుట్ 3 వికెట్లు పడగొట్టింది. లానింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రోల్టన్
ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ సారథి కరెన్ రోల్టన్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు సందర్భంగా ఆమెకు ఈ పురస్కారం అందజేశారు. తొలి రోజు ఆటలో డిన్నర్ బ్రేక్ సమయంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ ఆమెకు ప్రత్యేక క్యాప్‌ను అందజేశారు. ఐసీసీ విశిష్ట క్రికెటర్ల జాబితాలో ఓవరాల్‌గా ఆమె 81వ ప్లేయర్‌కాగా... ఆరో మహిళా క్రికెటర్. -
ఆసీస్ మహిళల గెలుపు
సిలెట్: మెగ్ లానింగ్ (65 బంతుల్లో 126; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) టి20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 78 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. లానింగ్ వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 పరుగులతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. బేట్స్ (61 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేయగా, పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది.


