
భారత ‘ఎ’ జట్టు 93/5
ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు
బ్రిస్బేన్: టాపార్డర్ విఫలమవడంతో... ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో గురువారం ప్రారంభమైన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు కష్టాల్లో పడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట నలిచే సమయానికి 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (38 బంతుల్లో 35; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది.
మరో ఓపెనర్ నందిని కశ్యప్ (0), ధారా గుజ్జర్ (0) డకౌట్ కాగా... తేజల్ హసబి్నస్ (9; 2 ఫోర్లు), తనుశ్రీ సర్కార్ (13; 2 ఫోర్లు) విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ (8 బ్యాటింగ్; 1 ఫోర్), రాఘ్వీ బిస్త్ (26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు, వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది.
ఏకైక అనధికారిక టెస్టుకు వర్షం ఆటంకం కలిగించగా... ఆట సాగిన కాసేపులోనే భారత జట్టు వెనుకబడిపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురునిలవలేక మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో జార్జియా 3 వికెట్లు పడగొట్టింది.