
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో వోల్వార్డ్ 200 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకుంది. మహిళల ప్రపంచకప్-2025లో వైజాగ్ వేదికగా భారత్‌తో మ్యాచ్ సందర్భంగా వోల్వార్డ్ ఈ ఫీట్ సాధించింది.
2016లో సౌతాఫ్రికా తరపున ఇంటర్ననేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన లారా.. ఇప్పటివరకు 4 టెస్టులు, 112 వన్డేలు, 83 టీ20లు ఆడింది. 26 ఏళ్ల లారా గతేడాది సౌతాఫ్రికా ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు వోల్వార్డ్ చేర్చింది.
అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడవ మహిళా క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు 9 వన్డే సెంచరీలు, టీ20, టెస్టుల్లో ఒక్కో శతకం సాధించింది. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 7013 పరుగులు చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ అద్బుతమైన పోరాటం కనబరిచింది. కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్రతికా రావల్(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
చదవండి: డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధనలు ఇవే?