టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు.
వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'
— crictalk (@crictalk7) January 11, 2026


