breaking news
ICC Womens ODI Cricket World Cup
-
4 బంతుల్లో 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఓటమి
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్య చేధనలో అద్భుతంగా పోరాడిన బంగ్లా బ్యాటర్లు.. ఆఖరిలో చేతులుత్తేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ వేసే బాధ్యతను శ్రీలంక కెప్టెన్ చమిరి అతపట్టు తీసుకుంది. చివరి ఓవర్లో అతపట్టు అద్భుతం చేసింది. తొలి బంతికే రబేయా ఖాన్ ఎల్బీగా ఔటయ్యింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్. మూడో బంతికి సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.మళ్లీ నాలుగో బంతికి మరుఫా అక్తర్ ఎల్బీగా వెనుదిరిగింది. లంక కెప్టెన్ దెబ్బకు బంగ్లా జట్టు వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చేంది. దీంతో బంగ్లా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో షర్మిన్ అక్తర్(64),నిగర్ సుల్తానా(77) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. లంక బౌలర్లలో చమిరి ఆతపట్టు నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుమారి రెండు, ప్రభోధిని ఓ వికెట్ సాధించారు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆతపట్టు(46),నీలాక్షి డిసిల్వా(37) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరినా అక్తర్ మూడు, రబియా ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు.ఈ ఓటమితో బంగ్లా జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.చదవండి: రిజ్వాన్‌పై వేటు.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే? -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్.. 10 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. మంధానతో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయండంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.హర్మన్ సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్లో ఇది ఐదవ ప్రపంచకప్. ఇప్పటివరకు హర్మన్ 31 మ్యాచ్‌లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్‌గా ఈ జాబితాలో హర్మన్ ఏడో స్దానంలో ఉంది.👉అదేవిధంగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్‌గా ప్రపంచరికార్డు హర్మన్ నెలకొల్పింది.👉మహిళల వన్డేల్లో నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో (4289) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నాట్ స్కైవర్ 4205 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.చదవండి: మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్ -
మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.ఇది భారత్‌కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది."గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్‌లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము. నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్‌లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో అదనపు బౌలర్‌తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. గెలిచే మ్యాచ్‌లో కూడా!
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్ వాన బారిన పడింది. బుధవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. వాన కారణంగా మ్యాచ్‌ను ముందుగానే 31 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 31 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. చార్లీ డీన్ (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతావారంతా విఫలమయ్యారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (4/27) ప్రత్యరి్థని దెబ్బ కొట్టగా, సాదియా ఇక్బాల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి పాక్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఈ దశలో వచ్యిన వాన ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. సునయాసంగా గెలిచే మ్యాచ్‌లో పాక్‌ను వరుణుడు దెబ్బకొట్టాడు.ఈ ఫలితం తర్వాత ప్రతీ జట్టు సరిగ్గా నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా...ఇంగ్లండ్ (7 పాయింట్లు), ఆ్రస్టేలియా (7), దక్షిణాఫ్రికా (6), భారత్ (4) జట్లు తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?
వారిద్దరూ వరల్డ్ క్రికెట్లో పవర్ ఫుల్ జోడీ. ఒకరేమో తన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఫాస్ట్ బౌలర్.. మరొకరు తన బ్యాటింగ్‌తో బౌలర్లకు చెమటలు పట్టించే డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా ఈ జంటకు ప్రత్యర్ధి భారత్ అయితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అతడు రెండేళ్ల కిందట తన బౌలింగ్‌తో వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాకు గుండె కోత మిగల్చగా.. ఇప్పుడు అతడి భార్య మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించింది. ఈపాటికే ఆ స్టార్ జంట ఎవరన్నది మీకు ఆర్ధమై ఉంటుంది. వారిద్దరూ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, అతడి భార్య అలీసా హీలీ. ఆసీస్ మెన్స్ టీమ్‌లో స్టార్క్ కీలక సభ్యునిగా కొనసాగుతుంటే.. మహిళల జట్టు కెప్టెన్‌గా హీలీ వ్యవహరిస్తోంది.హీలీ సూపర్ సెంచరీ..మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో హీలీ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దారుణ ప్రదర్శన కనబరిచిన అలిస్సా .. భారత్‌పై మాత్రం విశ్వరూపాన్ని చూపించింది. 331 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 142 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకుంది. ఆమె ఇన్నింగ్స్‌కు భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా మూడో విజయం. అంతేకాకుండా మహిళల వన్డేలో అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా కంగారులు నిలిచారు.కెప్టెన్‌గా అదుర్స్..ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా 2023లో హీలీ నియమించబడింది. అయితే అంతకుముందు చాలా మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా ఆమె వ్యవహరించింది. మాగ్ లానింగ్ రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హీలీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె కెప్టెన్సీలో 55 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్..42 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా ఆసీస్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.ప్రేమించి పెళ్లాడి..మిచెల్ స్టార్క్, హీలీది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందిన వీరిద్దరికి 9 ఏళ్ల వయస్సు నుంచే పరిచయం ఉంది. వారిద్దరూ అండర్-10 క్రికెట్ టోర్నీల్లో ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించేవారు. 15 ఏళ్ల వరకు ఒకే టీంకు ఆడిన వీరు అనంతరం విడిపోయారు. పురుషుల జట్టుకు ఆడేందుకు స్టార్క్ వెళ్లగా... మహిళల జట్టుకు ఆడేందుకు హేలీ సిద్ధమైంది. 2013లో స్టార్క్ హేలీపై తన ప్రేమను బయటపెట్టాడు. అందుకు హీలీ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
ఒకే ఒక తప్పు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 331 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు.ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అలీసా హీలీ(142) అద్భుత శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లతో సత్తాచాటింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తొలుత బ్యాటింగ్‌లో అదనంగా కొన్ని పరుగులు సాధించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చింది."ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించాము. కానీ ఆఖరిలో మా రిథమ్‌ను కోల్పోయాము. అదనంగా మరో 30–40 పరుగులు చేసింటే మేమే విజయం సాధించేవాళ్లం. చివరి 6–7 ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మేము అనుకున్న టార్గెట్‌ను సెట్ చేయలేకపోయాము.ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికి మేము సరిగా ఉపయోగించుకోలేకపోయాం. గత మూడు మ్యాచ్‌ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది.కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. చివరి ఓవర్లలో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాము. ఆటలో ఇలాంటివి సహజంగా జరగుతూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్‌లో 100 శాతం రాణించడం సాధ్యం కాదు. కానీ తిరిగి ఎలా పుంజుకున్నామన్నది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేము ఓటమిపాలైనప్పటికి మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. చరణి ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె నిజంగా అద్భుతం. జట్టుకి అవసరమైనప్పుడు ప్రతీసారి చరణి ముందుంటుంది. హీలీ లాంటి బ్యాటర్‌కి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మాకు వికెట్ అందించగలదు. మా జట్టు కాంబనేషన్ గురించి ఎటువంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్‌తోనే మేం విజయాలు సాధించాం. ఒకట్రెండు ఓటములతో ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. మా తదుపరి మ్యాచ్‌లపై దృష్టిపెడతాము అని హర్మన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
మహిళల ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 331 పరుగుల భారీ లక్ష్య చేధనలో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచరీతో చెలరేగింది.107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 142 పరుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఫలితంగా భారీ టార్గెట్‌ను ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్(40), పెర్రీ(47), గార్డనర్(45) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బౌలర్లు ఆఖరిలో పోరాడినప్పటికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.ఆసీస్ వరల్డ్ రికార్డు..ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్‌తో లంక ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.మహిళల వన్డే క్రికెట్లో హైయిస్ట్ ఛేజింగ్‌లు ఇవే..1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7 2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4 3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289 4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283 5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్ -
టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రోటీస్‌కు మరుపురాని విజయాన్ని అందించింది.అయితే గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తమ ప్రవర్తన నియమావళిని ఉల్లఘించినందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించనప్పటికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది. 24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్‌మెంట్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో మ్లాబా తన స్పిన్ మ్యాజిక్‌తో భారత టాపార్డర్‌ను దెబ్బతీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్‌ను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపింది. అయితే 17వ ఓవర్లో హర్లీన్ డియోల్‌ను ఔట్ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్‌బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ -
చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
భారత మహిళల జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మరోసారి సత్తాచాటింది. మహిళల ప్రపంచకప్‌లో వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రిచా విధ్వంసం సృష్టించింది. విశాఖ మైదానంలో బౌండరీల మోత మ్రోగించింది. ఓపెనర్లు ప్రతికా రావెల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఆ తర్వాత వరుస క్రమంలో భారత్ వికెట్లు కోల్పోయింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిచా తన అద్బుత పోరాటంతో జట్టును ఆదుకుంది. తన ఫైటింగ్ నాక్‌తో 102/6 నుంచి 251 వరకూ టీమిండియాకు మెరుగైన స్కోర్ అందించింది.లేడి ధోనిగా పేరు గాంచిన రిచా ఘోష్ కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిచా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.రిచా సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల వన్డే క్రికెట్లో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి ప్లేయర్‌గా రిచా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ క్లోయ్ ట్రయాన్ పేరిట ఉండేది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ట్రయాన్ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 74 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ట్రయాన్ ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది.👉వన్డేల్లో అత్యంత వేగంగా(బంతులు పరంగా) 1000 పరుగుల మార్క్ అందుకున్న భారత మహిళ క్రికెటర్ రిచా నిలిచింది. ఘోష్ కేవలం 1010 బంతుల్లోనే ఈ ఫీట్ అందుకుంది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. తొలి స్దానంలో ఆసీస్‌కు చెందిన యాష్ గార్డనర్(917) ఉంది.👉మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్‌గా రిచా రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫౌజీహ్ ఖలీలి పేరిట ఉండేది. 1982 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై ఫౌజీహ్ 88 పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో కీలక నాక్ ఆడిన రిచా.. 43 ఏళ్ల ఫౌజీహ్ రికార్డు బ్రేక్ చేసింది.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ -
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ డబుల్ సెంచరీ
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో వోల్వార్డ్ 200 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకుంది. మహిళల ప్రపంచకప్-2025లో వైజాగ్ వేదికగా భారత్‌తో మ్యాచ్ సందర్భంగా వోల్వార్డ్ ఈ ఫీట్ సాధించింది.2016లో సౌతాఫ్రికా తరపున ఇంటర్ననేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన లారా.. ఇప్పటివరకు 4 టెస్టులు, 112 వన్డేలు, 83 టీ20లు ఆడింది. 26 ఏళ్ల లారా గతేడాది సౌతాఫ్రికా ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు వోల్వార్డ్ చేర్చింది.అంతర్జాతీయ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడవ మహిళా క్రికెటర్‌గా ఆమె కొనసాగుతోంది. ఆమె కెరీర్లో ఇప్పటివరకు 9 వన్డే సెంచరీలు, టీ20, టెస్టుల్లో ఒక్కో శతకం సాధించింది. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 7013 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ అద్బుతమైన పోరాటం కనబరిచింది. కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్రతికా రావల్(37), స్నేహ్ రాణా(33) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, మల్బా, నాడిన్ డి క్లెర్క్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.చదవండి: డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! నిబంధనలు ఇవే? -
IND vs SA: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్..
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. హర్మన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లో కలిపి 343 మ్యాచ్‌లు ఆడింది.ఐసీసీ మహిళల ప్రపంచకప్( ICC Womens World Cup 2025)లో వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హర్మన్ ఈ ఫీట్ సాధించింది. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్(350) అగ్రస్దానంలో ఉంది. బేట్స్ ఇటీవలే న్యూజిలాండ్‌పై తన 350 మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది.కాగా 2009లో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా తన సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 154 వన్డేలు, 182 టీ20లు, 6 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత 2022 నుంచి భారత మహిళల జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా హర్మన్ కొనసాగుతోంది.100కి పైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్ కూడా హర్మాన్ ప్రీత్‌నే కావడం విశేషం. అదేవిధంగా టీ20ల్లో 3000కి పైగా పరుగులు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా కూడా కౌర్ రికార్డు సాధించింది. వన్డేల్లో ఏడు సెంచరీలు, ఓ టీ20 సెంచరీ ఆమె పేరిట ఉంది.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్ -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్‌లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్‌కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్‌ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్‌కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్‌లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్‌ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్‌ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్‌లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్‌లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా! -
తగ్గే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన భారత్
-
సౌతాఫ్రికా చిత్తు.. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది.ఇంగ్లీష్ జట్టు బౌలర్ల దాటికి సౌతాఫ్రికా అమ్మాయిలు విలవిల్లాడారు. దక్షిణాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో మొత్తం పది మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 14.1 ఓవర్లలో చేధించింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(21), అమీ జోన్స్(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. మూడు వికెట్లతో సత్తాచాటిన స్మిత్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచింది. వన్డేల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే తొలిసారి.చదవండి: ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్లు.. 69 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సినాలో జాఫ్తా(22) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా పది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. లిన్సే స్మిత్ మూడు వికెట్లతో సౌతాఫ్రికాను దెబ్బతీయగా.. స్కివర్ బ్రంట్, ఎకిలిస్టోన్, డీన్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సౌతాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యల్ప టోటల్‌ను నమోదు చేసిన రెండో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్ధానంలో ఉంది. న్యూజిలాండ్ 2009 ప్రపంచకప్‌లో 51 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఎమ్మా లాంబ్, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజానే కాప్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా -
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు
మహిళలవన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లే గార్డ్నర్ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, జెస్ కెర్ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ సోఫీ డివైన్ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ, అనాబెల్ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది.చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి -
గార్డనర్ సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ఇండోర్ వేదికగా శ్రీలకంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్‌కు ఆలౌటైంది.ఆసీస్ బ్యాటర్లలో స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను గార్డరన్ తన విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. లోయార్డర్ బ్యాటర్ కిమ్ గార్త్‌తో కలిసి ఏభై పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని గార్డనర్ నెలకొల్పారు. మొత్తంగా 83 బంతులు ఎదుర్కొన్న గార్డనర్.. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 115 పరుగులు చేసి ఔటయ్యారు. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లియా తహుహు, జెస్ కేర్ తలా మూడు వికెట్లు సాధించగా.. ఈల్లింగ్, అమీలియా కేర్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే లక్ష్య చేధనలో వైట్ ఫెర్న్స్ జట్టు తడబడుతోంది. 0 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.చదవండి: IND vs AUS: ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
రేపే బంగ్లా-పాక్ మ్యాచ్.. అంతలోనే హెడ్ కోచ్‌కు బ్రెయిన్ స్ట్రోక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో బంగ్లాదేశ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్న పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్దమైంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ మహిళల జట్టుకు ఊహించని షాక్ తగలింది. ఆ జట్టు హెడ్ కోచ్ సర్వర్ ఇమ్రాన్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు.అతడిని సోమవారం అస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది ఈ విషయాన్ని బంగ్లా టీమ్ మేనేజర్ ఎస్ఎం గోలం ఫయాజ్ ధృవీకరించారు. "ఇమ్రాన్ సర్వర్‌కు కొన్ని రోజుల క్రితం తల తిరుగుతున్నట్లు అన్పించింది. సోమవారం ఆయనకు ఆ సమస్య ఎక్కువైంది. వెంటనే సర్వర్‌ను అస్పత్రికి తీసుకెళ్లాము. సీటీ స్కాన్‌లో అతడికి స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు గుర్తించారు" అని ఫయాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్ అస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు అతడు టీమ్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక మాజీ కెప్టెన్ హషన్ తిలకరత్నే స్థానంలో ఇమ్రాన్ ఈ ఏడాది ఆరంభంలో బంగ్లా మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 66 ఏళ్ల ఇమ్రాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రత్యేక స్ధానం ఉంది. 2000లో బంగ్లాదేశ్ పురుషుల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో కోచ్‌గా అతడు పనిచేశాడు. అతడి గైడెన్స్‌లోనే బంగ్లాదేశ్ మహిళల జట్టు ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనడం ఇది రెండవసారి. ప్రధాన టోర్నీలో కూడా సత్తాచాటాలని బంగ్లా జట్టు ఉవ్విళ్లూరుతోంది.ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టునిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్టర్ (వైస్ కెప్టెన్), ఫర్జానా హక్, రుబ్యా హైదర్ ఝెలిక్, షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, షంజిదా అక్తర్, నిషితా అక్టర్ నిషి, సుమయ్యా అక్టర్ -
World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో (ICC Women's World Cup 2025) భాగంగా నిన్న (సెప్టెంబర్ 30) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో (India vs Sri Lanka) దీప్తి ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో జట్టుకు చాలా ముఖ్యమైన అర్ద సెంచరీ (53) సాధించి, అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటి 3 వికెట్లు (10-1-54-3) తీసింది. దీప్తితో పాటు అమన్‌జోత్ కౌర్ (57, 6-0-37-1), స్నేహ్ రాణా (28 నాటౌట్, 10-0-32-2) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో దీప్తి వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా టెయిలెండర్లతో అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. అమన్‌జోత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 103 పరుగులు, స్నేహ్ రాణాతో ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.అనంతరం బౌలింగ్‌లో అతి కీలకమైన చమారీ ఆటపట్టు (43) వికెట్‌తో పాటు కవిష దిల్హరి (15), వికెట్‌కీపర్ అనుష్క సంజీవని (6) వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టింది. శ్రీలంకపై గెలుపుతో టీమిండియా 2025 ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..భారత్- 269/8- వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారుశ్రీలంక- 211 ఆలౌట్- డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 59 పరుగుల తేడాతో భారత్ విజయంరెండో స్థానానికి ఎగబాకిన దీప్తిఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అనంతరం దీప్తి శర్మ మరో ఘనత కూడా సాధించింది. వన్డేల్లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో నీతూ డేవిడ్‌ను వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో జులన్ గోస్వామి టాప్‌లో ఉంది.భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు..255 - జులన్ గోస్వామి143 - దీప్తి శర్మ141 - నీతూ డేవిడ్100 - నూషిన్ అల్ ఖదీర్99 - రాజేశ్వరి గైక్వాడ్చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
శ్రీలంకతో తొలి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! తెలుగమ్మాయికి చోటు
మహిళల టీ20 ప్రపంచకప్-2025కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చామరి అథపట్టు తొలుత హర్మన్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్హనించింది.తొలి పోరుకు భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ దూరమైంది. 29 ఏళ్ల రేణుకా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ టాస్ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని, కాంబినేషన్ పరంగా తుది జట్టును ఎంపిక చేశామని పేర్కొనడం గమనార్హం.అయితే కాలిమడమ గాయం నుంచి కోలుకున్న రేణుకా ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్‌తో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో మొత్తం మ్యాచ్‌లు ఆడిన రేణుకా.. ఈ మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్‌లలో కూడా భాగమైంది. అయితే తొలి పోరుకు దూరమైనప్పటికి తదుపరి మ్యాచ్‌లలో రేణుకా ఆడే అవకాశముంది. మరోవైపు ప్లేయింగ్ ఎలెవన్‌లో తెలుగు అమ్మాయి శ్రీ చరణికి చోటు దక్కింది. కడపకు చెందిన చరణి ఇటీవల కాలంలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్ జట్టులో ఈ యువ ఆఫ్ స్పిన్నర్ భాగమైంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగింది. అమన్ జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ పేస్ బౌలర్లగా ఉన్నారు. మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.శ్రీలంక మహిళల ప్లేయింగ్ XI: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రనవీరభారత మహిళల తుది జట్టు : ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ODI World Cup 2025: శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ చమరి అటపత్తు వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు. 27 ఏళ్ల హర్షిత గత కొన్నాళ్లగా శ్రీలంక జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. హర్షిత 41 వన్డేల్లో 1,075 పరుగులు చేసింది. గతేడాది జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్‌పై హర్షిత అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. దీంతో 2024 ఆగస్టు నెలకు గాను సిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆమె ఎంపికైంది. అదేవిధంగా యువ పేస్ సంచలనం దేవ్మి విహంగాకు ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో దేవ్మి విహంగా 11 వికెట్లతో సత్తాచాటింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌లో గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.మహిళల వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టుచమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవీ విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, ఉద, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోదని, మల్కీ మదర, అచ్చిని కులసూర్యమహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా -
World Cup 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఈజ్ బ్యాక్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ అలిస్సా హీలీ తిరిగి టీమ్‌లోకి వచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు హీలీ నాయకత్వం వహించనుంది.ఇది ఆమెకు మూడో వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం. ఇక ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, మేగాన్ షుట్, వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. దీంతో ఆసీస్ స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.స్పిన్ యూనిట్లో మోలినెక్స్‌తో పాటు అలానా కింగ్, జార్జియా వేర్హామ్ కూడా ఉన్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, వేర్హామ్, కిమ్ గార్త్ వంటి యువ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడనున్నారు.అయితే ఈ ప్రధాన టోర్నీకి ముందు భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా ప్రపంచకప్‌కు ఎంపికైన ఆసీస్ జట్టే భాగం కానుంది. అదనంగా వికెట్ కీపర్ నికోల్ ఫాల్టమ్, ఆల్ రౌండర్ చార్లీ నాట్ భారత్‌తో సిరీస్‌లో ఆడనున్నారు.ఈ సిరీస్ ముగిశాక వీరిద్దరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఆసీస్ తమ వరల్డ్‌కప్ ప్రయణాన్ని ఆక్టోబర్ 1న న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఆరంభించనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రికార్డు స్దాయిలో ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా ఆసీస్ నిలిచింది.వరల్డ్‌కప్‌కు ఆసీస్ జట్టుఅలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.చదవండి: Asia Cup 2025: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్ -
వన్డే వరల్డ్‌కప్‌కు టిక్కెట్లు విడుదల.. కేవలం రూ. 100 మాత్రమే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. తాజాగా ఈ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. భారత్‌లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబై, విశాఖపట్నం నాలుగు వేదికలు కాగా.. శ్రీలంకలోని కొలంబోని ప్రేమదాస స్టేడియం 11 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.ఐసీసీ కీలక నిర్ణయం..అయితే అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియం రప్పించేందుకు అన్ని లీగ్ మ్యాచ్‌ల టిక్కెట్ల ధరను ఐసీసీ కేవలం రూ. 100 రూపాయలగా నిర్ణయించింది. మొదటి దశ టిక్కెట్ల అమ్మకాలు గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యాయి.అయితే ఫస్ట్ ఫేజ్‌లో కేవలం కేవలం గూగుల్ పే వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు గూగల్ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఇక రెండో దశ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెకెండ్ ఫేజ్‌లో టిక్కెట్లు మొత్తం అందరికి అందుబాటులో ఉంటాయి.కాగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు. ఈ మ్యాచ్‌తో పాటు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్, ఆస్ట్రేలియా vs శ్రీలంక టిక్కెట్లను కూడా ఇంకా అందుబాటులో ఉంచలేదు.కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30ను గౌహతి వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ సందడి చేయనుంది. వరల్డ్‌కప్ టిక్కెట్లు ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
ICC: వన్డే వరల్డ్‌కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI World Cup) టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక అప్డేట్ అందించింది. టోర్నమెంట్ ఓపెనర్‌లో భాగంగా ఆతిథ్య దేశాలు భారత్- శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ వేదికను మార్చింది.తొలుత బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ వన్డేను నిర్వహించాలని భావించిన ఐసీసీ.. తాజాగా దీనిని గువాహటిలోని బర్సపరా స్టేడియానికి మార్చింది. అదే విధంగా.. ఈ మెగా టోర్నీలో బెంగళూరులో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లన్నింటి వేదికను నవీ ముంబైకి తరలించింది.తొక్కిసలాటలో ప్రాణాలు పోయాయిఇటీవల ఐపీఎల్-2025 (IPL)లో విజేతగా నిలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి.. పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న విషాదరకర ఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దర్యాప్తులో తప్పంతా ఆర్సీబీదేనని తేలింది.నవీ ముంబైలో..ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన తర్వాత.. చిన్నస్వామి స్టేడియంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది.ఐసీసీ తాజా ప్రకటన ప్రకారం.. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో మూడు, సెమీ ఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం.. ఆ దేశ మహిళా జట్టు తటస్థ వేదికైన శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే.పాక్ జట్టు ఫైనల్ చేరితే?ఒకవేళ పాక్ జట్టు ఫైనల్ చేరితే మాత్రం నవీ ముంబై గాకుండా.. కొలంబోలో టైటిల్ పోరు జరుగుతుంది. ఇక బెంగళూరులో జరగాల్సిన భారత్ వర్సెస్ శ్రీలంక, ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లు మాత్రం నవీ ముంబైలో జరగడం ఖరారైంది.కాగా బెంగళూరు నుంచి వేదికను తరలించాల్సి వస్తే తిరువనంతపురంలో మ్యాచ్‌లు జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే, నవీ ముంబై తాజాగా ఈ మ్యాచ్‌ల ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కాగా సెప్టెంబరు 30న భారత్- శ్రీలంక మ్యాచ్‌తో గువాహటి వేదికగా వన్డే ప్రపంచకప్-2025 టోర్నీకి తెరలేవనుంది.వన్డే వరల్డ్‌కప్-2025లో టీమిండియా షెడ్యూల్ (అప్డేటెడ్)🏏సెప్టెంబరు 30- భారత్ వర్సెస్ శ్రీలంక- గువాహటి🏏అక్టోబరు 5- భారత్ వర్సెస్ పాకిస్తాన్- కొలంబో🏏అక్టోబరు 9- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- విశాఖపట్నం🏏అక్టోబరు 12- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- విశాఖపట్నం🏏అక్టోబరు 19- భారత్ వర్సెస్ ఇంగ్లండ్- ఇండోర్🏏అక్టోబరు 23- భారత్ వర్సెస్ న్యూజిలాండ్- నవీ ముంబై🏏అక్టోబరు 26- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- నవీ ముంబై.నాకౌట్ స్టేజ్ షెడ్యూల్🏏అక్టోబరు 29- సెమీ ఫైనల్ 1- కొలంబో/గువాహటి🏏అక్టోబరు 30- సెమీ ఫైనల్ 2- నవీ ముంబై🏏నవంబరు 2- ఫైనల్- కొలంబో/నవీ ముంబైవన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్‌బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర -
వన్డే ప్రపంచకప్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
మహిళల వన్డే ప్రపంచకప్-2025కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ వ్యవహరించనుంది. ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్లో స్కైవర్-బ్రంట్ బ్రంట్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.అదేవిధంగా తొడ కండరాల గాయం కారణంగా గత కొన్ని నెలలగా ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ హీథర్ నైట్ తిరిగి జట్టులోకి వచ్చింది. నైట్ తిరిగి రావడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టు సెలక్టర్లు ఎక్కవగా స్పిన్ విభాగంపై దృష్టిసారించారు.దీంతో స్పిన్నర్ల కోటాలో గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లిన్సే స్మిత్‌లకు చోటు దక్కింది. కాగా ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది. ఇటీవల సిరీస్‌లలో నిరాశపరిచిన కేట్ క్రాస్, మైయా బౌచియర్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ అత్యంత అనుభవజ్ఞులైన బౌలర్లలో ఒకరిగా నిలిచిన క్రాస్.. గతేడాది నుంచి గాయాలు,పేలవ ఫామ్‌తో సతమతమవుతోంది. ఆమె స్ధానాన్ని యువ పేసర్ ఎమ్ ఆర్లోట్తో భర్తీ చేశారు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఐదవ వన్డే ప్రపంచ కప్ టైటిలే లక్ష్యంగా ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.మహిళల ప్రపంచ కప్ కోసం ఇంగ్లండ్ జట్టు: ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్.చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్ -
ICC WC Qualifier: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.ఒక్క వికెట్ తేడాతోఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథాలాహోర్ వేదికగా ఐర్లాండ్‌తో పోరులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.పాక్ బెర్తు ఖరారుఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్‌లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్‌కప్‌కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
ICC Women's World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా
ICC Women's World Cup 2022 Winner Australia: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌ను 71 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగని మెగ్ లానింగ్ బృందం అజేయ రికార్డును కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలిస్సా హేలీ విధ్వంసం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) ఘనమైన ఆరంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టార్ బ్యాటర్ బెత్‌మూనీ సైతం అర్ధ సెంచరీ(47 బంతుల్లోనే 62 పరుగులు) సాధించింది. ఇక హేలీ అవుటైన తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. హేలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆదిలోనే గట్టి షాక్.. అయినా ఆమె ఒక్కతే భారీ లక్ష్యంతో బరిలోని దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్ మేగన్ షట్ ఆరంభంలోనే గట్టిషాకిచ్చింది. ఓపెనర్లు టామీ బీమౌంట్(27), డానియెల్ వ్యాట్(4) వికెట్లు కూల్చి మానసికంగా వారిని దెబ్బకొట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే వరుసగా వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ సీవర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె 121 బంతులు ఎదుర్కొని 148 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడంతో నటాలీ ఒంటరి పోరాటం వృథా అయింది. 43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఆసీస్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అలిస్సా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్ విజేత ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు ఆసీస్- 356/5 (50) ఇంగ్లండ్- 285 (43.4) -
WC 2022 Final: ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన అలిస్సా హేలీ..
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్‌క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్‌ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్‌తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు 1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022 2. ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007 3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003 4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979 చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్! -
WC 2022 Final: హేలీ ఊచకోత.. పాపం ఇంగ్లండ్ బౌలర్లు
Update: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. ఇంగ్లండ్‌ను 71 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ICC Women's World Cup 2022 Final: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలిస్సా హేలీ మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని విధించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చిన బెత్‌మూనీ సైతం 47 బంతుల్లోనే 62 పరుగులు సాధించింది. హేలీ అవుటైన తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. అప్పటికే ఇంగ్లండ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హేలీ విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా కొండంత లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుకు ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోలేకు మూడు, సోఫీ ఎక్లిస్టోన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఆసీస్ బ్యాటర్ యాష్లీ గార్డ్నర్ రనౌట్‌గా వెనుదిరిగింది. ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన స్కోరు: 356/5 (50). View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత్‌కు రెండో గెలుపు
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. భారత బౌలర్లు మాన్సి జోషి (3/4), దీప్తి శర్మ (2/8), పూనమ్ యాదవ్ (2/10), రాజేశ్వరి (2/18) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 29.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత్ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసి గెలిచింది.